కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం
కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, ప్రస్తుత ప్రపంచ గమనాన్ని బట్టి కొన్ని దేశాలను "కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం" (Newly industrialized country ) అనే కొత్త వర్గంలో భాగంగా పరిగణిస్తారు.
ఈ కొ.పా.దేలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోకపోయినా, తతిమ్మా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థాయిని దాటి చాలా ముందుకు పోయాయి. ఈ కొపాదేల మరో లక్షణం వేగంగా వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ (ఎగుమతుల ప్రాధాన్యతలో సైతం ). వేగవంతమైన పారిశ్రామికీకరణ, మరో లక్షణం. సామాజికంగా మరో మార్పు, ఉద్యోగాలనిచ్చే పరిశ్రమలు, కర్మాగారాలు, అవి ఉండే పట్టణ ప్రాంతాలవైపు, వలసపోయే గ్రామీణ జనాభా.
- పెరిగిన సామాజిక స్వేచ్ఛ, పౌర హక్కులు
- బలమైన రాజకీయ నాయకులు
- వ్యవసాయం నుండి పారిశ్రమలకు మారుతున్న ఆర్థిక వ్యవస్థ.
- పెరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య విధానం (open-market economy)
- వివిధ ఖండాలకు విస్తరించిన పనిచేస్తున్న దేశీయ కంపెనీలి.
- విదేశాలనుండి వస్తున్న పెట్టుబడులు .
- బలమైన ప్రాంతీయ శక్తులుగా అవిర్భవించడం
- వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ.
ప్రస్తుత కొపాదే.లు
మార్చువివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాల ప్రకారం, "కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశం"గా ఈ క్రింది వాటిని పిలుస్తున్నారు.
ప్రాంతం | దేశం | కొనుగోలు శక్తి (PPP) ఆధారిత జాతీయాదయం (GDP) (బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు) [1] |
కొనుగోలు శక్తి (PPP) ఆధారిత తలసరి జాతీయాదయం (GDP) (బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు) [2] |
ఆదాయంలో అసమానతలు 2008-09[3][4] | మానవాభివృద్ధి సూచి (HDI, 2011) [5] | GDP పెరుగుదల శాతం, 2010 | తలసరి GDP పెరుగుదల శాతం, 2008 | Sources |
---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్రికా | దక్షిణాఫ్రికా | 555,340 | 10,977 | 63.1 | 0.619 (medium) | 2.78 | 1.29 | [6][7][8] |
ఉత్తర అమెరికా | మెక్సికో | 1,659,016 | 15,121 | 48.3 | 0.770 (high) | 5.52 | 0.75 | [6][7][8][9] |
దక్షిణ అమెరికా | బ్రెజిల్ | 2,309,138 | 11,845 | 54.7 | 0.718 (high) | 7.49 | 4.06 | [6][7][8][9] |
ఆసియా | చైనా | 11,316,224 | 8,394 | 45.3 | 0.687 (medium) | 10.3 | 10.4 | [6][7][8] |
భారతదేశం | 4,469,763 | 3,703 | 32.5 | 0.597 (medium) | 11.1 | 8.5 | [6][7][8] | |
మలేసియా | 447,595 | 15,578 | 46.2 | 0.761 (high) | 7.16 | 2.86 | [6][7][8] | |
ఫిలిఫ్ఫైన్స్ | 393,987 | 4,111 | 43 | 0.644 (medium) | 7.6 | 1.97 | [6][7][8][9] | |
థాయ్ లాండ్ | 622,914 | 9,693 | 40 | 0.682 (medium) | 7.8 | 1.84 | [6][7][8][9] | |
ఐరోపా | టర్కీ | 1,288.638 | 17,499 | 39 | 0.699 (high) | 9.0 | -0.34 | [6][7][8] |
గోల్డ్ మన్ సాచ్ అభిప్రాయం ప్రకారం, 2050నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు వరుసగా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, బ్రెజిల్, మెక్సికోలు.
అర్జెంటీనా, చిలీ, ఈజిప్టు, ఇండోనేసియా [10], రష్యాలను కూడా కొంతమంది కొపాదేలుగా పేర్కొంటున్నారు.
విమర్శలు
మార్చుఈ కొపాదేలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ ధరలకే కార్మికులు లభిస్తున్నారు. ఇది, ఆయా దేశాలకి, తక్కువ ధరకే సేవలనందిచడంలో తోడ్పడుతోంది. "న్యాయమైన వాణిజ్యం" గురించి మాట్లాడేవారి వద్దనుండి, ఇది తరచూ విమర్శలకు గురవుతోంది.
చైనాదేశంలో రాజకీయ స్వేచ్ఛలేకపోవడం, ఇంటర్నెట్ సెన్సార్షిప్పులు, మానవహక్కుల హననాలు సర్వసాధారణం.[11] అదే భారతదేశం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. భారతదేశ ప్రజలు అపరిమితమైన స్వేచ్ఛని అనుభవిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలోని అసమర్థ ప్రభుత్వాలు, వ్యవస్థలో గూడుకట్టుకుపోయిన అవినీతి విమర్శలకు గురయ్యే వాటిల్లో మొదటివరుసలో ఉంటాయి. దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే నుండి వస్తున్న వలసదారులలో ఇబ్బంది పడితూ ఉంటే, మెక్సికో డ్రగ్స్ వార్లతో ఇబ్బందులు పడుతోంది.[12]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ The World Bank: World Development Indicators Database. Gross Domestic Product 2011, PPP. Last revised on 18 September 2012.
- ↑ Data refer mostly to the year 2011. World Economic Outlook, Sep 2011, International Monetary Fund. Accessed on April 11, 2012.
- ↑ "GINI Index Data Table". World Bank. Retrieved 4 April 2012.
- ↑ Note: The higher the figure, the higher the inequality.
- ↑ United Nations report [1]
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 6.8 Mauro F. Guillén (2003). "Multinationals, Ideology, and Organized Labor". The Limits of Convergence. Princeton University Press. pp. 126 (Table 5.1). ISBN 0-691-11633-4.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 7.8 David Waugh (2000). "Manufacturing industries (chapter 19), World development (chapter 22)". Geography, An Integrated Approach (3rd ed.). Nelson Thornes Ltd. pp. 563, 576–579, 633, and 640. ISBN 0-17-444706-X.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 8.7 8.8 N. Gregory Mankiw (2007). Principles of Economics (4th ed.). ISBN 0-324-22472-9.
- ↑ 9.0 9.1 9.2 9.3 Paweł Bożyk (2006). "Newly Industrialized Countries". Globalization and the Transformation of Foreign Economic Policy. Ashgate Publishing, Ltd. p. 164. ISBN 0-7546-4638-6.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-10. Retrieved 2013-01-19.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-29. Retrieved 2013-01-19.
- ↑ http://knowledge.wharton.upenn.edu/article.cfm?articleid=2695
- ప్రణాళికా సంఘం, భారతదేశం