కొల్లికొదురు వీరారెడ్డి

కొల్లికొదురు వీరారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అమరచింత నియోజకవర్గం ( ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం) నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కె.వీరారెడ్డి

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం అమరచింత నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947
తీలేరు గ్రామం , మరికల్ మండలం , నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం ఇద్దరు కుమార్తెలు, కుమారుడు
నివాసం బంజారా హిల్స్ హైదరాబాద్

కె.వీరారెడ్డి 1947లో తెలంగాణ రాష్ట్రం , నారాయణపేట జిల్లా , మరికల్ మండలం , తీలేరు గ్రామం లో జన్మించాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

కె.వీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తీలేరు సర్పంచ్‌గా, అమరచింత నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ డైరక్టర్‌గా, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మహబూబ్​నగర్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, డిసిసిబి చైర్మన్‌గా, అప్కాబ్‌ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశాడు.

ఆయన 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి సొం భూపాల్ పై 5318 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 1983, 1985లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. వీరారెడ్డి 1989లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి పై 6751 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికై ప్రభుత్వ విప్‌గా పని చేశాడు. ఆయన తరువాత 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.

కె.వీరారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో 7 మార్చి 2021న మరణించాడు. ఆయన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.[3][4][5][6]

మూలాలు

మార్చు
  1. Sakshi (22 September 2018). "మళ్లీ బరిలోకి !". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  2. Eenadu (25 October 2023). "ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  3. Andrajyothy. "అప్కాబ్‌ మాజీ చైర్మన్‌ వీరారెడ్డి గుండెపోటుతో మృతి". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  4. Mana Telangana (7 March 2021). "మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి మృతి". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  5. Sakshi (7 March 2021). "మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  6. Namasthe Telangana (7 March 2021). "మాజీ ఎమ్మెల్యే కె వీరారెడ్డి కన్నుమూత". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)