కట్టా సుబ్బారావు

కట్టా సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే. ఇతడు సుమారు 20 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు 1940 జనవరి 3వ తేదీన పుట్టాడు. ఇతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, రాజోలు మండలం, ములికిపల్లె అయినా ఇతడు రంగూన్‌లో పెరిగాడు[1]. బొంబాయిలోని ఒక ప్రైవేటు సంస్థలో కెమెరామాన్‌గా శిక్షణ పొందాడు. ఇతడు చాలా చిన్న వయసులోనే అంటే 48 ఏళ్ల వయసులోనే 1988, జూలై 12వ తేదీన మరణించాడు. ఇతడు కె. ప్రత్యగాత్మ, వి.మధుసూదనరావు ల వద్ద దర్శకత్వశాఖలో శిక్షణ పొందాడు. ఇతడికి 1979లో నిర్మించబడిన దశ తిరిగింది మొదటి సినిమా కాగా 1985లో విడుదలైన మాంగల్య బంధం ఆఖరి సినిమా[2].

వియ్యాలవారి కయ్యాలు

సినిమాల జాబితాసవరించు

 1. దశ తిరిగింది (1979)
 2. వియ్యాలవారి కయ్యాలు (1979)
 3. కొంటెమొగుడు పెంకిపెళ్ళాం (1980)
 4. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
 5. పెళ్ళిగోల (1980)
 6. బంగారు బావ (1980)
 7. మొగుడు కావాలి (1980)
 8. అల్లుడు గారూ జిందాబాద్ (1981)
 9. గడసరి అత్త సొగసరి కోడలు (1981)
 10. ఘరానా గంగులు (1981)
 11. ప్రేమ నాటకం (1981)
 12. మా పెళ్ళి కథ (1981)
 13. శ్రీరస్తు శుభమస్తు (1981)
 14. ఇద్దరు కొడుకులు (1982)
 15. కోరుకున్న మొగుడు (1982)
 16. వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
 17. అక్కమొగుడు చెల్లెలి కాపురం (1983)
 18. పుణ్యం కొద్దీ పురుషుడు (1984)
 19. మాంగల్య బంధం (1985)

మూలాలుసవరించు

 1. వి.ఎస్.అవధాని (8 March 1979). "యువదర్శకుడు శ్రీ కట్టాసుబ్బారావు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 330. Retrieved 10 December 2017.[permanent dead link]
 2. సాక్షి, ఫ్యామిలీ (12 July 2013). "ఫ్యామిలీ డ్రామాల స్పెషలిస్ట్ కట్టా సుబ్బారావు". సాక్షి. Retrieved 22 October 2016.

బయటి లింకులుసవరించు