గూఢచారి (2018 సినిమా)

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం

అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]

గూఢచారి
దర్శకత్వంశశి కిరణ్ తిక్క
రచనఅబ్బూరి రవి (మాటలు)
స్క్రీన్ ప్లే
కథఅడివి శేష్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంశానియల్ దేవ్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంశ్రీచరణ్ పాకాల
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుఏకె ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
3 ఆగస్టు 2018 (2018-08-03)
సినిమా నిడివి
147 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్6 crore (US$7,50,000)
బాక్సాఫీసు30 కోట్లు (గ్రాస్) 10.5 కోట్లు (షేర్)

గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్‌ చనిపోతాడు. రఘువీర్‌ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్‌), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్‌ కుమార్‌ పేరు పెట్టి కడియపులంక వచ్చి అక్కడే పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్‌ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్‌ రాదు.ఫైనల్‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకుని అని మెన్షన్‌ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్‌ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్‌ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్‌ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్‌ త్రినేత్ర 11గా అపాయింట్‌ అవుతాడు.అర్జున్‌ అపాయింట్‌ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద దుండగులు దాడి చేస్తారు.‌ ఈ దాడిలో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్‌ కూడా మరణిస్తారు.ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్‌ బైక్‌ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్‌ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్‌ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్‌ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆచారి మీద ఎటాక్ చేసిందిఎవరు.? అర్జున్‌ ఈ మిస్టరీని ఎలా చేదించాడు.? అన్నదే మిగతా కథ.[2]

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
Track-List
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."అనగనగా"Ramesh Yadmaఅంబికా శశిత్తల్02:40
2."సఖియ"Kittu Vissapragadaచరణ్ పాకాల
యామిని ఘంటసాల
03:30
3."హత"Ramesh Yadmaలలిత చిలుకూరి02:42
4."గూఢచారి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్"-చరణ్ పాకాల02:57
7."రానా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్"-చరణ్ పాకాల00:57
మొత్తం నిడివి:22:21

మూలాలు

మార్చు
  1. "Goodachari Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-04. Retrieved 2020-07-20.
  2. "'గూఢచారి' మూవీ రివ్యూ". Sakshi. 2018-08-03. Retrieved 2020-07-20.