ప్రధాన మెనూను తెరువు

బోగత జలపాతం జయశంకర్ జిల్లా, వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఉన్న జలపాతం.[1]దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది.. వాజేడు మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్లు, చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుకు 20కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బోగత జలపాతం. జూలై నుంచి నవంబరు వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది ఇక్కడ. కొండకోనలనుంచి జాలువారే నీటి పొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది.[2]

మార్గంసవరించు

హైదరాబాద్ నుంచి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా బోగత జలపాతానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం వరకు సౌకర్యం ఉంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు మండల కేంద్రానికి రోడ్డు మార్గాన చేరుకోవాలి. అక్కడి నుంచి మరో కిలోమీటరు ముందుకు వెళ్ళాలి. ఎడమవైపు తిరిగి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డున వెళ్తే అందాల బోగత దర్శనమిస్తుంది. వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి 240 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకునే ప్రయత్నంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించొచ్చు.

మూలాలుసవరించు

  1. హెచ్.యం.టీవి. "తెలంగాణ నయాగరా.. బోగత జలపాతం.. క్యూ కట్టిన టూరిస్టులు". Retrieved 26 October 2017.
  2. https://www.youtube.com/watch?v=A7fQ_k-hpso