గోలాఘాట్ జిల్లా

అస్సాం లోని జిల్లా

అస్సాం రాష్ట్ర 27జిల్లాలలో గోలాఘాట్ జిల్లా (అస్సామీ: গোলাঘাট জিলা) ఒకటి. గోలాఘాట్ జిల్లా 1987లో ఏర్పాటుచేయబడింది. గోలాఘాట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 250 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 100 మీ ఎత్తున ఉంది. 2001 గణాంకాలను అనుసరించి గోలాఘాట్ జిల్లా జనసంఖ్య 946,279. వీరిలో హిందువులు 813,263, ముస్లిములు 74,808 (7.9%), క్రైస్తవులు 52,277. జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధమైన " కజిరంగా విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.

Golaghat district

গোলাঘাট জিলা
District location in Assam
District location in Assam
Country India
Stateఅసోం
Headquartersగోలాఘాట్
విస్తీర్ణం
 • మొత్తం3,502 కి.మీ2 (1,352 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం9,46,279
కాలమానంUTC+05:30 (IST)
జాలస్థలిgolaghat.gov.in

చరిత్రసవరించు

గోలాఘాట్ అనే పేరు రావడానికి ఇక్కడ స్థిరపడిన మార్వారీ ప్రజలే కారణం. 19వ శతాబ్దంలో ప్రస్తుత జిల్లాకేంద్రానికి కనుచూపుమేరలో ఉన్న ధంసరి నదీతీరంలో రాజస్థాన్ నుండి వచ్చిన మార్వారీ ప్రజలు స్థరపడ్డారు. వారిక్కడ ఒక మార్కెట్ ఏర్పాటు చేసారు. గోలా అంటే మార్కెట్ ఘాట్ అంటే రేవు అని అర్ద్గం. గోలాఘాట్ అంటే రేవులో ఉన్న మార్కెట్ లేక మార్కెట్‌రేవు అని అర్ధం. కాలక్రమేణ ఈ ప్రాతం నగరంగా విస్తరించినా పేరు మాత్రం అలాగే స్థిరపడింది.

చరిత్రసవరించు

సరూపదర్‌లోని నాగజరి - ఖన్నికర్ గ్రామంలో డోయాంగ్-ధంసరి లోయలలో నాగజరి - ఖనికర్గయాన్ శిలాశాసనాలు, శిథిలమైన కోట అవశేషాలు, స్మారకచిహ్నాలు, ఆలయాలు, వ్యవసాయ సంబంధిత చెరువులు మొదలైన చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. 16 వశతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అహోం రాజులు పాలించారు. ప్రారంభంలో ఈ ప్రాంతానికి కచారీ రాజులు (హెరోంబియాలు) పాలకులుగా ఉన్నారు. తరువాత కచారీ రాజులు కర్బి హిల్స్ వైపు నెట్టివేయబడ్డారు. అహోం రాజు ఈ ప్రాంతానికి " మొరొంగి- ఖొవ-గొహైన్ "ను రాజప్రతినిధిగా నియమించాడు. మొరొంగి- ఖొవ-గొహైన్ పాలనలో మునుపటి కచారీ కాలానికి సంబంధించిన ప్రజలు అనేక మంది అహోం రాజ్యం అంతటి నుండి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆసక్తికరంగా ఇలా వలస వచ్చిన ప్రజలలో పలు కులాలకు, పలు మతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. అందువలన రాజ్యంలో తిరిగి తిరుగుబాటు తలెత్తడానికి అవకాశం కలిగింది. మొరొంగి- ఖొవ-గొహైన్‌లలో అత్యధికులు బర్హాగోహైన్ కుటుంబాలకు చెందిన వారు. రాకుమారుడు నుమాలి గోహైన్ నుమాలిగర్ కోటను నిర్మించాడు. మొరొంగి- ఖొవ-గొహైన్‌కు నుమాలిగర్ కోట రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతానికి నాగాలు, కచారీలు, డిమాసస్, ఇతర ప్రాంతాలకు మధ్య వ్యాపార సంబంధాలు ఉండేవి.

బ్రిటిష్ ప్రభుత్వంసవరించు

అస్సాంను బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తరువాత 1846లో కొత్తగా రూపొందించిన ఘోలాఘాట్ సబ్‌డివిషన్‌లో శివ్‌సాగర్ జిల్లాయో డోయాబ్- ధంసరి లోయ భాగంగా మారింది. గోలాఘాట్ భారత్ స్వాతంత్ర్య సమరంలో క్రియాశీలకపాత్ర వహించింది. కుషల్ కొన్వర్ కమల మిరి దాస్, బిజు వైష్ణవ్, శంకర్ చంద్రబరుయా, ష్రీ తారా ప్రసాద్ బరూహ్, రాజేంద్ర నాథ్ బరియా, గౌరీలాల్ జైన్, గంగా రాం బొర్మేడి, ద్వారీకాంత్ గోస్వామీ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఈ ప్రాంతం నుండి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15 న శిబ్‌సాగర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి గోలాఘాట్ జిల్లా రూపొందించబడింది. .[1]

భౌగోళికంసవరించు

గోలాఘాట్ జిల్లా వైశాల్యం 3502చ.కి.మీ.[2] వైశాల్యపరంగా జిల్లా బహ్మాస్‌లోని నార్త్ అండోర్స్ ద్వీపానికి సమానం.[3]

ప్రాంతంసవరించు

గోలాఘాట్ జిల్లా ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్ర నది, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో జోర్హాట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కర్బి ఆంగ్లాంగ్, నాగావ్ జిల్లా ఉన్నాయి. నాగాలాండ్ రాష్ట్రం లోని లైసంగ్ శిఖరం నుండి ధంసరి నది ఈ జిల్లాగుండా ప్రవహిస్తుంది. ధంసరి నది జిల్లా ఉత్తర భూభాగం నుండి దక్షిణ భూభాగం వరకు జీల్లాలో 352 కి.మీ దూరం ప్రవహించి బ్రహ్మపుత్రా నదిలో సంగమిస్తుంది. డోయాంగ్, నంబూర్ డోయీగ్రంగ్, కలియోని నదులు ధంసరి నదికి ఉపనదులుగా ఉన్నాయి. కలియోని నది గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల మద్య సరిహద్దును ఏర్పాటు చేస్తుంది.

అభయారణ్యంసవరించు

వాతావరణంసవరించు

జిల్లాలో ఉపౌష్ణమండల వాతావరణం నెలకొని ఉంది. వేసవి కాలంలో వేడి, తేమతో కూడి ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 1300 మిమీ. జూన్, జూలై మాసాలలో అధికమైన వర్షపాతం ఉంటుంది. జూన్ మాసంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30డిగ్రిల సెల్షియస్‌కు చేరుకుంటుంది. డిసెంబరు మాసంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుంది.

ఆర్ధికంసవరించు

గోలాఘాట్ జిల్లా ఆర్థికంగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పరిగణించబడుతుంది. జిల్లాలో టీ, వడ్లు, చెరుకు ప్రధాన పంటలుగా ఉన్నాయి. అలాగే టీ తయారీ పరిశ్రలు జిల్లాలో అధ్యధికంగా ఉన్నాయి. జిల్లాలో 63 టీ తోటలు ఉన్నాయి. వీటి నుండి 20,000 టన్నుల టీ ఉత్పత్తి జరుగుతుంది. అంతే కాక జిల్లాలో చిన్నతరహా టీ తోటల పెంపకం కూడా అధికరిస్తుంది. చిన్నతరహా టీ తోటల నుండి పెద్ద తోటలకంటే అధికంగా ఆదాయం లభిస్తుంది. నిరుద్యోగులకు టీ తోటల పెంపకం ప్రోత్సాహకరమైన ఉపాధిగా మారుతూ ఉంది. అస్సాంపట్టు ముగ, ఎండి అభివృద్ధి పధంలో ముందుకు సాగుతుంది. జాపీ తయారీ, అగరు ఆయిల్ ఉత్పత్తి జిల్లాలో ప్రధాన కుటీరపరిశ్రమలుగా ఉన్నాయి. గోలాఘాట్ జిల్లా ముగా పట్టు, అగరు నూనె రాష్ట్రంలోనే నాణ్యమైనవిగా భావించబడుతున్నాయి. చెరుకు మడ్డిని నిలువజేయడానికి అవసరమైన పొడవైన గొంతు కూజా " లాంగ్ నెక్ ఎర్తెన్ పొటెంషియల్ " ప్రపంచంలో అసమానమైన నాణ్యతకలిగినవిగా భావించబడుతున్నాయి.

నుమాలిగర్ రిఫైనరీసవరించు

ఘోలాఘాట్ జిల్లాలో నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్.ఆర్.ఎల్) ప్రధానమైన బృహత్తర పరిశ్రమగా గుర్తించబడుతుంది. ఈ పరిశ్రమ నుమాలిఘర్ వద్ద ఉంది. ఇక్కడ సంవత్సరానికి 3మిలియన్ల క్రూడ్ ఆయిల్ తయారుచేయబడుతుంది. నుమాలీఘర్ రిఫైనరీ 2000 అధునికీకరణ చేయబడింది. మల్టీ- ఫేస్డ్ రిఫైనరీగా పేరుపొందిన నుమాలీఘర్ రిఫైనరీ ప్రభుత్వ రిఫైనరీలలో మొదటి స్థానంలో ఉంది. నాణ్యత, పరిసరాల పరిరక్షణ, నిర్వహణా విధానాలు, ఉద్యోగుల ఆరోగ్యరక్షణ వంటి విషయాలలో ఎన్.ఆర్.ఎల్ అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేట్లు పొందింది.

విభాగాలుసవరించు

  • జిల్లాలో 4 అస్సామీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : బొకాఖాట్, సరుపథర్, గోలాఘాట్, ఖుమతి.[4] ఇవి 4 కలియాబొర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[5]

నిర్వహణసవరించు

గోలాఘాట్ ధంసరి, బొకాఖత్ సబ్‌డివిషనల్ అధికారులు డెఫ్యూటీ కమీషనర్ కార్యకలాపాలను గమనిస్తూ ఉంటారు. డిఫ్యూటీ కమీషనర్ అధికారిక ఉపశాఖలు నిర్వహణ, పౌరరక్షణ, అభివృద్ధి, ఎన్నికలు, నగరరక్షణ, పన్ను విధింపు, మెజెస్ట్తియల్, నజారత్, వ్యక్తిగతం, రిజిస్ట్రేషన్, రెవెన్యూ సప్లై, ట్రెషరీ, జిలాసైంక్ బోర్డ్ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. జిల్లా కోర్టులు,, సెషన్‌జడ్జి కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,058,674,[6]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 430వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 302 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.88%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 961:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 78.31%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

మతంసవరించు

విషయాలు వివరణలు
హిందువులు 813,263
ముస్లిములు 74,808 (7.9%),
క్రైస్తవులు 52,277.
స్థానికులు అహోం, కలిత, అస్సామీ బ్రాహ్మణులు, టీ- గిరిజనులు, మిసింగ్ ప్రజలు, సుతియా, తాయ్ ఐటన్
వలస ప్రజలు మార్వారీలు, బెంగాలీలు

సంస్కృతిసవరించు

గోలాఘాట్‌తో పలు మేధావులకు సంబంధం ఉంది. అస్సామీ సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్న సాహిత్యకారులకు గోలాఘాట్ జన్మస్థానం. 19వ శతాబ్ధపు ప్రముఖ రచయిత హేంచంద్ బరుయా, మొదటి అస్సామీ డిక్షనరీ రచయిత హేంకోష్, రఘునాథ్ మహంత, డోయాంగ్‌ అలెంగి సత్రాకు చెందిన సత్రాధికర్ 3 ఉత్తమ రచనలు (సత్రంజయ్ కావ్య, అద్భుత్ రామాయణం, కథా రామాయణ్) చేసారు. అహోం కాలం నాటి గుర్తించతగిన రచయిత దుర్గేశ్వర్ ద్విజి గోలాఘాట్ వాసి అన్నది ప్రత్యేకత. ఆయన " సంఘ్‌ఖోసర్ " అనే గ్రంథం వ్రాసాడు.19వ శతాబ్దంలో ప్రముఖ రచయితగా హేమచంద్ర గోస్వామికి గుర్తింపు ఉంది. అస్సామీ భాషలో ఆయన మొదటి సన్నెట్ రచయిత. అస్సామీ రచయిత్రి, అస్సామీ కథానిక రచనలకు మొదటి రచయిత్రిగా గుర్తింపు పొందిన ఖటోనియర్ గోలాఘాట్‌లో జన్మించింది.

రావుబహదూర్ ఘనశ్యాం బరుయాసవరించు

అస్సామీ మొదటి కేంద్రమంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రావుబహదూర్ ఘనశ్యాం బరుయా షేక్స్ఫియర్ రచన కామెడీ ఎర్రర్స్‌ను అస్సామీ భాషలో వ్రాసిన 4 రచయితలలో ఒకడుగా గుర్తించబడ్డాడు. కమల్ చంద్రశర్మ " అస్సామియా భాషా ఉన్నోటి సభా " కాత్యదర్శిగా పదవీ బాధ్యత వహించాడు. అస్సామీ సాహిత్యకారుడు,సయ్యద్ అబ్దుల్ మాలిక్ గోలాఘాట్ లోని నహొరొని గ్రామంలో జన్మించాడు. ఆయన అస్సాం సాహిత్య సభ అద్యక్షుడుగా పదవీ బాధ్యత వహించాడు. ఆయన సహిత్య అకాడమీ, శంకర్‌దేవ్ అవార్డ్, సాహిత్యాచార్య వంటి పదవులతో గౌరవించబడ్డాడు.

ఇతరులుసవరించు

అస్సామీ సాహిత్యంలో తమకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నవారిలో సురేంద్రనాథ్ సల్కియా, హరిప్రసాద్ బరుయా, కీర్తినాథ్ హజరికా, డాక్టర్ నాగేన్ సైకియా, డాక్ట్స్ర్ డెబో ప్రసాద్ బరూయా, నిలమొని ఫుకాన్, సమీర్ తంతి, లఖికంట మహంతా, పురాణ చంద్ర గోస్వామి, డాక్టర్ ఉపేన్ కకొటీ, లోలిత్ బరుయా, గొలాప్ ఖౌండ్, ప్రెమాధర్ దత్తా ముఖ్యులు. 1918లో స్థాపినచబడిన గోలాఘాట్ సాహిత్యసభ అస్సాంరాష్ట్ర అతిపురాతన సాహిత్యసభగా భావించబడుతుంది.

వృక్షజాలం , జంతుజాలంసవరించు

1974లో గోలాఘాట్ జిల్లాలో " 472 చ.కి.మీ వైశాల్యంలో " కళిరంగా నేషనల్ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[9] జిల్లా ఈ పార్క్‌ను నాగావ్ జిల్లాతో పంచుకుంటుంది. జిల్లాలో " నంబర్ - డోయిగ్రుంగ్ వన్యప్రాణి అభయారణ్యం " ఏర్పాటు చేయబడింది.

మూలాలుసవరించు

  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.CS1 maint: extra text: authors list (link)
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. North Andros Island 3,439 horizontal tab character in |quote= at position 20 (help)
  4. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  5. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులుసవరించు

Coordinates: 26°00′N 93°00′E / 26.0°N 93.0°E / 26.0; 93.0

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు