కోరంగి

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల గ్రామం

కోరంగి, కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలానికి చెందిన గ్రామం.ఈ గ్రామం కాకినాడ నుండి 15 కి.మీల దూరంలో ఉంది. ఈ గ్రామం ప్రసిద్ధి చెందిన కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది.

కోరంగి
—  రెవిన్యూ గ్రామం  —
కోరంగి is located in Andhra Pradesh
కోరంగి
కోరంగి
అక్షాంశరేఖాంశాలు: 16°48′N 82°14′E / 16.8°N 82.23°E / 16.8; 82.23
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కాకినాడ
మండలం తాళ్ళరేవు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,495
 - పురుషులు 6,186
 - స్త్రీలు 6,309
 - గృహాల సంఖ్య 3,307
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
ఫ్రెంచి పాలనలో ఉన్న యానాం పటంలో సూచించిబడిన కోరంగి గ్రామం.[1].

కోరంగి గ్రామం పేరు మీద నామకరణము చేసిన కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గోదావరి డెల్టాలో ఉంది. ఈ సంరక్షణా కేంద్రము ఉప్పునీటి మొసళ్ళు వంటి సరీసృపాలకు ప్రసిద్ధి చెందినది

Best nature place to visit October to may.

చరిత్ర మార్చు

కోరంగి చాలా ప్రాచీన గ్రామం. ప్లినీ కాలములో కోరింగ గ్రామం ఒక మూలాగ్రము (కేప్) పై ఉండేది. క్రమేణా కోరంగి బేలో ఇసుక మేట వేసి తీరము విస్తరించడం వలన ప్రస్తుతము కోరంగి గ్రామం తీరానికి కొన్ని మైళ్ళదూరములో ఉంది. ఈ విస్తరణ ప్రతి 20 సంవత్సరాలకు ఒక మైలు చొప్పున జరిగినది, ప్రతి పది సంవత్సరాలకు ఒక అడుగు చొప్పున మేట వేసింది.[2]

ప్రస్తుతం కోరంగి నదికి తూర్పు తీరాన ఉన్న కోరంగి పట్టణాన్ని 1759 ప్రాంతములో ఇంజరం రెసిడెంటు వెస్ట్‌కాట్ నిర్మింపజేశాడు. పశ్చిమ తీరములో నదికి ఆవలివైపు ఉన్న పాత కోరంగి దీనికంటే పురాతనమైనది.[3] కోరంగిలో మొదట డచ్చివారు స్థావరమేర్పరచుకున్నారు. 1759లో బ్రిటీషువారు ఈ పట్టణాన్ని చేజిక్కించుకొని ఇక్కడికి దక్షిణాన 5 మైళ్ళ దూరములో ఇంజరం వద్ద ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.[4] 1827లో ఫ్యాక్టరీ మూతవేసేవరకు ఇంజరంలో ఒక బ్రిటీషు వాణిజ్య రెసిడెంటు, ఆయన సిబ్బంది ఉండేవారు.[5] బ్రిటీషు వారి కాలములో కోరంగి తూర్పుతీరములోనే అత్యుత్తమ రేవుగా పేరు పొందినది[6]

1789లో ఒక తుఫాను తాకిడికి వచ్చిన ఉప్పెన వలన కోరంగిలో 20వేలమంది మరణించారు. 1839, నవంబర్ 25న వచ్చిన మరో పెద్ద తుఫాను వలన బలమైన గాలులతో పాటు 40 అడుగుల ఎత్తున వచ్చిన ఉప్పెనతో రేవు గ్రామమైన కోరంగి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ తుఫాను ఫలితంగా 30 వేల మంది ప్రజలు మరణించారు.[7]ఆంగ్లభాషలో తుఫానుకు సమానపదమైన సైక్లోన్ను బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారి అయిన హెన్రీ పిడ్డింగ్టన్ 1789 డిసెంబరులో కోరంగిని ముంచెత్తిన పెనుతుఫానును వర్ణించడానికి కనిపెట్టాడు.[8]

వలసలు మార్చు

ఆంధ్రులు మారిషస్‌కి వలస వెళ్ళడం 1836లో కొరింగ నుండే ప్రారంభమయ్యింది. కొరింగ నుండి గాంజెస్‌ (గంగ) అనే నౌక ఎక్కి వెళ్లినట్లు రికార్డు ఉంది. ఆ తర్వాత విశాఖపట్నం పరిసరప్రాంతాల నుంచి చాలామంది వెళ్లారు. మారీషస్ కు తెలుగు వారి వలసలలో కొరింగ ఎంత ప్రధానత్య వహించిందంటే మారిషస్ లో తెలుగువాళ్ళను కొరింగలు అని పిలిచేవారు. ఒకేసారి ఎక్కువమంది తెలుగువాళ్ళు మారిషస్‌కి వెళ్ళే నౌక ఎక్కింది 1843లో. కొరింగా పాకెట్‌ అనే ఈ నౌక కొరింగ రేవు నుండి బయల్దేరింది. ఆ నౌక యజమాని పేరు పొనమండ వెంకటరెడ్డి. 1837 - 1880ల మధ్య దాదాపు 20 వేల మంది ఆంధ్రులు మారిషస్‌లోని చెరుకు తోటలలో కూలీలుగా పని చేయడానికి వెళ్ళారు. వాళ్ళలో ఎక్కువ మంది గంజాం, వైజాగ్‌, రాజమండ్రి ప్రాంతం వాళ్ళు.[9]

18వ శతాబ్ద మధ్యకాలంలో, తెలుగు వ్యవసాయ కూలీలు బ్రతుకు తెరువుకోసం కోరంగి రేవునుండి తెప్పలపై రంగూనుకు వలస వెళ్ళడం మొదలయ్యింది. అదృష్టవంతులు గమ్యాన్ని చేరేవాళ్ళు, దురదృష్టవంతులు నడిసముద్రంలో గల్లంతయ్యేవారు. ఈ ప్రవాసాంధ్రులను బర్మీయులు కోరంగీలనేవారు. ఈ వలస 1942లో జపనీయులు బర్మాపై దాడిచేసే వరకు సాగింది. త్వరగా డబ్బు చేసుకోవాలని వలస వెళ్ళిన ఈ జనం, విశాఖపట్నం, చీకాకోల్ (ఇప్పటి శ్రీకాకుళం), గోదావరి డెల్టాకు చెందినవారు. జల దుర్గ, చిల్క అనే పొగ ఓడలు ఈ వలసదారులను చేరవేయడంలో ప్రధాన పాత్రను నిర్వహించాయి.[10]

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,902.[11] ఇందులో పురుషుల సంఖ్య 5,923, మహిళల సంఖ్య 5,979, గ్రామంలో నివాసగృహాలు 2,929 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3307 ఇళ్లతో, 12495 జనాభాతో 1148 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6186, ఆడవారి సంఖ్య 6309. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1949 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 34. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587732[12].పిన్ కోడ్: 533 461.

గ్రామ భౌగోళికం మార్చు

ఇది మండల కేంద్రమైన తాళ్ళరేవు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కాకినాడ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.

ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల  ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.

సమీప బాలబడి యానాంలో ఉంది.

సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కాకినాడలోను, పాలీటెక్నిక్ పటవాలలోనూ ఉన్నాయి.

సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లో ఉన్నాయి.

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

కోరింగలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.  ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

కోరింగలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.

ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

  • గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.
  • వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
  • ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

కోరింగలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 177 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 562 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 409 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 362 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 46 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

కోరింగలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 46 హెక్టార్లు.

శ్రీ దుర్గామల్లేశ్వర వృద్ధులు బాలల ఆశ్రమం మార్చు

ఈ ఆశ్రమం కొత్త కోరంగిలో ఉన్నది.

ఉత్పత్తి మార్చు

కోరింగలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-06.
  2. Godavari District Gazetteer By F.R.Hemingway (పేజీ.9)
  3. Godavari District Gazetteer By F.R.Hemingway (పేజీ.211)
  4. http://www.1911encyclopedia.org/Coringa
  5. A Descriptive and Historical Account of the Godavery District in the Presidency of Madras By Henry Morris పేజీ.41 [1]
  6. http://www.peter-hug.ch/lexikon/1888_bild/04_0268 (జర్మన్)
  7. The sailor's horn-book for the law of storms By Henry Piddington పేజీ.150 [2]
  8. http://www.etymonline.com/index.php?search=Cyclone
  9. ప్రపంచ పటంలో ప్రవాస భారతం - ఆంధ్రజ్యోతి పత్రికలో (జనవరి 2006) డాక్టర్‌ టి.ఎల్‌.ఎస్‌.భాస్కర్‌ రాసిన వ్యాసం
  10. http://hindujobs.com/thehindu/mp/2003/07/07/stories/2003070700860100.htm
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-06.
  12. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కోరంగి&oldid=4105317" నుండి వెలికితీశారు