చర్చ:ఏది చరిత్ర? (పుస్తకం)
తాజా వ్యాఖ్య: పుస్తకాల గురించి వ్యాసాలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
భారతదేశ చరిత్ర ప్రాజెక్టు
మార్చుఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు భారతదేశ చరిత్రలో చేర్చవచ్చా. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:50, 2 జూన్ 2007 (UTC)
- శాస్త్రీయ చారిత్రకపుస్తకం అంటున్నారు కాబట్టి చేర్చవచ్చు అనుకుంటున్నా --వైఙాసత్య 19:52, 2 జూన్ 2007 (UTC)
- ఈ పుస్తకం చరిత్రను వివరిస్తుంది, కానీ ఇది చారిత్రక పుస్తకం కాదు. అందుకనే నేకు పై సందేహం వచ్చింది. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 20:45, 2 జూన్ 2007 (UTC)
- ఈ పుస్తకం మౌలిక పరిశోధన కాదు. అనేక చరిత్ర పుస్తకాలను వనరులుగా తీసుకుని చరిత్రను ఒక కొత్త కోణంలో రాసినది. అయితే ప్రతి చోటా తగు ఆధారాలను చూపించాడు రచయిత. చరిత్ర రాస్తూనే, గతంలో వచ్చిన చరిత్ర పుస్తకాల్లో చరిత్రను ఎలా వక్రీకరించారో రాసుకుంటూ పోయాడు. చరిత్ర ప్రాజెక్టులో భాగమా అనే విషయమై నాకు సందేహమే! __చదువరి (చర్చ • రచనలు) 19:57, 2 జూన్ 2007 (UTC)
- నాకు అర్థం అవుతున్నావరకు ఈ వ్యాసాన్ని భారత చరిత్ర ప్రాజెక్టులో చేర్చలేం.. ఇది చరిత్ర గురించి ఎమీ చెప్పడం లేదు. చరిత్రమీద పుస్తకం.. పుస్తకాల లిస్టులో చేర్చాలి, లేదా వికీసోర్సు కి మార్చాలి.--మాటలబాబు 20:28, 2 జూన్ 2007 (UTC)
- వ్యాసంలో రాసింది పుస్తకం కాదు, పుస్తకం గురించి మాత్రమే. అంచేత, ఈ వ్యాసాన్ని వికీసోర్సుకు మార్చాల్సిన అవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 20:46, 2 జూన్ 2007 (UTC)
"శాస్త్రీయ" ?
మార్చుమొదటి వాక్యంలోని "శాస్త్రీయ" పదంపై నాకు కొన్ని సందేహాలు కలిగాయి. శాస్త్రీయ చరిత్రపుస్తకం కాదేమోనని అనిపించింది. ప్రస్తుతానికి "శాస్త్రీయ" పదాన్ని తొలగించాను. సభ్యులు పరిశీలించగలరు. [ఈ వ్యాఖ్య రాసినది, చదువరి]
పుస్తకాల గురించి వ్యాసాలు
మార్చువికీ లో పుస్తకాల గురించి ప్రత్యేక వ్యాసాలు వ్రాయటానికి కొన్ని నింబధనలు ఉంచవలసిన అవసరం ఉన్నదని నా ఉద్దేశ్యము. లేక పొతే, అనేకమయిన పబ్లిషర్లు, వారు ప్రచురించిన పుస్తకాల గురించి వికీలో వ్రాసి ఉచిత ప్రచారము పొందే అవకాశము లేక పోలేదు. ఈ విషయంలొ నా సూచనలు:
- ఆ పుస్తకము గత 15-20 సంవత్సరాలకు పూర్వము ప్రచురించబడి ఉండాలి.
- ఆ పుస్తకము చాలా ప్రాచుర్యములో, వ్యాసము వ్రాయటానికి పూర్వమే ఉండి ఉండాలి.
- ఆ పుస్తకములోని విషయము ఎక్కువ మందికి ఉపయోగపడెదయి ఉండాలి (దీనికి కూడా అందరికి అమోదయోగ్యమయిన నిబంధనలు వ్రాసుకోవాలి)
- ప్రస్తుతము దొరకని "ప్రముఖ" (to be defined)పుస్తకము గురించి (out of print)