గూడూరు రెవెన్యూ డివిజను
గూడూరు రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ఈ రెవెన్యూ డివిజను పరిధిలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. పూర్వం ఈ రెవెన్యూ డివిజను శ్రీ పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో భాగంగా ఇది చేరింది. ప్రధాన కార్యాలయం గూడూరులో ఉంది.[1]
గూడూరు రెవెన్యూ డివిజన్ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
పరిపాలనా కేంద్రం | గూడూరు |
మండలాల సంఖ్య | 8 |
చరిత్ర
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, గూడూరు రెవెన్యూ డివిజన్‌లో 15 మండలాలు ఉన్నాయి. బాలాయపల్లె, చిల్లకూరు, చిట్టమూరు, డక్కిలి, దొరవారిసత్రం, గూడూరు, కోట, మనుబోలు, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ, వెంకటగిరి, వాకాడు మండలాలు ఉండగా[2] 2013లో డివిజన్‌లోని ఆరు మండలాలైన దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడలను నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌గా మార్చారు .[3]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
మార్చు2022 ఏప్రిల్ 4న ఈ డివిజను 8 మండలాలతో పునర్వ్యవస్థీకరించబడింది: బాలాయపల్లె, చిల్లకూరు, చిట్టమూరు, డక్కిలి, గూడూరు, కోట, వాకాడు, వెంకటగిరి మండలాలు ఈ రెవెన్యూ డివిజన్ పరిధికి వచ్చాయి.[4]
మూలాలు
మార్చు- ↑ "Geographic Information". Official Website of Sri Potti Sriramulu Nellore District. National Informatics Centre. Archived from the original on 31 January 2015. Retrieved 20 February 2016.
- ↑ District Census Handbook Sri Potti Sriramulu Nellore (PDF) (Report). 2011. p. 25. Retrieved 2 June 2022.
- ↑ "New revenue divisions formed in Nellore district". The Hindu. Nellore. 25 June 2013. Retrieved 20 February 2016.
- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 April 2022. Retrieved 2 June 2022.