మంథని శాసనసభ నియోజకవర్గం
మంథని శాసనసభ నియోజకవర్గం, పెద్దపెల్లి జిల్లాలోని 2 శాసనసభ స్థానాలలో ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
- కమానుపూర్
- మంథని
- కాటారం
- మహాదేవపూర్
- ముత్తారం
- మల్హర్రావు
- మహా ముత్తారం
- పలిమెల
- రామగిరి
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులుసవరించు
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 24 | మంథని | జనరల్ | దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | పు | కాంగ్రెస్ పార్టీ | 89045 | పుట్ట మధు | పు | టీఆర్ఎస్ | 89045 |
2014 | 24 | మంథని | జనరల్ | పుట్ట మధు | పు | టీఆర్ఎస్ | 84037 | దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | పు | కాంగ్రెస్ పార్టీ | 64677 |
2009 | 24 | మంథని | జనరల్ | దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | పు | కాంగ్రెస్ పార్టీ | 63770 | పుట్ట మధు | పు | ప్రజారాజ్యం | 50561 |
2004 | 248 | మంథని | జనరల్ | దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | పు | కాంగ్రెస్ పార్టీ | 79318 | సోమారపు సత్యనారాయణ | పు | టీడీపీ | 36758 |
1999 | 248 | మంథని | జనరల్ | దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | పు | కాంగ్రెస్ పార్టీ | 65884 | చంద్రుపట్ల రాంరెడ్డి | పు | టీడీపీ | 50613 |
1994 | 248 | మంథని | జనరల్ | చంద్రుపట్ల రాంరెడ్డి | పు | టీడీపీ | 61504 | దుద్దిల్ల శ్రీపాద రావు | పు | కాంగ్రెస్ పార్టీ | 40349 |
1989 | 248 | మంథని | జనరల్ | దుద్దిల్ల శ్రీపాద రావు | పు | కాంగ్రెస్ పార్టీ | 50658 | బెల్లంకొండ సక్కు బాయి | పు | టీడీపీ | 43880 |
1985 | 248 | మంథని | జనరల్ | దుద్దిల్ల శ్రీపాద రావు | పు | కాంగ్రెస్ పార్టీ | 34448 | బెల్లంకొండ నర్సింగ రావు | పు | టీడీపీ | 27046 |
1983 | 248 | మంథని | జనరల్ | దుద్దిల్ల శ్రీపాద రావు | పు | కాంగ్రెస్ పార్టీ | 28470 | చందుపట్ల రాజి రెడ్డి | పు | స్వతంత్ర | 27107 |
1978 | 248 | మంథని | జనరల్ | సి. నారాయణ రెడ్డి | పు | కాంగ్రెస్ | 20482 | ఊర శ్రీనివాస రావు | పు | కాంగ్రెస్ | 11890 |
1972 | 243 | మంథని | జనరల్ | పాములపర్తి వెంకట నరసింహారావు | పు | కాంగ్రెస్ | 35532 | ఈ. వీ. పద్మనాభం | పు | ఎస్.టీ.ఎస్ | 3151 |
1967 | 243 | మంథని | జనరల్ | పాములపర్తి వెంకట నరసింహారావు | పు | కాంగ్రెస్ | 25810 | యూర | పు | స్వతంత్ర | 16440 |
1962 | 254 | మంథని | జనరల్ | పాములపర్తి వెంకట నరసింహారావు | పు | కాంగ్రెస్ | 16844 | గులుకోట శ్రీరాములు | పు | స్వతంత్ర | 3740 |
1957 | 49 | మంథని | జనరల్ | పాములపర్తి వెంకట నరసింహారావు | పు | కాంగ్రెస్ | 19270 | నంబయ్య | పు | పిడిఎఫ్ | 9603 |
1999 ఎన్నికలుసవరించు
1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు గెలుపొందారు. దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టు (పీపుల్స్‌వార్) నక్సలైట్లు 1999 ఏప్రిల్ 13న కాల్చిచంపారు. శ్రీపాదరావు మరణానంతరం ఏర్పడిన సానుభూతి పవనాల్లో రాజకీయవారసునిగా రంగప్రవేశం చేసిన ఆయన కుమారుడు శ్రీధర్‌బాబు ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కాలంలో శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు.[1]
2004 ఎన్నికలుసవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కల్వసోమాపుర సత్యనారాయణపై 42560 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. శ్రీధర్ బాబుకు 79318 ఓట్లు రాగా, సత్యనారాయణకు 36758 ఓట్లు లభించాయి. రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2004 నుంచి 2009 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా, ప్యానెల్ స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా వివిధ పదవులను చేపట్టారు.[1]
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రౌతు కనకయ్య పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పోటీచేశారు. భారతీయ జనతా పార్టీ నుండి శశిభూషన్ కాచే, ప్రజారాజ్యం పార్టీ తరఫున పుట్ట మధు, లోక్‌సత్తా నుండి ఓ.సంపత్ పోటీచేశారు.[2] శాసనసభ్యునిగా మంథని తరఫున మూడోసారి గెలుపొందిన శ్రీధర్‌బాబుకు 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్), ప్రవాసాంధ్రుల శాఖలల మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్య ఏర్పాటుచేసిన ప్రభుత్వంలోనూ ఉన్నత విద్యాశాఖ, ప్రవాసాంధ్రుల శాఖలకు మంత్రిగానే కొనసాగారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో శాసనసభ వ్యవహారాలశాఖ, పౌరసరఫరాల శాఖలను చేపట్టారు.[1] 2014లో శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాలశాఖ నుంచి తప్పించి వాణిజ్యపన్నుల శాఖను అప్పగించారు.[3] తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చకు వచ్చే తరుణంలో తనను కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం అవమానకరమని పేర్కొంటూ శ్రీధర్‌బాబు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.[4][5] ఆయన రాజీనామా ఆమోదానికి కాకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలనలోకి, శాసన సభ సుప్తచేతనావస్థలోకి వెళ్లడంతో సాంకేతికంగా మంత్రిగానే తదుపరి ఎన్నికలు ఎదుర్కొన్నట్టు భావించాలి.
2014 ఎన్నికలుసవరించు
2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పుట్ట మధుకర్ గెలుపొందారు.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 జననేతగా ఎదిగిన శ్రీధర్‌బాబు:ఆంధ్రజ్యోతి:మార్చి 30, 2014
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ శ్రీధర్‌బాబు శాఖ మారింది:సాక్షి దినపత్రిక:జనవరి 1, 2014
- ↑ మంత్రి పదవికి శ్రీధర్‌బాబు రాజీనామా:సాక్షి దినపత్రిక:జనవరి 2, 2014
- ↑ శ్రీధర్‌బాబు రాజీనామా:సాక్షి దినపత్రిక:జనవరి 3, 2014