సంగారెడ్డి రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

సంగారెడ్డి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సంగారెడ్డి జిల్లాలోవున్న నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి.[1] ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[2] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సంగారెడ్డి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను మెదక్ లోక్‌సభ నియోజకవర్గం, సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

సంగారెడ్డి రెవెన్యూ డివిజను
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసంగారెడ్డి

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

మార్చు

సంగారెడ్డి డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం సంగారెడ్డి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సంగారెడ్డి మండలం 13 రెవెన్యూ గ్రామాలు
2 కంది మండలం 16 రెవెన్యూ గ్రామాలు
3 కొండాపూర్ మండలం 23 రెవెన్యూ గ్రామాలు
4 సదాశివపేట మండలం 30 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
5 పటాన్‌చెరు మండలం 19 రెవెన్యూ గ్రామాలు
6 అమీన్‌పూర్ మండలం 6 రెవెన్యూ గ్రామాలు
7 రామచంద్రాపురం మండలం 9 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
8 మునిపల్లి మండలం 32 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
9 జిన్నారం మండలం 17 రెవెన్యూ గ్రామాలు
10 గుమ్మడిదల మండలం 12 రెవెన్యూ గ్రామాలు
11 హత్నూర మండలం 33 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)

మూలాలు

మార్చు
  1. "Revenue Divisions | District Sangareddy, Government of Telangana | India". www.sangareddy.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-20. Retrieved 2022-07-29.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-07-18.
  4. "Telangana Sangareddy District Revenue Divisions, Mandals TS GO 239". Teacher4us. 2016-10-16. Archived from the original on 2022-07-18. Retrieved 2022-07-18.
  5. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-07-18.