గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

(గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి నుండి దారిమార్పు చెందింది)

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (జ. 1965 జూలై 18) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.[1][2][3] 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4] సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా[5] ఎన్నికైన జగదీష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్రి (2014-2016)గా పనిచేశాడు.[6] 2016 నుండి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు.[7] టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్నాడు.

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


తెలంగాణ విద్యుత్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 జూన్ 2-2023 డిసెంబర్ 3
నియోజకవర్గం సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం, తెలంగాణ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జూన్ 2, 2014
ముందు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 18, 1965
నాగారం ,నాగారం మండలం, సూర్యాపేట జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సనీతారెడ్డి
సంతానం వేమన్ రెడ్డి, లహరి రెడ్డి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం, విద్యాభ్యాసం

మార్చు

జగదీష్‌రెడ్డి 1965, జూలై 18న గుంటకండ్ల రామచంద్రారెడ్డి, సావిత్రి దేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని సూర్యాపేట జిల్లా, అర్వపల్లి మండలం, నాగారం గ్రామంలో జన్మించాడు.[8] ఇతనికి నలుగురు తోబుట్టువులు ఉన్నారు. అతను 1985లో సూర్యాపేట (ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధి) లోని శ్రీ వెంకటేశ్వర్ డిగ్రీ కళాశాల నుండి బిఏ పట్టభద్రుడయ్యాడు. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీ (నాగార్జున యూనివర్సిటీ) నుండి బ్యాచిలర్ ఆఫ్ లా చేసాడు.[9]

వృత్తిజీవితం

మార్చు

లా డిగ్రీ పూర్తయిన తరువాత నల్గొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. నల్గొండ జిల్లా 1వ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి 2001లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ప్రారంభ సభ్యులులో ఒకరిగా ఉన్నాడు.[10] విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేశాడు. 2001లో సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జిగా నియమించబడిన జగదీష్ రెడ్డి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇంచార్జిగా కూడా పనిచేశాడు. 2002లో 45 రోజుల పాటు జలసాధన కోసం ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు చేపట్టిన మహబూబ్ నగర్ పాదయాత్రకు ఇంచార్జ్‌గా వ్యవహరించాడు. 2003లో మెదక్ ఇంచార్జిగా ఉన్నాడు. 2004లో సిద్దిపేట ఉపఎన్నికలల్లో ఇచార్జిగా వ్యవహరించి టి. హరీష్ రావు గెలుపుకు కృషి చేశాడు. 2005లో సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జిగా ఉన్నాడు. 2006లో కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికల ఇంచార్జిగా, 2008లో ముషీరాబాద్, ఆలేరు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఇంచార్జిగా, మెదక్ జిల్లా ఇంచార్జిగా వ్యవహరించాడు.

2009లో హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2009లో సూర్యాపేట నియోజకవర్గంకు, 2011లో బాన్సువాడ నియోజకవర్గం ఉప ఎన్నికలకు, 2012లో కొల్లాపూర్, పరకాల ఉప ఎన్నికలకు, 2013లో నల్గొండ జిల్లాకు ఇంచార్జిగా పనిచేశాడు. తెరాస రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో మెంబర్‌గా కూడా పనిచేశాడు. 2014లో జరిగిన ఎన్నికలలో సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రెండోసారి గెలిచాడు.

జగదీశ్‌కు మరో రెండు శాఖలు

మార్చు

జగదీశ్‌రెడ్డి ఎస్సీ అభివృద్ధి శాఖ, సహకార శాఖల బాధ్యతను ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పగించాడు.[11] తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో విద్యా (2014-2015), విద్యుత్ శాఖల (2016-2018) బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు.[12][13][14][15]

మూలాలు

మార్చు
 1. సాక్షి. "విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి". Retrieved 13 January 2017.
 2. "Election Commission Of India" Archived 2014-05-18 at the Wayback Machine. ECI.
 3. "Suryapet Assembly Election 2014". Archived from the original on 2017-08-02. Retrieved 2017-01-14.
 4. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 2 జూన్ 2014. Retrieved 2 June 2014.
 5. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 2 జూన్ 2014. Retrieved 2 June 2014.
 6. "Council of Ministers". telangana.gov.in. Retrieved 14 July 2014.
 7. "Council of Ministers". telangana.gov.in. Archived from the original on 14 July 2014. Retrieved 14 July 2014.
 8. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
 9. "Guntakandla Jagadish Reddy | Energy Minister | MLA | Nagaram | Arvapally | Suryapet | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-21. Retrieved 2021-08-13.
 10. "Suryapet Assembly Election 2014". Archived from the original on 2017-08-02. Retrieved 2017-01-14.
 11. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు. "జగదీశ్‌కు మరో రెండు శాఖలు". Retrieved 16 January 2017.[permanent dead link]
 12. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 13. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 14. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
 15. Eenadu (15 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.