గౌరీశంకరాలయం, కరీంనగర్
గౌరీశంకరాలయం తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పాతబజారులో ఉన్న ఆలయం. చక్కటి శిల్ప కళతో ఉన్న ఈ ఆలయం దాదాపు 800 ఏళ్ల క్రితం కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది.[1]
గౌరీశంకరాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°27′N 79°08′E / 18.45°N 79.13°E |
పేరు | |
ప్రధాన పేరు : | గౌరీశంకరాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | కరీంనగర్ జిల్లా |
ప్రదేశం: | కరీంనగర్ |
నిర్మాణం
మార్చుఈ ఆలయ నిర్మాణ పద్ధతి, గర్భాలయం గదిలోని వాస్తు కళాతోరణంలో గణపతిని, శైవాగమానికి దగ్గరగా శాస్త్రీయంగా ఉన్న రుజువులను బట్టి సా.శ. 1295 - సా.శ. 1323 మధ్యకాలంలో ప్రతాపరుద్రునిచే ఈ ఆలయం నిర్మించబడినది భావిస్తున్నారు. ఈ ఆలయంలోని ఒక్కో స్తంభంపై జలంధహర, వీరభద్ర, సంధ్యతాండవ, దక్షిణమూర్తి, హరిహర వంటి శంకరుని అవతారాలు చెక్కబడ్డాయి. గర్భాలయం చుట్టూ కూర్చొని అభిషేకాలు చేసుకునేవిధంగా గర్భాలయం, అంతర గర్భాలయం బయట రాతితో శాడశ స్తంభ మంటపాలను నిర్మించారు.
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపట్టి, ఆగ్నేయంలో అయ్యప్ప స్వామి, వీరభద్రుడు, దక్షిణంలో కాల భైరవుడు, సప్తమాతృకలు, నైరుతిలో బ్రహ్మ, పశ్చిమంలోన సరస్వతీ దేవి, వాయువ్యంలో సుబ్రమణ్యస్వామి, ఉత్తరంలో నారాయణమూర్తి, ఉత్తర ఈశాన్యంలో నవగ్రహాలు ఏర్పాటుచేయబడ్డాయి.
ఉత్సవాలు
మార్చుశివరాత్రి
మార్చుమహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3.30 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అభిషేకాలు, మధ్యాహ్నం 4 గంటల నుంచి సర్వదర్శనాలు విశేష ద్రవ్య దాతలకు (ఆలయ పునర్నిర్మాణ దాతలకు) 7 గంటల వరకు అభిషేకాలు, ఉదయం 7 గంటల నుంచి సార్వజనిక అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు ప్రదోష కాల పూజలు, రాత్రి 9 గంటలకు పల్లకి సేవ, రాత్రి 10 గంటల నుంచి మహాన్యాస రుద్రాభిషేకాలు, ఫల పంచామృతాభిషేకాలతో విశేష పూజలు నిర్వహించబడుతాయి. పూజానంతరం దర్శనం, జాగారం ఉంటుంది.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, రాజన్న సిరిసిల్లా జిల్లా (4 March 2019). "కాకతీయుల కళా వైభవం". Archived from the original on 4 March 2019. Retrieved 5 March 2019.