మిస్తీ చక్రవర్తి
మిస్తీ చక్రవర్తి (ఇంద్రాణి చక్రవర్తి) భారతీయ చలనచిత్ర నటి.[5][6][7] 2014లో వచ్చిన చిన్నదాన నీ కోసం సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
మిస్తీ చక్రవర్తి | |
---|---|
జననం | ఇంద్రాణి చక్రవర్తి[1] 1987 డిసెంబరు 20[2] |
ఇతర పేర్లు | మిస్తీ చక్రవర్తి,[4] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | బీనా చక్రవర్తి |
బంధువులు | అనిరుద్ద |
జీవిత విశేషాలు
మార్చుమిస్తీ 1987, డిసెంబరు 20న పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జన్మించింది. తండ్రి నిర్మాణరంగం, తల్లి బీనా చక్రవర్తి గృహిణి. మిస్తీ అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి.[8]
ప్రచార చిత్రాలు
మార్చుమస్తీ వికో టెర్మరిక్ సంస్థకు ప్రచారంచేస్తూ, ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో నటించింది.[9]
సినిమారంగం
మార్చుసుభాష్ ఘాయ్ రూపొందించిన కాంచి: ది అన్ బ్రేకబుల్ హిందీ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.[10][11] నితిన్ - ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన చిన్నదాన నీ కోసం చిత్రంతో తెలుగులో తొలిసారిగా నటించింది.[12][13] పృథ్వీరాజ్ సుకుమారన్, జిను అబ్రహం కాంబినేషన్ లో వచ్చిన ఆడమ్ జోన్ చిత్రంతో మలయాళంలో తొలిసారిగా నటించింది.[14] ఎం. ఎస్. రాజు - సుమంత్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కొలంబస్ మిస్తీ రెండవ తెలుగు సినిమా.[15] మళ్ళీ బాలీవుడ్ కి తిరిగివెళ్ళిన మిస్తీ, ఇంద్ర కుమార్ రూపొందించిన మస్తీ సిరీస్ సినిమా గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో నటించింది.[16][17] 2017లో శ్రీజిత్ ముఖర్జీ రూపొందించిన చారిత్రాత్మక చిత్రం బేగం జాన్ లో నసీరుద్దీన్ షా, విద్యా బాలన్ పక్కన నటించింది. ఈ చిత్రం వేశ్యాగృహం నేపథ్యంలో తీయబడింది, ఇందులో షబ్నం పాత్రను పోషించింది.[18] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్ళను రాబట్టింది.[19]
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2014 | పోరిచోయి | రామి | బెంగాలీ | |
కాంచి: ది అన్ బ్రేకబుల్ | కాంచి | హిందీ | హిందీలో తొలిచితం | |
చిన్నదాన నీ కోసం | నందిని రెడ్డి | తెలుగు | తెలుగులో తొలిచిత్రం | |
2015 | కొలంబస్[20] | ఇందు | తెలుగు | |
2016 | గ్రేట్ గ్రాండ్ మస్తీ | రేఖ మీట్ మెహతా | హిందీ | |
2017 | బేగం జాను | శబ్నం | హిందీ | |
బాబు బాగా బిజి | రాధ | తెలుగు | ||
ఆడమ్ జోన్ | అమీ | మలయాళం | మలయాళంలో తొలిచిత్రం | |
2018 | బృహస్పతి | షాలిని | కన్నడ | కన్నడలో తొలిచిత్రం
ఉత్తమ తొలిచిత్ర నటిగా ఫిల్మీబీట్ అవార్డుకు నామినేట్ |
సెమ్మ బోత అగతీ | మధు | తమిళం | తమిళంలో తొలిచిత్రం | |
శరభ | దివ్య | తెలుగు | ||
2019 | మణికర్ణిక | కాశిభాయి | హిందీ | |
బుర్రకథ | హ్యాపీ | తెలుగు | ||
2023 | ఓ సాథియా | కీర్తి | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ Bhattacharya, Roshmila (28 March 2014). "Ghai's fifth M". Mumbai Mirror. Retrieved 23 May 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Raiza Wilson to Niharika Konidela and Reba Monica John, 7 divas who entered the Tamil movie industry this year". Times Now News. Retrieved 22 May 2020.
- ↑ "Indrani Chakraborty (Mishti) Archives - Koimoi". Koimoi.
- ↑ "Subhash Ghai renames Indrani Chakraborty as 'Mishti' for 'Kaanchi'". Indian Express. Retrieved 22 May 2020.
- ↑ Indrani Chakraborty is a fantastic actor: Subhash Ghai - Hindustan Times Archived 13 ఏప్రిల్ 2014 at the Wayback Machine
- ↑ ""Mishti Is One Of The Best Actors I Have Found" Subhash Ghai - Koimoi". 6 March 2013.
- ↑ "Kaanchi: Subhash Ghai picks Bengali debutante Mishti - Times of India".
- ↑ I don't act in front of the camera; I make love to it'. Rediff.com. Retrieved 22 May 2020.
- ↑ "Mishti Chakraborty actress better known as 'Vicco Girl': Unseen Pics & Wallpapers". boxofficecollection.in. 17 September 2015.
- ↑ "News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates". News18. Archived from the original on 2014-10-22. Retrieved 2020-05-23.
- ↑ "Trailer of Subhash Ghai's new film 'Kaanchi' starring Kartik Tiwari and newcomer Mishti tells tale of power". 7 March 2014.
- ↑ "Mishti Chakraborty happy to be part of India's second largest film industry". 26 December 2014.
- ↑ "Nithin- Karunakaran's movie heroine is Mishti - Telugu Movie News - IndiaGlitz.com".
- ↑ "Mishti and Miya join Prithviraj in Adam - Times of India".
- ↑ "Archived copy". Archived from the original on 25 April 2015. Retrieved 24 May 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Masti for Mishti".
- ↑ Hungama, Bollywood (17 June 2015). "Mishti, Ankita Shorey to star in Great Grand Masti - Bollywood Hungama".
- ↑ "Exclusive: 'Kanchi' actress Mishti reveals how she bagged 'Begum Jaan' | Bollywood Bubble". Bollywood Bubble (in అమెరికన్ ఇంగ్లీష్). 23 April 2017. Retrieved 24 May 2020.
- ↑ "'Begum Jaan' Box Office collection Week 1 - Times of India". The Times of India. Retrieved 24 May 2020.
- ↑ Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.