కౌసర్ మొయిజుద్దిన్
కౌసర్ మొయిజుద్దిన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున కార్వాన్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
కౌసర్ మొయిజుద్దిన్ | |
---|---|
తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు | |
In office 2014–ప్రస్తుతం | |
అంతకు ముందు వారు | అఫ్సర్ ఖాన్ |
నియోజకవర్గం | కార్వాన్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హైదరాబాదు, తెలంగాణ | 1963 నవంబరు 6
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
జీవిత భాగస్వామి | నజ్మా సుల్తానా |
సంతానం | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తల్లిదండ్రులు | మొయినుద్దీన్ - అన్వర్ బేగం |
నివాసం | హాకింపేట, టోలీచౌకీ, హైదరాబాదు |
కళాశాల | అన్వరుల్ ఉలూమ్ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
వెబ్‌సైట్ | www.aimimkarwan.com |
జననం, విద్య
మార్చుకౌసర్ మొయిజుద్దిన్ 1963, నవంబరు 6న గులాం మొయినుద్దీన్ - అన్వర్ బేగం దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. అతని ఐదుగురు సోదరులు ఉన్నారు. కౌసర్ మొయిజుద్దిన్ 1987లో మల్లేపల్లిలోని అన్వరుల్ ఉలూమ్ హైస్కూల్ లో పదవ తరగతి, 1989లో అన్వరుల్ ఉలూమ్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.కౌసర్ స్వగ్రామం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్. [2]
వ్యక్తిగత జీవితం
మార్చుకౌసర్ మొయిజుద్దిన్ కు నజ్మా సుల్తానాతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నజ్మా సుల్తానా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున నానల్ నగర్ డివిజన్ కార్పోరేటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తోంది.[3]
రాజకీయ విశేషాలు
మార్చు2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి పై 37,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అమర్ సింగ్ పై 50,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7]
ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కార్వాన్ నియోజకవర్గం నుండి[8][9] పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అమర్ సింగ్ పై 41412 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై[10], 2023 డిసెంబర్ 16న ప్యానెల్ స్పీకర్‌గా నియమితుడయ్యాడు.[11][12]
మూలాలు
మార్చు- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Kausar Mohiuddin | MLA | AIMIM | Karwan | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-28. Retrieved 2021-10-28.
- ↑ "Majlis-e-Ittehadul Muslimeen replaces two sitting MLAs". Times of India. Retrieved 6 July 2017.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "Kausar Moinuddin(All India Majlis-E-Ittehadul Muslimeen):Constituency- KARWAN(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-28.
- ↑ "Kausar Mohiuddin(All India Majlis-E-Ittehadul Muslimeen):Constituency- KARWAN(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-28.
- ↑ "KARWAN Election Result 2018, Winner, KARWAN MLA, Telangana". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
- ↑ Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (28 October 2023). "హస్తం.. అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namaste Telangana (16 December 2023). "ప్యానల్ స్పీకర్లుగా ప్రకాశ్‌రెడ్డి, బాలూ నాయక్." Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ TV9 Telugu (16 December 2023). "ప్యానెల్ స్పీకర్లు సభకు ఎప్పుడు అధ్యక్షత వహిస్తారు? వారికి ఉండే అర్హతలు ఏంటీ..?". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)