కొలంబస్ (సినిమా)
కొలంబస్ 2015, అక్టోబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్. సామల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, మిస్తీ చక్రవర్తి, సీరత్ కపూర్, సప్తగిరి తదితరులు నటించగా, జితిన్ రోషన్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం హిందీ లోకి అనువాదం చేయబడింది.[2][3]
కొలంబస్ | |
---|---|
దర్శకత్వం | ఆర్. సామల |
రచన | ఎం. ఎస్. రాజు & ఆర్. సామల |
నిర్మాత | అశ్విని కుమార్ సహదేవ్ |
తారాగణం | సుమంత్ అశ్విన్, మిస్తీ చక్రవర్తి, సీరత్ కపూర్, సప్తగిరి |
ఛాయాగ్రహణం | భాస్కర్ సామల |
కూర్పు | కె.వి. కృష్ణారెడ్డి |
సంగీతం | జితిన్ రోషన్ |
నిర్మాణ సంస్థ | ఎకెఎస్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 22 అక్టోబరు 2015(భారతదేశం) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చురెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తున్న అశ్విన్ (సుమంత్ అశ్విన్) తన ప్రియురాలు ఇందు (మిస్తీ చక్రవర్తి) ను కలవరిస్తుంటాడు. జైలు నుంచి బయటికొచ్చిన తరువాత ఇందు అడ్రస్, ఫోన్ నెంబర్ల కోసం వెతుకుతుంటాడు. ఆ సమయంలో తనకి పరిచయమయిన నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్) సాయం తీసుకుంటాడు.
అశ్విన్, ఇందు దూరంకావడానికి కారణం మాజీ క్లాస్‌మేట్ వంశీ (రోషన్) అని తెలుసుకున్న నీరూ, వారి ప్రేమ గెలవడానికి సాయపదుతుంది. ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేసి, వంశీ మీద ఇందుకు అనుమానం కలిగేలా సినిమా హాలు బాత్రూమ్ దగ్గర సన్నిహితంగా మెలుగుతుంది. దాంతో వంశీ మీద అనుమానం పెరిగి, ఇందు అశ్విన్ తో పెళ్ళికి సిద్ధపడుతుంది. అదే సమయంలో అనుకోకుండానే అశ్విన్, నీరజ దగ్గరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందు, నీరజ ఇద్దరిలో చివరకు అశ్విన్ ఎవరికి దగ్గరవుతాడన్నది మిగతా సినిమా.[4][5]
నటవర్గం
మార్చు- సుమంత్ అశ్విన్ (అశ్విన్)
- మిస్తీ చక్రవర్తి (ఇందు)
- సీరత్ కపూర్ (నీరజ)
- సప్తగిరి (టీవీ సీరియల్ దర్శకుడు)
- రోహిణి (అశ్విన్ తల్లి)
- పృథ్వీ (అశ్విన్ తండ్రి)
- రోహన్ బషీర్ (వంశీ)
- నాగినీడు (నీరజ తండ్రి)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఆర్. సామల
- నిర్మాత: అశ్విని కుమార్ సహదేవ్
- రచన: ఎం. ఎస్. రాజు & ఆర్. సామల
- సంగీతం: జితిన్ రోషన్
- ఛాయాగ్రహణం: భాస్కర్ సామల
- కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: ఎకెఎస్ ఎంటర్టైన్మెంట్స్
పాటల విడుదల
మార్చు2015, అక్టోబరు 17న ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్, సినీ నిర్మాత కె.ఎస్. రామారావు, సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, చిత్ర నిర్మాత ఎం.ఎస్. రాజు, దర్శకుడు ఆర్. సామల, నటీనటులు సుమంత్ అశ్విన్, మిస్తీ చక్రవర్తి, సీరత్ కపూర్ హాజరయ్యారు.[6]
మూలాలు
మార్చు- ↑ Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 26 May 2020.
- ↑ Kumar (22 October 2015). "Columbus Telugu Movie Review & Rating – Sumanth Ashwin, Mishti, Seerat Kapoor". TRV News. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 26 May 2020.
- ↑ staff (22 October 2015). "Review : Columbus – Discovery of Love". 123 Telugu. Retrieved 26 May 2020.
- ↑ సాక్షి, సినిమా (23 October 2015). "లవ్... కొలంబస్". Sakshi. Archived from the original on 27 మే 2020. Retrieved 27 May 2020.
- ↑ 123 తెలుగు, సమీక్ష (24 October 2015). "కొలంబస్ – ప్రేమను వెతుక్కుంటూ ఓ 'కొలంబస్'!". www.123telugu.com. Retrieved 27 May 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ staff (17 October 2015). "'Columbus' Audio Launch". Indiaglitz. Retrieved 26 May 2020.