శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోగల విశ్వవిద్యాలయం
(శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయము. 1954లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో ప్రారంభమైంది. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
![]() శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం చిహ్నం | |
నినాదం | జ్ఞానం సమ్యగవేక్షణం |
---|---|
ఆంగ్లంలో నినాదం | "జ్ఞానం సరైన దృక్పథంలో వుంటుంది" |
రకం | ప్రభుత్వ విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1954 |
బడ్జెట్ | INR 185.2 million (12th plan)[1] |
ఛాన్సలర్ | బిశ్వభూషణ్ హరిచందన్ |
వైస్ ఛాన్సలర్ | కె. రాజారెడ్డి |
రెక్టర్ | వి.శ్రీకాంత రెడ్డి |
స్థానం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారత దేశం |
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.
శాఖలు మార్చు
తెలుగు శాఖ మార్చు
తెలుగు శాఖ విద్యార్థుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో ఉన్నాయి.[2]
విద్యనభ్యసించిన ప్రముఖులు మార్చు
- కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె - పండితుడు, సంస్కృతాంధ్ర కవి
- బండి నారాయణస్వామి - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు..
- పొంగూరు నారాయణ - నారాయణ విద్యా సంస్థల యజమాని, తెలుగుదేశం పార్టీ నాయకుడు
- వెంకయ్య నాయుడు - బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి
- నారా చంద్రబాబు నాయుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- సాకం నాగరాజ - తెలుగు కవి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమానికి పాటు పడుతున్న వ్యక్తి.