కోరుకున్న మొగుడు

కోరుకున్న మొగుడు పి.వి.ఎస్. ఫిల్మ్స్ బ్యానర్‌పై కట్టా సుబ్బారావు దార్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1982, జూన్ 12న విడుదలయ్యింది.[1]

కోరుకున్న మొగుడు
(1982 తెలుగు సినిమా)
Korukunna Mogudu (1982).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్‌బాబు ,
లక్ష్మి,
జయసుధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

సంక్షిప్త కథసవరించు

పార్వతి శ్రీమంతుల బిడ్డ. శంకరరావు సామాన్యుడు. పరిస్థితులు వారిని దగ్గర చేశాయి. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. శంకరరావుకు ఒక ప్రాణస్నేహితుడున్నాడు. అతడంటే పార్వతికి అసహ్యం. అతని విషయంలో భార్యాభర్తలు ఘర్షణ పడి విడిపోతారు. పార్వతి అప్పటికే గర్భవతి. కాలం గడిచిపోతుంది. పార్వతి కొడుకు మురళి పెరిగి పెద్దవాడవుతాడు. గీత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని పరిస్థితులలో రాధ అనే అమ్మాయిని తన ప్రియురాలు గీతగా పార్వతికి పరిచయం చేస్తాడు. రాధ సపర్యలతో పార్వతి ఆరోగ్యం కుదుటపడుతుంది. తనకు తగిన కోడలు అనుకుంటుంది. రాధ ఎవరో కాదు శంకరరావు స్నేహితుని కూతురు. స్నేహితుడు చనిపోతే శంకరరావే ఆమెను పెంచాడు. విడిపోయిన పార్వతి శంకరరావులను కలపాలని రాధ, మురళి ప్రయత్నించడం, భార్యాభర్తల పునస్సమాగమనం పతాక సన్నివేశాలు.[2]

మూలాలుసవరించు

  1. web master. "Korukunna Mogudu (Katta Subbarao) 1982". ఇండియన్ సినిమా. Retrieved 12 September 2022.
  2. మధుర (24 June 1982). "చిత్ర సమీక్ష: కోరుకున్న మొగుడు" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి:69 సంచిక 83. Retrieved 12 September 2022.