గడ్డిగారి విఠల్ రెడ్డి

(గడ్డం విఠల్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

గడ్డిగారి విఠల్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, ముధోల్ శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు.[1]

గడ్డిగారి విఠల్ రెడ్డి

పదవీ కాలం
2014 – 2018, 2018 - 2023 డిసెంబర్ 03
ముందు సముద్రాల వేణుగోపాలాచారి
తరువాత పవార్ రామారావు పటేల్
నియోజకవర్గం ముధోల్

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 6, 1954
దేగాం, భైంసా మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జి.గడ్డన్న, రాజమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం 2

జీవిత విశేషాలు

మార్చు

విఠల్ రెడ్డి 1954, ఆగస్టు 6న నిర్మల్ జిల్లా, భైంసా మండలం, దేగాం గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి గడ్డిగారి గడ్డెన్న ఆరుసార్లు శాసన సభ్యుడిగా, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో బి. సి. సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు.[2]

విద్యాభ్యాసం - ఉద్యోగం

మార్చు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పూర్తిచేసి, 20 ఏళ్ళపాటు భైంసా పట్టణంలో న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ విశేషాలు

మార్చు

2006–2008, 2010–2013 మధ్యకాలంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశాడు. 2009లో ప్రజా రాజ్యం పార్టీ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన విఠల్ రెడ్డి, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పదకంటి రమాదేవిపై 14వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[3] ఈయన [4] 2014, ఆగస్టు 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పదకంటి రమాదేవిపై 43వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. [5][6][7] జీ. విఠల్‌ రెడ్డి 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ,  నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[8]

విఠల్ రెడ్డి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి 2024 మార్చి 21న బీఆర్ఎస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[9]   

మూలాలు

మార్చు
  1. "Mudhole Election Result 2018 Live Updates: Gaddigari Vittal Reddy of TRS Wins".
  2. Andhrajyothi, Politician Biography. "Vittal Reddy". www.andhrajyothy.com. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-04. Retrieved 2019-05-04.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-14. Retrieved 2019-05-04.
  5. "Mudhole Assembly (Vidhan Sabha) (MLA) Elections Result Live". www.news18.com.
  6. "Gaddigari Vittal Reddy(TRS):Constituency- MUDHOLE(NIRMAL) – Affidavit Information of Candidate". myneta.info.
  7. "Lone Congress MLA from Adilabad Vittal Reddy joins TRS". The Hindu (in Indian English). 6 August 2014.
  8. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  9. 10TV Telugu (21 March 2024). "నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే" (in Telugu). Archived from the original on 22 March 2024. Retrieved 22 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)