గాలిపటం (సినిమా)
గాలిపటం 2014 ఆగస్టు 8 శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా. దర్శకుడిగా టాలీవుడ్ లో సుపరిచితులైన సంపతి నంది నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ఇది
గాలిపటం | |
---|---|
దర్శకత్వం | నవీన్ గాంధి |
స్క్రీన్ ప్లే | సంపత్ నంది |
కథ | సంపత్ నంది |
నిర్మాత | సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి |
తారాగణం | ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టీనా అఖీవా, రాహుల్ రవీంద్రన్ |
ఛాయాగ్రహణం | కె. బుజ్జి |
కూర్పు | మేడికొండ రాంబాబు |
సంగీతం | భీమ్స్ సెసిరోలియో |
నిర్మాణ సంస్థలు | సంపత్ నంది టీమ్ వర్క్స్, లాస్ ఏంజిల్స్ టాకీస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకార్తీక్ (ఆది), స్వాతి (ఎరికా ఫెర్నాండెజ్) కొత్తగా పెళ్లై.. ఒకే కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వ్యక్తిగత విభేదాల కారణంగా పెళ్లైన ఏడాదిలోపే స్నేహపూరితమైన వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళికి ముందే కార్తీక్ కు పరిణిత (క్రిస్టినా) అమ్మాయితో ప్రేమ వ్యవహారం, స్వాతి జీవితంలో ఆరవ్ రెడ్డి (రాహుల్)తో అఫైర్ ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనుకుని మాజీ ప్రియురాలితో కార్తీక్, ప్రియుడితో స్వాతి జీవించాలనుకుంటారు. ప్రేమను కాదని పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కార్తీక్ ఎందుకు చేసుకున్నాడు? అఫైర్ వదులుకుని స్వాతి కార్తీక్ ను ఎందుకు పెళ్ళి చేసుకుంది? చివరకు ఆరవ్, స్వాతి, కార్తీక్, పరిణితలు ఒక్కటవుతారా? లేక స్వాతి, కార్తీక్ లే కలిసి ఉండాలని కోరుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానమే 'గాలిపటం'.
నటవర్గం
మార్చు- ఆది
- క్రిస్టినా అఖీవా
- ఎరికా ఫెర్నాండెజ్
- రాహుల్ రవీంద్రన్
- పోసాని కృష్ణ మురళి
- హేమ
- ప్రగతి
- సప్తగిరి
- భరత్ రెడ్డి
సాంకేతికవర్గం
మార్చు- సినిమాటోగ్రఫి: కే.బుజ్జి
- సంగీతం: భీమ్స్ సెసిరోలియో
- కథ, స్క్రీన్ ప్లే: సంపత్ నంది
- నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి
- దర్శకత్వం: నవీన్ గాంధీ