గీతా డే

బెంగాలీ నాటకరంగ, సినిమా నటి.

గీతా డే (1931 ఆగస్టు 5 - 2011 జనవరి 17) బెంగాలీ నాటకరంగ, సినిమా నటి.[1] 6 సంవత్సరాల వయస్సులో నాటకరంగంలోకి అడుగుపెట్టిన గీతా, 1943లో సినిమారంగానికి వచ్చింది. బాలనటిగా నటించిన మొదటి సినిమా ఆహుతి 1941లో విడుదలైంది.[2] తరువాత రెండు వందలకు పైగా బెంగాలీ భాషా సినిమాలలో, రెండు వేలకు పైగా స్టేజ్ షోలలో నటించింది. సత్యజిత్ రే తీసిన తీన్ కన్యా, రిత్తిక్ ఘటక్ తీసిన మేఘే ధాక తార, సుబర్ణరేఖ, కోమల్ గంధర్, కటో అజానారే వంటి సినిమాలలో నటించింది. విద్యాబాలన్, సంజయ్ దత్ నటించిన పరిణీత (2005) సినిమాతోపాటు మరికొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం నుండి జీవితకాల సాఫల్యానికి రాష్ట్రపతి అవార్డు, అనేక ఇతర అవార్డులను అందుకుంది.

గీతా డే
జననం(1931-08-05)1931 ఆగస్టు 5
మరణం2011 జనవరి 17(2011-01-17) (వయసు 79)
ఇతర పేర్లుగీతా మా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1938–2008
పిల్లలు3

గీతా 1931 ఆగస్టు 5న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జన్మించింది.

సినిమారంగం

మార్చు

1938లో నుండి కోల్‌కతాలోని టోలీగంజ్‌లో బెంగాలీ సినిమారంగంలో నటిగా వచ్చింది. ఆరేళ్ళ వయసులో ధీరేన్ గంగూలీ దర్శకత్వం వహించిన అహుటీ సినిమాలో బాలనటిగా నటించింది.[3] 1954 నుండి ఆల్ ఇండియా రేడియోతో అనుబంధం కలిగివున్న గీతా, రేడియో నాటకాలలో కూడా పనిచేసింది. గణేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బాద్సాహి చాల్ (1996) ఆమె చివరి నాటకం, ఉత్తర కోల్‌కతాలోని రంగనా థియేటర్‌లో ప్రదర్శించబడింది. గీతా అనేక సినిమాలలో విభిన్న పాత్రలను పోషించి, గుర్తింపు పొందింది. గీతా నటన లెజెండరీ లారెన్స్ ఒలివర్ దృష్టిని కూడా ఆకర్షించింది.[4]

రిత్విక్ ఘటక్ తీసిన మేఘే ధాకా తార సినిమాలో నలిగిపోయే, కుతంత్రం చేసే తల్లి పాత్రలో గీతా నెగిటివ్, హాస్య పాత్రలు రెండింటిలోనూ నటించింది.[5] తన సినిమారంగ సుదీర్ఘ కెరీర్ మొత్తంలో, సిసిర్ భాదురి, రిత్విక్ ఘటక్, దేబాకి బోస్, సత్యజిత్ రే వంటి దర్శకులతో కలిసి పనిచేసింది. సైఫ్ అలీ ఖాన్, విద్యాబాలన్ నటించిన శరత్ చంద్ర చటోపాధ్యాయ్ పరిణీత ఆధారంగా ఒక బాలీవుడ్ మ్యూజికల్ లో కూడా నటించింది.[6] అనారోగ్యంతో ఉన్నప్పటికీ, నటనను కొనసాగించింది. టోలీ లైట్స్, చిరోడిని తుమీ జే అమర్ వంటి సినిమాలలో నటించి ప్రశంసలు అందుకుంది.

సినిమాలు (కొన్ని)

మార్చు
  • మేఘే ధాకా తార (1960)
  • తీన్ కన్యా (1961)
  • దంపతీ
  • ఇంద్రాణి (చిత్రం) (1958)
  • నౌకా దుబి
  • మాల్యదన్ (1971)
  • అభయ ఓ శ్రీకాంత
  • కోమోల్ గంధర్ (1961)
  • అభయ ఓ శ్రీకాంత
  • డైనీ (1961)
  • కఠిన్ మాయ (1961)
  • కాంచన్మూల్య (1961)
  • సతీ హర (1961)
  • కంచర్ స్వర్గ (1962)
  • శుభ దృష్టి (1962)
  • బంధన్ (1962)
  • సాత్ పాకే బంధ (1963)
  • దుయ్ బారి (1963)
  • ఛాయా సూర్య (1963)
  • నిశిపద్మ
  • శేష్ పోర్జోంటో (1969)
  • బాగ్ బోండి ఖేలా (1975)
  • దత్తా (చిత్రం) (1976)
  • సూర్య సఖి (1981)
  • దుయ్ భాయ్
  • అహోబన్
  • బర్నోచోరా
  • పితా పుత్రో
  • మౌచక్
  • హిరర్ షికల్ (1988)
  • మహాప్రిథిబి (1991)
  • టోలీ లైట్లు
  • సంతాన్ (1999)
  • చిరోడిని తుమీ జే అమర్
  • కథావశేషన్ ( మలయాళం )
  • పరిణీత

గీతా 79 సంవత్సరాల వయస్సులో 2011 జనవరి 17న కోల్‌కతాలో మరణించింది.

మూలాలు

మార్చు
  1. "Gita Dey movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-03-31. Retrieved 2022-03-18.
  2. Gita Dey dies at 79 Archived 19 జనవరి 2011 at the Wayback Machine
  3. Thespian Gita Dey dies at 79 Archived 19 జనవరి 2011 at the Wayback Machine
  4. Transition from a child star to character artiste
  5. Mukerjea, Anit. "Gita Dey – Transition from a child star to character artiste". Screen (magazine). Retrieved 2022-03-18.
  6. Thespian Gita Dey dies at 79 Archived 19 జనవరి 2011 at the Wayback Machine
"https://te.wikipedia.org/w/index.php?title=గీతా_డే&oldid=4175236" నుండి వెలికితీశారు