గుమ్లా
గుమ్లా భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా జిల్లా లోని పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం.
గుమ్లా | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°2′40″N 84°32′30″E / 23.04444°N 84.54167°E | |
దేశం | India |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | గుమ్లా |
Elevation | 652 మీ (2,139 అ.) |
జనాభా (2011) | |
• Total | 51,265 |
• జనసాంద్రత | 197/కి.మీ2 (510/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 835207 |
Telephone code | 06524 |
Vehicle registration | JH-07 |
చరిత్ర
మార్చుగుమ్లా చరిత్ర ఒక కుగ్రామంగా ప్రారంభమైంది. ప్రతిరోజూ వారం రోజుల పాటు "ఆవుల జాతర (గౌ మేళా)" జరిగేది. ఇక్కడ రోజువారీ ఉపయోగంలో ఉన్న వస్తువుల (పాత్రలు, ఆభరణాలు, ధాన్యం, కొన్నిసార్లు పశువులు ) అమ్మకాలు, వస్తు మార్పిడులూ జరుగుతాయి. ఈ వస్తువులు సంతలో మాత్రమే దొరికేవి. కాబట్టి, ప్రజలు సంవత్సరం పొడుగునా తమకు అవసరమైన వస్తువుల జాబితాలను తయారుచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. కుగ్రామం జనాభా పెరిగి, అది "గుమ్లా" (గౌ -మేళా నుండి వచ్చింది) అనే గ్రామంగా మారింది.
భారతదేశంలో బ్రిటిష్ పాలనలో గుమ్లా లోహర్‌దాగా జిల్లాలో భాగంగా ఉండేది. 1800 లో రాజ్‌పై తిరుగుబాటు జరిగింది. 1807 లో, బార్వేకు చెందిన ఒరావన్లు (గుమ్లాకు పశ్చిమంగా) శ్రీనగర్‌కు చెందిన తమ భూస్వామిని హత్య చేయడంతో గుమ్లా అంతటా తిరుగుబాటు వ్యాపించింది. 1843 లో, గుమ్లా బిషున్‌పూర్ ప్రావిన్స్‌లో భాగంగా మారింది. 1899 లో రద్దైన ఈ ప్రావిన్స్‌కే ఆ తరువాత రాంచీ అని పేరు పెట్టారు; 1902 లో గుమ్లా, రాంచీ జిల్లాలో ఒక ఉపవిభాగమైంది.
మధ్యయుగ కాలంలో చోటానాగ్‌పూర్ ప్రాంతాన్ని నాగ వంశపు రాజులు పాలించేవారు. ఆ సమయంలో బరాయిక్ దేవేనందన్ సింగ్ గుమ్లా ప్రాంతాన్ని పాలించాడు. 1931-32లో కోల్హ్ తిరుగుబాటు సమయంలో, వక్తర్ సే ప్రముఖ పాత్ర పోషించాడు. శ్రీ రామ్‌నగర్‌లో కాళీ ఆలయాన్ని నిర్మించిన గంగా మహారాజ్ 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన కృషికి గాను, అతను ప్రభుత్వం నుండి పింఛను అందుకున్నాడు.
1983 మే 18 న గుమ్లా జిల్లాను బీహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా స్థాపించాడు. ద్వారకా నాథ్ సిన్హా కొత్త జిల్లాకు మొదటి డిప్యూటీ కమిషనర్‌గా నియమితుడయ్యాడు.
భౌగోళికం
మార్చుచోటా నాగపూర్ పీఠభూమి యొక్క దక్షిణ భాగంలో గుమ్లా ఉంది , ఇది దక్కన్ పీఠభూమికి తూర్పు అంచున ఉంటుంది. ఈ ప్రాంతం గుండా మూడు నదులు ప్రవహిస్తున్నాయి: దక్షిణ కోయెల్, ఉత్తర కోయెల్, శంఖ్.
శీతోష్ణస్థితి
మార్చుగుమ్లా సమశీతోష్ణ, ఉంది. సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 40 °C (104 °F) తో, ఉప ఉష్ణమండల వేసవి కాలం, సగటున 3 °C (37 °F) ఉష్ణోగ్రతతో శీతాకాలం ఉంటాయి. సగటు వార్షిక వర్షపాతం దాదాపు 1,450 మి.మీ. ఉంటుంది.
జనాభా
మార్చు2001 భారత జనగణన ప్రకారం,[1] గుమ్లా జనాభా 51,264. ఇందులో పురుషులు 52 శాతం, మహిళలు 48 శాతం ఉన్నారు. గుమ్లా సగటు అక్షరాస్యత 75 శాతం. ఇది జాతీయ సగటు 59.5 శాతం కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 80 శాతం, స్త్రీల అక్షరాస్యత 70 శాతం. జనాభాలో 15% మంది ఆరేళ్లలోపు వారు. ఈ ప్రాంతంలో మాట్లాడే ప్రధాన భాషలు నాగపురి (లేదా సాద్రి), హిందీ, కురుఖ్.
రవాణా
మార్చురోడ్లు
మార్చుగుమ్లా జాతీయ రహదారి 43 ద్వారా రాంచి, సిమ్‌డేగా లకు చక్కటి రహదారి సౌకర్యం ఉంది. ఇది రాష్ట్ర రహదారుల ద్వారా లోహర్‌దాగా, లతేహార్, డాల్టన్‌గంజ్ లకు, రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాలకూ చక్కటి సౌకర్యం ఉంది. ఇది జాతీయ రహదారి 78 ద్వారా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రోడ్డు సౌకర్యం ఉంది.
రైల్వేలు
మార్చుగుమ్లా జిల్లాలోని ఏకైక రైల్వే స్టేషను, పోక్లా రైల్వే స్టేషను. సమీపంలోని ఇతర స్టేషన్లు బానో, గోవింద్‌పూర్ రోడ్, టోరీ, లతేహర్, ఓర్గా, మెక్లస్కీగంజ్.
పండుగలు
మార్చుకర్మా పండుగ గ్రామం నుండి గ్రామానికి తిరుగుతుంది. ఇది మూడు భాగాలుగా ఉంటుంది: రాజ కర్మ, బుద్ధీ కర్మ, పద్దా కర్మ. రాజ కర్మను మొత్తం సమాజమంతా జరుపుకుంటుంది; బుద్ధి కర్మను జూన్ నెలలో వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ వృద్ధ మహిళలు జరుపుకుంటారు. పద్దా కర్మను గ్రామం మొత్తం జరుపుకుంటారు.
సర్హుల్ అనేది ఒరాన్ పండుగ. అది నృత్యానికి ప్రసిద్ధి. నృత్యకారులు వర్తులాకారంలోనిలబడతారు. ఆ వృత్తం లోపల సంగీతకారులు సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తూంటారు. మగవారు ఎర్ర అంచున్న తెల్లని పంచె ధరిస్తారు. మహిళలు ఎర్రని అంచున్న తెల్లని చీర ధరిస్తారు.
భేజా నృత్యంలో, డజన్ల కొద్దీ యువకులు, యువతులూ చేతులు పట్టుకుని గొలుసు లాగా ఏర్పడుతారు. శ్రావ్యమైన సాంప్రదాయ సంగీతం, లయబద్ధమైన పాటలతో ఈ నృత్యంలో విభిన్న భంగిమలుంటాయి.
మూలాలు
మార్చు- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.