సముద్రాల వేణుగోపాలాచారి

సముద్రాల వేణుగోపాలాచారి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి.గా 1996 నుండి 2004 వరకి మూడుసార్లు ఎన్నికయ్యాడు.[2][3] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడు.[4][5][6] సముద్రాల వేణుగోపాలాచారి 2022 డిసెంబరు 29న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చైర్మన్‌గా నియమితుడై[7], 2023 జనవరి 5న బాధ్యతలు చేపట్టాడు.[8]

సముద్రాల వేణుగోపాలాచారి
సముద్రాల వేణుగోపాలాచారి


పదవీ కాలం
1996 - 2004
ముందు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
తరువాత తక్కల మధుసూధనరెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాద్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
ముందు భోస్లే నారాయణరావు పాటిల్
తరువాత గడ్డిగారి విఠల్ రెడ్డి
నియోజకవర్గం ముధోల్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-10) 1959 మే 10 (వయసు 65)
నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రేవతి
సంతానం ఒక కుమారుడు, ఒక కూమార్తె.
మతం హిందూ

సముద్రాల వేణుగోపాలాచారి 2024 ఏప్రిల్‌ 16న బీఆర్ఎస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[9]

చదువు

మార్చు

ఈయన 1959, మే 10న లక్ష్మణాచారి, వెంకటరత్నమ్మ దంపతులకు నిర్మల్లో జన్మించాడు. ఎం.ఏ (సైకాలజీ), ఏం.ఏ (ఆర్కాలజీ) ఉస్మానియా విశ్వవిద్యాలయం లోనూ, D.H.M.S డా. జయసూర్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో చదివాడు.[10]

వివాహం

మార్చు

1988, మే 20న రేవతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

వృత్తి

మార్చు

వైద్యం, వ్యవసాయం, సమాజ సేవకుడు

పదవులు

మార్చు
 • 1996లో 11వ లోక్‌సభకు, 1998లో 12వ లోక్‌సభకు, 1999 లో 13వ లోక్‌సభకు ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.[11][12][4]
 • సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ (1985-967)
 • 1987-88 సభ్యులు, ప్రజా పద్దుల సంఘం
 • 1989-90 సభ్యులు, అధీన శాసన సమితి
 • 1992-93 సభ్యులు, ప్రజా సంస్థలు సంఘం
 • 1995-96 రాష్ర్ట మంత్రి, సమాచార, ప్రజా సంబంధాలు, పర్యాటక, ఆంధ్రప్రదేశ్
 • 1996-97 కేంద్ర మంత్రి, విద్యుత్, సంప్రదాయేతర శక్తి
 • 1996-98 కేంద్ర మంత్రి, వ్యవసాయ
 • 1998-99 డిప్యూటీ ఛైర్మన్, అధికార భాషా సంఘం
 • సభ్యులు, నిబంధనలు కమిటీ
 • సభ్యులు, ప్రజా సంస్థలు కమిటీ
 • సభ్యులు, ఆర్థికమంత్రిత్వశాఖ కమిటీ
 • సభ్యులు, పార్లమెంటు సభ్యులు కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి స్కీమ్
 • సభ్యులు, సంప్రదింపుల కమిటీ, పవర్ మంత్రిత్వ శాఖ
 • 1999-2000 ఛైర్మన్, ప్రభుత్వం హామీ కమిటీ
 • సభ్యులు, అంచనాలు కమిటీ
 • సభ్యులు, హోం అఫైర్స్ కమిటీ
 • సభ్యులు, జనరల్ పర్పసెస్ కమిటీ

సందర్శన

మార్చు

హరారే, పెరు, రష్యా, స్వీడన్, యు.ఎస్.ఏ (విద్యుత్, సంప్రదాయేతర శక్తి వనరుల యూనియన్ మంత్రి; సభ్యుడు, భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి, 100 వ IPU కాన్ఫరెన్స్, మాస్కో, 1998)

మూలాలు

మార్చు
 1. Sakshi (3 October 2018). "స'ముద్రా'ల ఎక్కడ..?". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
 2. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
 3. "లోక్‌సభ జాలగూడు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-02-04.
 4. 4.0 4.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 23 January 2020.
 5. "Election Results 1996" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 జూలై 2014. Retrieved 23 January 2020.
 6. "Election Results 1998" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 20 అక్టోబరు 2014. Retrieved 23 January 2020.
 7. Namasthe Telangana (30 December 2022). "టీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా వేణుగోపాలాచారి". Archived from the original on 12 January 2023. Retrieved 12 January 2023.
 8. Eenadu (12 January 2023). "సాట్స్‌, ఐడీసీ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 12 January 2023. Retrieved 12 January 2023.
 9. ABP (16 April 2024). "కాంగ్రెస్‌లో చేరిన వేణగోపాలా చారి - బీఆర్ఎస్‌కు షాకిచ్చిన సీనియర్ నేత". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
 10. "DHMS Degree". Mananayakudu.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 17 January 2014.
 11. "Earlier Lok Sabha". Lok Sabha website. Archived from the original on 16 జనవరి 2014. Retrieved 23 జనవరి 2020.
 12. "Andhra Pradesh Legislature". Andhra Pradesh Government. Archived from the original on 1 ఆగస్టు 2012. Retrieved 23 జనవరి 2020.