అన్నారం (గుమ్మడిదల మండలం)

సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని జనగణన పట్టణం

అన్నారం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని జనగణన పట్టణం,రెవెన్యూ గ్రామం.[1]అన్నారం సెన్సస్ టౌన్ మొత్తం 1,613 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబందిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలోని రహదారులను నిర్మించడానికి,నిర్వహించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి స్థానిక స్వపరిపాల సంస్థకు అధికారం ఉంది.[2]2016లో తెలంగాణ రాష్ట్రంలోజిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ జరగక ముందు ఈ పట్టణం మెదక్ జిల్లా,జిన్నారం మండలం పరిధిలో ఉంది.పునర్య్వస్థీకరణ భాగంగా కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా,గుమ్మడిదల (కాత్త మండలం) మండల పరిధిలో చేరింది.[1]

అన్నారం
—  రెవిన్యూ గ్రామం, జనగణన పట్టణం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం గుమ్మడిదల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,840
 - పురుషుల సంఖ్య 3,473
 - స్త్రీల సంఖ్య 3,367
 - గృహాల సంఖ్య 1,613
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం అన్నార పట్టణంలో మొత్తం 1,613 కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్నారం మొత్తం జనాభా 6,840, అందులో 3,473 మంది పురుషులు, 3,367 మంది మహిళలు ఉన్నారు. అన్నారం సగటు సెక్స్ నిష్పత్తి 969.పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 974, ఇది మొత్తం జనాభాలో 14%గా ఉంది. 0-6 సంవత్సరాల వయస్సు మధ్య 469 మంది మగ పిల్లలు, 505 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం అన్నారం చైల్డ్ సెక్స్ రేషియో 1,077, ఇది సగటు సెక్స్ రేషియో (969) కన్నా ఎక్కువ.పట్టణ అక్షరాస్యత రేటు 68%.పురుష అక్షరాస్యత రేటు 76.23%, స్త్రీ అక్షరాస్యత రేటు 59.4%గా ఉంది.[2]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "Annaram Population, Caste Data Medak Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-04.

వెలుపలి లంకెలుసవరించు