గాలి ముద్దుకృష్ణమ నాయుడు
గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.[1] తెలుగు దేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు పదవులు నిర్వహించాడు. పుత్తూరు శాసనసభ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించాడు. విద్య (1984), అటవీశాఖ (1987), ఉన్నత విద్య (1994) మంత్రిగా సేవలందించాడు.
గాలి ముద్దుకృష్ణమ నాయుడు | |
---|---|
జననం | వెంకట్రామాపురం, రామచంద్రాపురం మండలం, చిత్తూరు జిల్లా | 1947 జూన్
9
మరణం | 2018 ఫిభ్రవరి
7 హైదరాబాదు | (వయసు 70)
నివాసం | పద్మావతి పురం, తిరుపతి |
చదువు | బి. ఎస్. సి, ఎం. ఎ, బి. ఎల్ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
జీవిత భాగస్వామి | సరస్వతి |
పిల్లలు | ఇద్దరు కుమారులు, కుమార్తె |
తల్లిదండ్రులు |
|
వ్యక్తిగత జీవితంసవరించు
ముద్దుకృష్ణమ నాయుడు 1947, జూన్ 9 న చిత్తూరు జిల్లా, రామచంద్రాపురం మండలం, వెంకట్రామాపురం గ్రామంలో రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించాడు. బి. ఎస్. సి, ఎం. ఎ, బి. ఎల్ చదివాడు.
రాజకీయ జీవితంసవరించు
గుంటూరు జిల్లా, పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశాడు. పుత్తూరు శాసనసభ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించాడు. విద్య (1984), అటవీశాఖ (1987), ఉన్నత విద్య (1994) మంత్రిగా సేవలందించాడు. 2004 లో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి శాసన సభ్యుడిగా గెలుపొందాడు. 2008 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి 2009లో నగరి నియోజక వర్గం ఎమ్మెల్యే గా గెలుపొందాడు. 2014 ఎన్నికల్లో వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాత చనిపోయేవరకు తెలుగుదేశం తరపున ఎం. ఎల్. సి గా సేవలందించాడు.
మూలాలుసవరించు
- ↑ "మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 7 February 2018. Retrieved 7 February 2018.