గద్దలసరి జలపాతం

గద్దలసరి జలపాతం (ముత్యంధార జలపాతం), తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలోని వీరభద్రారం గ్రామానికి సమీపంలో ఉన్న జలపాతం.[1] ఆకాశంలో గద్దలు ఎగిరేంత ఎత్తున ఉండటంతో స్థానిక గిరిజనులు దీనిని గద్దలసరి జలపాతం అని, ముత్యాల్లా మెరిసిపోతుండడంవల్ల ముత్యాల జలపాతమనీ పిలుస్తున్నారు.[2] దాదాపు ఏడు వందల అడుగుల ఎత్తునుంచి నీళ్ళు దుంకుతున్న ఈ జలపాతపు దిగువభాగంలో ఆదిమానవులు నివాసమున్నారన్న జాడలకు గుర్తుగా అతిప్రాచీన కట్టడాలు ఉన్నాయి. అయితే దట్టమైన అడవిలోపల ఉండటం, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇంతకాలం ఈ జలపాతం గురించి బయటి ప్రపంచానికి తెలియలేదు. దేశంలోని ఎత్తయిన జలపాతాలలో ఇది మూడవ జలపాతంగా నిలుస్తోంది.[3]

గద్దలసరి జలపాతం
గద్దలసరి జలపాతం is located in Telangana
గద్దలసరి జలపాతం
ప్రదేశంవీరభద్రారం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, తెలంగాణ
అక్షాంశరేఖాంశాలు18°16′34″N 80°38′40″E / 18.275974°N 80.644544°E / 18.275974; 80.644544
రకంజలపాతం

జలపాతం వివరాలు

మార్చు

రొయ్యూరు-పూసూరు గ్రామాలగుండా ప్రవహిస్తున్న గోదావరి నది వంతెన నుండి 28 కిలోమీటర్ల దూరంలో నాయకపోడు కోయ గిరిజనుల గూడెం రామచంద్రాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుండి వాయవ్య దిశగా 9 కిలోమీటర్ల దూరంలో అడవిలో వెళితే గద్దలసరి గుట్టలు ఉన్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఆ గుట్టల పైనుంచి ఒక కొండవాగు జలపాతమై కిందికి దుంకుతుంటుంది. కిందనున్న గుండంలో దూకిన ఈ జలపాతం ఒక వంద మీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక మలుపు తీసుకుంటుంది.[4]

ప్రత్యేకతలు

మార్చు

ఈ జతపాతమున్న ప్రదేశంంలో ఆదిమానవులు బంకమట్టి, గులకరాళ్ళతో కట్టుకున్న అరుగులు, ఎండాకాలంలో నీటిని నిలుపుకొనేందుకు కట్టుకున్న ఆనకట్టలు ఉన్నాయి. వీటి సమీపంలోనే వేటాడిన జంతువుల మాంసాన్ని కోసుకోవడానికి వేల సంఖ్యలో పెచ్చులు, బ్లేడులు వంటి రాతి ఆయుధాలు ఉన్నాయి.[5]

ఇతర వివరాలు

మార్చు

ఈ జలపాతం సమీపంలో కొంగల జలపాతం, బోగత జలపాతం, ఒంటిమామిడి లొద్ది జలపాతం ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Stone tools from paleolithic age found near gaddalasari waterfall". The New Indian Express. Archived from the original on 2019-10-29. Retrieved 2021-10-27.
  2. "వారాంతంలో.. ముత్యాలవానలో తడిసొద్దాం". EENADU. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.
  3. "Gaddalasari Waterfalls…గద్దల సరి జలపాతం". www.telugukiranam.com. Retrieved 2021-10-27.
  4. "వెలుగులోకి వచ్చిన మరో మహా జలపాతం". Dharuvu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.
  5. "Hyderabad's Gaddalasari could be India's third highest waterfall". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2017-09-27. Archived from the original on 2017-10-05. Retrieved 2021-10-27.