కొత్తకోట దయాకర్ రెడ్డి

కొత్తకోట దయాకర్ రెడ్డి (1958, ఆగస్టు 18 - 2023, జూన్ 13) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన దేవరకద్ర నియోజకవర్గం, మక్తల్ నియోజకవర్గంల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహించాడు. కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[1]

కొత్తకోట దయాకర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి
తరువాత చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి
నియోజకవర్గం దేవరకద్ర నియోజకవర్గం & మక్తల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1958-08-18)1958 ఆగస్టు 18
పర్కాపూర్ గ్రామం, నర్వ మండలం, నారాయణపేట జిల్లా, తెలంగాణ
మరణం 2023 జూన్ 13(2023-06-13) (వయసు 64)
హైదరాబాదు
జీవిత భాగస్వామి సీతాదయాకర్ రెడ్డి
సంతానం సిద్ధార్థ, కార్తీక్
నివాసం హైదరాబాద్

జననం, విద్యాభాస్యం

మార్చు

కొత్తకోట దయాకర్ రెడ్డి 1958, ఆగస్టు 18తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లా, నర్వ మండలం, పర్కాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన బీఎస్సీ వరకు చదివాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

దయాకర్ రెడ్డికి సీతాదయాకర్ రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. సీతాదయాకర్ రెడ్డి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[2]

రాజకీయ జీవితం

మార్చు

కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం, ప్రస్తుతం ( దేవరకద్ర నియోజకవర్గం) నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లికొదురు వీరారెడ్డి చేతిలో 6751 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1994లో 44963 ఓట్ల మెజారిటీతో, 1999లో 22307 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లికొదురు వీరారెడ్డి పై గెలిచాడు.

కొత్తకోట దయాకర్ రెడ్డి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి చేతిలో 13783 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆయన 2009లో మక్తల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పై 5701 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

కొత్తకోట దయాకర్ రెడ్డి కాన్సర్ వ్యాధికి హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023, జూన్ 13 మరణించాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. V6 Velugu (19 October 2020). "టీడీపీ అధ్య‌క్షుడిగా ఎల్. ర‌మ‌ణ, ఉపాధ్యక్షురాలిగా సుహాసిని" (in ఇంగ్లీష్). Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  3. "Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత". EENADU. Archived from the original on 2023-06-13. Retrieved 2023-06-13.
  4. ABN (2023-06-13). "మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-13. Retrieved 2023-06-13.