భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విశ్వనాధ్ నటించిన చిత్రాలు విభాగంలో ఠాగూర్ పేజీని అయోమయ నివృత్తి పేజీకే తరలించి సినిమా పేజీకి లింకు ఇవ్వాలి. ఎలా ?

  • విశ్వనాధ్ వ్యాసములో లింకును ఈ విధముగా మార్చెయ్యండి. [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] --వైఙాసత్య 14:23, 4 అక్టోబర్ 2006 (UTC)

పుట్టిన తేదీకి సంబంధించిన సందేహం మార్చు

  • విశ్వనాథ్ గారి పుట్టిన తేదీ ఈ వ్యాసంలో ఏప్రిల్ 19 గా పేర్కొనబడింది. అయితే ఇంగ్లీషు వికీపీడియాలో ఫిబ్రవరి 19గా పేర్కొన్నారు. ఈ విషయాన్ని భమిడిపాటి ఫణిబాబు గారు తమ బ్లాగులో ఎత్తిచూపారు.

https://harephala.wordpress.com/2016/04/19/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AB%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%95%E0%B0%AC%E0%B1%81-14/ ఎవరైనా విశ్వనాథ్ గారినే అడిగి లేదా సరైన ఆధారాన్ని సేకరించి పుట్టిన తేదీని నిర్ధారించుకుని తప్పును సరిచేయగలరా? స్వరలాసిక (చర్చ) 22:09, 19 ఏప్రిల్ 2016 (UTC)Reply

టెంప్లేట్ దిగుమతి మార్చు

 Y సహాయం అందించబడింది

ఆంగ్ల వికీపీడియాలోని en:Template:Kasinathuni Viswanath ను తెలుగులోకి దిగుమతి చేసుకొంటే; ఆతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలో నావిగేషన్ సులువుగా ఉంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:44, 25 ఏప్రిల్ 2017 (UTC)Reply

Rajasekhar1961 గారూ {{కాశీనాథుని విశ్వనాథ్}} ను తయారుచేయడం జరిగినది. ఈ వ్యాసం లో చేర్చడం జరిగినది.----కె.వెంకటరమణచర్చ 04:19, 27 ఏప్రిల్ 2017 (UTC)Reply
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:09, 27 ఏప్రిల్ 2017 (UTC)Reply

విశ్వనాథ్ గారి పుట్టినరోజు వివరం మార్చు

కె.విశ్వనాథ్ గారి పుట్టిన రోజు ఫిబ్రవరి 19 న 1930 సంవత్సరం అండి. నాకు ఖచ్చితంగా తెలుసు లేళ్ళపల్లి శ్రీదేవి Sridevi lellapalli (చర్చ) 18:08, 17 జూలై 2018 (UTC)Reply

ఈ వ్యాసంలో నేను చేసిన మార్పులను తిప్పిపంపటం గురించి మార్చు

అందరికీ నమస్కారములు...

నేను 23 మే, 2020 నాడు 'కె. విశ్వనాథ్' గారి వికీపేజ్ లో కొన్ని మార్పులను చేయటం జరిగింది. కానీ ఆ మార్పులు Pranayraj1985 గారిచే తిరస్కరించటం జరిగింది.

1) "2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు" ని "ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు" గా మార్చాను. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చింది '2016 సంవత్సరంలో చేసిన కృషికి కాదు'. ఆ మాటకొస్తే ఆయన 2016లో సినిమాలే చేయలేదు. దశాబ్దాలుగా ఆయన సినిమా రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2016లో ఆ అవార్డ్ ఇచ్చారు.

2) "చేశాడు, అందుకున్నాడు, చేరాడు, మొదలుపెట్టాడు, పనిచేశాడు" మొదలైన వాటిని "చేశారు, అందుకున్నారు, చేరారు, మొదలుపెట్టారు, పనిచేశారు" గా మార్చాను. తెలుగు కళాభిమానులందరూ అభిమానించే గొప్ప దర్శకుడిని గౌరవసూచకంతో సంభోదించటం తప్పెలా అవుతుంది?

స్పందిస్తారని ఆశిస్తూ... ఒక వికీ అభిమాని RaghavforWiki (చర్చ) 18:53, 23 మే 2020 (UTC)Reply

RaghavforWiki గారూ, మీరు చేసిన మొదటి సవరణ సరైనది. నేను మళ్ళీ మీరు చేసిన సవరణనే తిరిగి చేసాను. రెండవ సవరణ, బాగా చర్చనీయాంశమైన వివాదాస్పదమైన అంశానికి సంబంధించినది. విజ్ఞానసర్వస్వ వ్యాసాల్లో ఏకవచనమే వాడాలి, అది సరైన శైలి అని వికీపీడియాలో రాసుకున్నారు. వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి. దాని చర్చ పేజీ కూడా పరిశీలించగలరు. ప్రస్తుతం వ్యాసాల్లో రెండూ శైలులనూ వాడుతున్నారు. బహుశా వాడుకరి:Pranayraj1985 గారు ఏకవచన ప్రయోగానికి సంబంధించిన మార్పులను వెనక్కితిప్పడంలో మొదటి సవరణను కూడా తిప్పికొట్టినట్టైందనుకుంటాను.
మీరు చేసిన సవరణలు వికీపీడియాకు ఉపయోగపడేవి, దాన్ని మెరుగుపరచేవీను. అందుకు మీకు ధన్యవాదాలు. మరో సంగతి.. నేను చేసినదే సరి, ఈయన చేసింది పొరపాటు అని మళ్ళీ సవరిస్తారు ఎక్కువమంది. కానీ మీరు దాని గురించి ఎత్తిచూపుతూ చర్చ పేజీలో రాయడం అభినందనీయమైన సంగతి. వికీ సంప్రదాయంలోని ఉత్తమ పద్ధతుల్లో ఇదొకటి. చేసిన దిద్దుబాట్లు నాలుగే అయినా, నాణ్యమైన దిద్దుబాట్లు చేసారు, ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చరచనలు) 22:55, 23 మే 2020 (UTC)Reply
తెవికీలో రాస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు RaghavforWiki గారు... చదువరి గారు చెప్పినట్టు, వికీపీడియా నియమాన్ని అనుసరించి ఏకవచన ప్రయోగానికి సంబంధించిన మార్పులను వెనక్కితిప్పడం జరిగిందేగాని మరో ఉద్దేశ్యంతో కాదు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 01:10, 24 మే 2020 (UTC)Reply
Return to "కె.విశ్వనాథ్" page.