శోభితా ధూళిపాళ్ల

భారతీయ మోడల్, సినీ నటి.

శోభితా ధూళిపాళ్ల భారతీయ మోడల్, సినీ నటి. ఆమె 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది.

శోభితా ధూళిపాళ్ల
అందాల పోటీల విజేత
జననము (1993-05-31) 1993 మే 31 (వయసు 31)
తెనాలి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012– ప్రస్తుతం
ప్రధానమైన
పోటీ (లు)
మిస్ ఎర్త్ ఇండియా 2013

జననం, విద్యాభ్యాసం

మార్చు

శోభితా ధూళిపాళ్ల 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెనాలిలో జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. శోభితా ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్ లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది.

సినీరంగ ప్రస్థానం

మార్చు

శోభితా ధూళిపాళ్ల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా నటించింది.[1] అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదల అయింది.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమాపేరు పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2016 రామన్ రాఘవ్ 2.0 స్మృతికా నాయుడు హిందీ [2]
2017 చెఫ్ విన్ని హిందీ [3]
2018 కళాకంది తార హిందీ
గూఢచారి సమీరా రావు / సమీరా షేక్ తెలుగు
2019 మూతోన్ రోజీ మలయాళం
హిందీ
ద్విభాషా చిత్రం
ది బాడీ మాయ వర్మ హిందీ
2020 ఘోస్ట్ స్టోరీస్ నేహా హిందీ అనురాగ్ కశ్యప్
2021 పొన్నియన్ సెల్వన్: I తమిళం రిలీజ్
మేజర్(సినిమా)‌ ప్రమోద తెలుగు
హిందీ
ద్విభాషా చిత్రం
పోస్ట్ -ప్రొడక్షన్
కురుప్ మలయాళం పోస్ట్ ప్రొడక్షన్
సితార హిందీ రిలీజ్ కి సిద్ధం
2022 మంకీ మ్యాన్ ఇంగ్లీష్

style="background:#ffc;"|పొన్నియన్ సెల్వన్: 2 || || తమిళం|| రిలీజ్|

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. India TV News (26 June 2016). "Anurag Kashyap is all praises for 'Raman Raghav 2.0' actress Sobhita Dhulipala". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  2. India Today (25 June 2016). "Raman Raghav 2.0 debutante Sobhita Dhulipala: I would describe my character as a domesticated wolf". Archived from the original on 2021-04-19. Retrieved 19 April 2021.
  3. Deccan Herald (8 October 2017). "Meet the new 'chef' in town". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.