గుగులోత్ శంకర్‌నాయక్

గుగులోతు శంకర్‌నాయక్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. శంకర్‌నాయక్‌ 2020 ఫిబ్రవరి 10 న రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ గా నియమితులయ్యాడు.[1][2][3]

గుగులోతు శంకర్‌నాయక్‌
గుగులోత్ శంకర్‌నాయక్


రాష్ట్ర సమాచార కమిషనర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 ఫిబ్రవరి 2020

వ్యక్తిగత వివరాలు

జననం 10 జూలై 1986
బావోజిగూడెం (భోజ్యతండా), మరిపెడ మండలం, మహబూబాబాద్‌ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి లక్ష్మీశ్రీ
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ
మతం హిందూ

గుగులోతు శంకర్‌నాయక్‌ మహబూబాబాద్‌ జిల్లా, మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామంలో 1986 జూలై 10న భాగ్యానాయక్‌, సాలమ్మ దంపతులకు జన్మించాడు.

విద్యాభాస్యం

మార్చు

శంకర్‌నాయక్‌ రెండో తరగతి వరకు బావోజిగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు మరిపెడ హైస్కూల్ లో చదివాడు. మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి. ఏ పూర్తి చేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ పూర్తి చేశాడు. పాలమూరు విశ్వవిద్యాలయంలో బీ.ఈడీ, తెలుగు విశ్వవిద్యాలయం లో ఏం ఫీల్ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'గిరిజన సాంస్కృతిక జీవన చిత్రం' అనే అంశంపై శంకర్‌నాయక్‌ పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (11 February 2020). "ఆర్టీఐ కమిషనర్లుగా ఐదుగురు". www.ntnews.com. Archived from the original on 11 February 2020. Retrieved 11 February 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (11 February 2020). "ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం". www.andhrajyothy.com. Archived from the original on 11 February 2020. Retrieved 11 February 2020.
  3. Sakshi (26 February 2020). "సమాచార కమిషనర్ల ప్రమాణం". Sakshi. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.
  4. Namasthe Telangana (27 October 2021). "తండా నుంచి డాక్టరేట్‌ వరకు.. ఉద్యమ కెరటం శంకర్‌నాయక్‌". Archived from the original on 6 January 2022. Retrieved 6 January 2022.
  5. Sakshi Education (16 November 2021). "Dr.Guguloth Shankar Naik : ఒక మారుమూల తండా నుంచి రాష్ట్ర సమాచార కమిషనర్ వ‌ర‌కు... విజ‌య‌ ప్రస్థానం..." Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.

వెలుపలి లంకెలు

మార్చు