పడమటినాయుడుపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

పడమటినాయుడుపాలెం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] ఎస్.టి.డి కోడ్: 08592.

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°37′12″N 79°51′58″E / 15.62°N 79.866°E / 15.62; 79.866Coordinates: 15°37′12″N 79°51′58″E / 15.62°N 79.866°E / 15.62; 79.866
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
విస్తీర్ణం
 • మొత్తం4.96 కి.మీ2 (1.92 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం3,933
 • సాంద్రత790/కి.మీ2 (2,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి969
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523226 Edit this on Wikidata


సమీప మండలాలుసవరించు

తూర్పున సంతనూతలపాడు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన కొండపి మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలసవరించు

350 మంది విద్యార్థులతో, 9 మంది ఉపాధ్యాయులతో ఆదర్శంగా నిలుచుచున్న ఈ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమికోన్నత పాఠశాలగా స్థాయి పెంపుదల (అప్ గ్రేడ్) చేయడానికి విద్యశాఖ కమిషనర్ ఆమోదించారు. [3]&[5] ఆంధ్ర నాటక కళా సమితి నిర్వహించిన రాష్ట్రస్థాయి గాంధీ సిద్ధాంత కవితల పోటీలలో ఈ పాఠశాలలో ఆరవ తరగతి చదువుచున్న జి.సంతోష్ అను విద్యార్థి ప్రోత్సాహక బహుమతి సాధించాడు. విజయవాడలోని హోటల్ మమతా కాన్‌ఫరెన్స్ హాలులో, 2017, మార్చి-13న నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కళాసమితి అధ్యక్షులు శ్రీ కర్నాటి లక్ష్మీనరసయ్య సంతోష్‌కు బహుమతి ప్రదానం చేసారు. శాంతివనం సంస్థ ద్వారా ఈ విద్యార్థి కవితా రచనలో శిక్షణ తీసుకున్నాడు. [6]

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామంలోని ప్రజలందరికీ రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రయత్నం మొదలుపెట్టినారు. గతంలో గ్రామంలో ఉన్న మంచినీటి పథకానికి అనుబంధంగా, గ్రామంలో ప్రతి ఇంటికీ కొళాయిలు ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని, 2014, ఆగస్టు-8వ తేదీన ప్రారంభించారు. [4]

విద్యుత్తు ఉపకేంద్రంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూరాకుల కరుణాకరరెడ్డి, 32 ఓట్ల ఆధిక్యంతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాదరిత వృత్తులు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలో ఆత్మ ప్రాజెక్టు పరిధిలో ఒక పట్టుపరిశ్రమ యూనిట్ స్థాపించారు. [5]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,933 - పురుషుల సంఖ్య 1,997 - స్త్రీల సంఖ్య 1,936 - గృహాల సంఖ్య 856

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,185.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,619, స్త్రీల సంఖ్య 1,566, గ్రామంలో నివాస గృహాలు 610 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 496 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-25,2013; 1పేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-26; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగస్టు-9; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, డిసెంబరు-26; 3వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-15; 1వపేజీ.