సుమంత్ అశ్విన్

నటుడు


సుమంత్ అశ్విన్[1] ఒక తెలుగు చలన చిత్ర నటుడు, చిత్ర దర్శకుడు,నిర్మాత అయిన ఎం. ఎస్. రాజు కొడుకు.[2][3] అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత అతను కేరింత, కొలంబస్ వంటి విజవంతమైన చిత్రాలలో నటించాడు.[4] సుమంత్‌ అశ్విన్‌ 13 ఫిబ్రవరి 2021న దీపిక ను వివాహమాడాడు.[5]

సుమంత్ అశ్విన్
జననం30 జూన్
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
( ఇప్పుడు తెలంగాణ, భారత దేశం లో ఉంది)
వృత్తిచలన చిత్ర నటుడు
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
ఎత్తు5' 8"
తల్లిదండ్రులుఎం. ఎస్. రాజు

జీవితం తొలి దశలోసవరించు

చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే ముందు సుమంత్ అశ్విన్[6] తన తండ్రితో కలిసి తన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో పని చేసారు.

నటనా జీవితంసవరించు

సుమంత్ అశ్విన్ 2012లో తన తండ్రి దర్శకత్వం వహించిన తూనీగా తూనీగా చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు.[7][8] ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అతని రెండొ చిత్రం అంతకు ముందు... ఆ తరువాత... మంచి విజయం సాదించింది, ఆ చిత్రం దక్షిణాఫ్రికాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చలన చిత్రానికి ప్రతిపాదన పొందింది.[9] సుమంత్ అశ్విన్ తన మొట్టమొదటి వాణిజ్య పరంగా లాభాన్నిచ్చిన చిత్రం లవర్స్ [10],ఆ చిత్రానికి దర్శకడు మారుతి సహ నిర్మాణించాడు. అతని నాలుగొ చిత్రం చక్కిలిగింత, ఈ చిత్రానికి డర్శకత్వం వహించిన వేమా రెడ్డి సుకుమార్ శిష్యుడు'[11][12] ఎం. ఎస్. రాజు ఈ సినిమాని తన కొడుకు మళ్ళి హీరొగా కన్నడ పునఃనిర్మాణం చేద్దామనుకున్నాడు, కానీ ఆ చిత్రం విడుదల కాక ముందే ఆ చిత్ర పునఃనిర్మాణ హక్కులు వెరే వారు సొంతం చేసుకున్నారు[13]

సుమంత్ అశ్విన్ తరువాతి చిత్రం కేరింతలో ఒక కళాశాల విద్యార్ధిగా నటించాడు. ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా అడవి సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు.ఈ చలన చిత్రం సానుకూల విమర్శలను పొందింది. అతని తరువాత చిత్రం కొలంబస్ కూడా విజయాన్ని సాదించింది.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం సహ నటి పాత్ర గమనిక
2012 తూనీగ తూనీగ రియా చక్రబర్తి కార్తీక్
2013 అంతకు ముందు... ఆ తరువాత.. ఈషా రెబ్బ‌ అనీల్
2014 లవర్స్ నందిత రాజ్ సిద్దు
2014 చక్కిలిగింత[14] చాందిని శ్రీదరన్ ఆది
2015 కేరింత[15] శ్రీదివ్య జై
2015 కొలంబస్[16] సీరత్ కపూర్ అశ్విన్
2016 రైట్ రైట్ పూజా జవేరి బస్ కండక్టర్
2017 ఎందుకిలా దనుష్ రిషి YuppTV వెబ్ సిరీస్
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ఆనిషా అంబ్రోస్ టైలర్
2018 హ్యపి వెడ్డింగ్ నీహారిక కొణిదెల
2018 ప్రేమకథా చిత్రమ్ 2 నందిత శ్వేత సుధీర్
2021 ఇదే మా కథ తాన్యా హోప్‌ చిత్రీకరణ జరుగుతుంది

మూలాలుసవరించు

 1. "Only cinema is my lover right now : Sumanth Ashwin"
 2. "I don't look at actors as competitors"
 3. "MS Raju's Son Sumanth's Film Launched"
 4. "Sumanth Ashwin now busy with Columbus"
 5. Sakshi (13 ఫిబ్రవరి 2021). "ఇంటివాడైన యంగ్‌ హీరో సుమంత్‌.. ఫోటోలు వైరల్‌". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 ఏప్రిల్ 2021.
 6. "Sumanth Ashwin Film reaches final leg"
 7. "M.S.Raju turns director for his son Sumanth Ashwin!"[permanent dead link]
 8. "Sumanth Ashwin’s Tuneega Tuneega in M S Raju & Dil Raju combination"/
 9. " Telugu Films Find Acclaim Global – Sumanth Ashwin"
 10. [1]
 11. [2]
 12. [3]
 13. [4]
 14. "Sumanth Ashwin's Chakkiligintha first look revealed"
 15. "Kerintha: Coming-of-age stories".
 16. Nadadhur, Srivathsan (23 అక్టోబరు 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 మే 2020.