గట్టుపల్లి బాలకృష్ణమూర్తి

గట్టుపల్లి బాలకృష్ణమూర్తి (జి.బి.కె. మూర్తి) తెలుగు నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు.[1] ప్రియదర్శిని నెల్లూరు కళా సంస్థ ద్వారా అనేక నాటక ప్రదర్శనలు చేశాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జిల్లాస్థాయిలో కందుకూరి పురస్కారం అందుకున్నాడు.[2] 2 నాటక నంది అవార్డులను కూడా పొందాడు.[3]

గట్టుపల్లి బాలకృష్ణమూర్తి
గట్టుపల్లి బాలకృష్ణమూర్తి
జననం1948, నవంబరు 5
నెల్లూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తిరిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి
ప్రసిద్ధితెలుగు నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు
మతంహిందూ
భార్య / భర్తసరోజ
తండ్రిగోపాలకృష్ణయ్య
తల్లిలలితాంబ

జననం, విద్య

మార్చు

మూర్తి 1948, నవంబరు 5న గోపాలకృష్ణయ్య - లలితాంబ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో జన్మించాడు.[4]

వ్యక్తిగత జీవితం, ఉద్యోగం

మార్చు

మూర్తికి సరోజతో వివాహం జరిగింది. స్టేటుబ్యాంక్ అఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి, 2001 మార్చిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.

నాటకరంగ ప్రస్థానం

మార్చు

9 సంవత్సరాల వయసులో 1957లో తన తోటి మిత్రులతో కలిసి "లవకుశ" నాటికలోని లక్ష్మణుడి పాత్రలో నాటకరంగంలోకి ప్రవేశించాడు. అలా అర్ధణ, అణా టిక్కెట్టు పెట్టి ప్రదర్శనలు ఇచ్చాడు. 1967లో కావలిలో జవహర్ భారతి కాలేజీలో "మానవుడు" నాటికలో తాత పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.

1975 నుండి 1999 వరకు బ్యాంక్ పోటీలలో నటించాడు. ఆ సమయంలో మూర్తికి అనేకమంది నాటక ప్రముఖులతో పరిచయం పెరిగింది. వారితో కలిసి అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. 1973 - 74 మధ్యకాలంలో ఏలూరు తెలుగు దర్బార్ నాటక పరిషత్ లో మొదటిసారిగా గూడూరు సంస్థ ప్రదర్శించిన "వైకుంఠపాళి" నాటకం ద్వారా పరిషత్తు నటుడిగా రంగప్రవేశం చేశాడు. 2004లో నాటక రచనను ప్రారంభించి 11 నాటికలు, 3 నాటకాలు రాశాడు.[4]

నాటకాలు, నాటికలు

మార్చు
  • నాటికలు: స్పందన, ఆనందం, హరిత, సంకల్పం, విజన్ 2047, లబ్ డబ్, మంచోడు, తలుపు చప్పుడు,[5] తెర తీయరా! నీలోనే!
  • నాటకాలు: బృందావనం, మనసులు కలిస్తే, నాటకం

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. నటుడిగా... రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి గట్టుపల్లి, ఆంధ్రజ్యోతి సిటీలైఫ్, నెల్లూరు ఎడిషన్, 30 ఆగస్టు 2017, పేజి 9.
  2. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 7 మే 2018. Retrieved 14 December 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  3. నాటక నందీశ్వరుడు, ఈనాడు నెల్లూరు సాంస్కృతికం, నెల్లూరు జిల్లా ఎడిషన్, 13 సెప్టెంబరు 2013, పేజి 9.
  4. 4.0 4.1 కొత్త దేహం నాటిక రచయిత జిబికె మూర్తి పరిచయం, అజో-విభొ-కందాళం నాటికలు 2019, తొలి ముద్రణ 2019, అజో-విభొ-కందాళం ఫౌండేషన్ హైదరాబాదు, పేజి 108.
  5. నంది వేదికపై నటనార్చన, సాక్షి నెల్లూరు ఎడిషన్, 2017 ఫిబ్రవరి 10, పేజి 8.
  6. "నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి". www.andhrabhoomi.net. 2017-04-17. Archived from the original on 2017-04-21. Retrieved 2021-12-14.