కొత్తగూడ (శేరిలింగంపల్లి)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం
కొత్తగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[3] ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడ ఫ్లైఓవర్ను నిర్మించింది.
కొత్తగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 084 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]
సమీప ప్రాంతాలు
మార్చు- శిల్పా హిల్స్
- జూబ్లీ గార్డెన్స్
- హనుమాన్ నగర్
- ఖాన్మెట్
- ఇజ్జత్నగర్
- హైటెక్ సిటీ
- మాదాపూర్
ప్రజా రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, విబిఐటి, రాంనగర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
మార్చు- నరసింహ స్వామి దేవాలయం
- అయ్యప్ప స్వామి దేవాలయం
- బ్రమరాంభ మల్లికార్జున సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
- దుర్గా దేవాలయం
- మసీదు-ఇ-జానీ
- దోస్తీయా
మూలాలు
మార్చు- ↑ "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Archived from the original on 7 ఏప్రిల్ 2022. Retrieved 15 September 2021.
- ↑ "Kothaguda Locality". www.onefivenine.com. Retrieved 2021-09-15.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 15 September 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.