చంద్రుపట్ల రాంరెడ్డి

చంద్రుపట్ల రాంరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 1994 నుండి 1999 వరకు తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

చంద్రుపట్ల రాంరెడ్డి

మాజీ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1994 – 1999
నియోజకవర్గం మంథని శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బిజేపి

జీవిత విశేషాలు మార్చు

రాంరెడ్డి, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథనిలో జన్మించాడు.

రాజీయ జీవితం మార్చు

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాంరెడ్డి, 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీపాద రావుపై 21,155 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[2] 1999లో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతిలో 15,271 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2021 ఏప్రిల్ 3న బిజేపిలో చేరాడు.

మూలాలు మార్చు

  1. "🗳️ Ram Reddy Chandrupatla, Manthani Assembly Elections 1994". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-07. Retrieved 2022-04-07.
  2. TV, Telugupopular (2018-11-28). "మంథనిలో పుట్టా పట్టు నిలుపుకుంటాడా...దుద్దిళ్ళకి జై కొడతారా...?". Telugu Popular TV. Archived from the original on 2019-09-13. Retrieved 2022-04-07.
  3. "ఆ.. ముగ్గురు హ్యాట్రిక్‌ విజేతలు". Sakshi. 2018-11-07. Archived from the original on 2022-04-07. Retrieved 2022-04-07.