చందవరం (దొనకొండ మండలం)
చందవరం ప్రకాశం జిల్లా, దొనకొండ మండలంలోని గ్రామం. ఇక్కడి చందవరం బౌద్ధస్తూపం ఒక పర్యాటక ఆకర్షణ.
చందవరం (దొనకొండ మండలం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°54′12.4740″N 79°25′43.1393″E / 15.903465000°N 79.428649806°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | దొనకొండ |
విస్తీర్ణం | 17.65 కి.మీ2 (6.81 చ. మై) |
జనాభా (2011)[1] | 4,016 |
• జనసాంద్రత | 230/కి.మీ2 (590/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,101 |
• స్త్రీలు | 1,915 |
• లింగ నిష్పత్తి | 911 |
• నివాసాలు | 1,008 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08408 ) |
పిన్‌కోడ్ | 523305 |
2011 జనగణన కోడ్ | 590620 |
భౌగోళికం
మార్చుఇది మండల కేంద్రమైన దొనకొండ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం జిల్లా కేంద్రం ఒంగోలు నుండి 70 కి.మీ. దూరంలో, కర్నూలు - గుంటూరు రాష్ట్ర రహదారిలో, త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది.
సమీప గ్రామాలు
మార్చుపడమటినాయుడుపాలెం 6 కి.మీ, వెల్లంపల్లి 7 కి.మీ,కల్లూరు 7 కి.మీ, రుద్రసముద్రం 8 కి.మీ, దొనకొండ 9 కి.మీ.
జనగణన
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1008 ఇళ్లతో, 4016 జనాభాతో 1765 హెక్టార్లలో విస్తరించి ఉంది.[2] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో నివాస గృహాలు 646 ఉన్నాయి గ్రామ జనాభా 2,851.
చందవరం బౌద్ధస్తూపం
మార్చుఈ గ్రామంలో పురాతన బౌద్ధారామం, బౌద్ధస్తూపం ఉంది. ఇది 1965 లో జరిగిన త్రవ్వకాల్లో బయల్పడింది. 1972వ సంవత్సరంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని నాలుగు దఫాలుగా ఇక్కడ త్రవ్వకాలు జరిపితే అనేక వందల చిన్న స్తూపాలు, 15 పెద్ద స్తూపాలు బయల్పడ్డాయి. ఈ బౌద్ధస్తూపం దాదాపు 200 అడుగుల ఎత్తుగల కొండపై ఉంది. స్తూపం చుట్టుకొలత దాదాపు 120 అడుగులు ఉండి సుమారు 30 అడుగుల ఎత్తు ఉంది. ఈ స్తూపానికి ఆయక స్తంభాలు లేవు.[3] సా.శ 710లో ఆది శంకరాచార్యుడు దక్షిణ భారతయాత్ర చేసిన సందర్భంగా, బౌద్ధ ధర్మం, బౌద్ధ స్తూపాలు క్షీణించినందున ఈ స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన మహాబలేశ్వరాలయ నిర్మాణంలో ఉపయోగించి ఉండవచ్చని కొందరి భావన. బౌద్ధస్థూపం ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ఉంది. బౌద్ధ శ్రమణకులు విశ్రాంతి తీసుకునే మందిరాల పునాదులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
రాష్ట్రంలోకెల్లా అతి పెద్దదయిన ఈ స్థూపం, సాంచీ స్థూపంతో పోటీపడుచున్నది. కేంద్ర ప్రభుత్వ పురాతత్వశాఖవారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినారు. ఈ కేంద్రాన్ని, అమరావతి, నాగార్జునకొండ మొదలగు బౌద్ధకేంద్రాలతో కలిపి ఆధ్యాత్మక విహారకేంద్రంగా తయారుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులతో స్థానికంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ గుండ్లకమ్మ నదిపై ఒక వంతెన నిర్మించి ఈ కేంద్రాన్ని అందరికీ అందుబాటులోకి తీసికొని రావాలని ప్రభుత్వ సంకల్పం.[4]
2,000 సంవత్సరాల క్రితం, బౌద్ధులు ధాన్యకటకం (అమరావతి) నుండి పుష్పగిరి - కంచి - రామేశ్వరం మీదుగా శ్రీలంక వెళ్ళేటందుకు, లక్షల సంఖ్యలో కదిలేవారు. వీరందరికీ చందవరం బౌద్ధ ప్రదేశం ప్రధాన విశ్రాంతి కేంద్రం. ఇక్కడ ఉన్న స్థూపం వద్ద ఎప్పుడూ 500 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారంటే ఇక్కడ బౌద్ధం ఎంతగా వెలిగిందో అర్ధమవుతుంది. దీని ప్రభావం తీర ప్రాంతం మీద గూడా పడి చినగంజాం, పెదగంజాం, కనపర్తి తదితర ప్రాంతాలలో, సముద్రఘోషతో సమానంగా బుద్ధుని భావనలు ప్రజానీకానికి అందినవి.[5]
బుద్ధభగవానుడు మానవాళికి జ్ఞానబోధ చేసిన రోజును పురస్కరించుకుని, ఈ బౌద్ధ స్తూపం వద్ద, 2017,జులై-30న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ధర్మచక్ర పరివర్తన దినోత్సవం నిర్వహించారు.[6]
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి బాదాపురంలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బాదాపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ కంభంలోను, మేనేజిమెంటు కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుచందవరంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి.
భూమి వినియోగం
మార్చుచందవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 497 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 258 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 326 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 172 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 12 హెక్టార్లు
- బంజరు భూమి: 47 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 451 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 120 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 390 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుచందవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 198 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 106 హెక్టార్లు
- చెరువులు: 85 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుచందవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ DISTRICT CENSUS HANDBOOK PRAKASHAM - VILLAGE AND TOWN DIRECTORY (PDF). DIRECTORATE OF CENSUS OPERATIONS ANDHRA PRADESH. 2011-10-01. p. 262.
- ↑ "Chandavaram (Prakasam District)". AP Museum. Archived from the original on 2009-04-10.
- ↑ ది హిందు ఆంగ్ల దినపత్రిక; 2015,ఏప్రిల్-26; 5వపేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-12; 8వపేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,జులై-23; 2వపేజీ.