గుండవరపు సుబ్బారావు


గుండవరపు సుబ్బారావు (మ. జనవరి 2, 2011) అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.

ఆయన సామాజిక స్పృహతోకూడిన సంచలనాత్మకమైన పాటలు రచించారు. నేటి విద్యా విధానం, విద్యార్థుల కర్తవ్యంపై వచ్చిన 'కాలేజి కుర్రవాడా' పాట రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాట రచయిత గుండవరపు సుబ్బారావు. ఈ పాటను ప్రముఖ అభ్యుదయ నటుడు మాదాల రంగారావు తన చిత్రానికి వాడుకున్నారు. కాలేజి కుర్రవాడ పాటతో సుబ్బారావు సినిమా రంగప్రవేశం జరిగింది.

ఎర్రమల్లెలు, ఒసేయ్‌ రాములమ్మ, ‘రౌడీదర్బార్’, ‘మా ఆవిడ కలెక్టర్’ వంటి విప్లవాత్మక చిత్రాలకు 50కి పైగా పాటలు అందించారు. ఈయన రచించిన కాలేజీ కుర్రవాడా...కులాసాగ తిరిగెటోడ, చౌదరి గారూ...ఓ నాయుడు గారూ, కూలి చల్లాగుంటే... కూడు దొరకాదని, ప్రకాశం జిల్లాలోనా... ఓరి నాయనా వంటి వందలాది పాటలు ప్రజానాట్యమండలి వేదికలపైనా, సినిమాలలోనూ మార్మోగి ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి.

స్వగ్రామం సంతనూతలపాడు మండలం మైనంపాడు. సామాజిక రుగ్మతలపై, ప్రజానాట్యమండలికి అనేకరకాల పాటలను రచించటంతోపాటు రంగులుమార్చే రాజకీయ నాయకుల స్వభావాన్ని తెలియజేస్తూ రాజకీయ భాగవతం అనే నృత్యరూపకాన్ని రచించారు. దీనిని ప్రజానాట్యమండలి కళాకారులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు. టెలిఫోన్ శాఖలో మెకానిక్‌గా పనిచేస్తూ పలు గేయాలను రాశారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

జనవరి 2, 2011ఒంగోలు లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు.

కొన్ని పాటలు

మార్చు