చర్చ:చంద్రగుప్త మౌర్యుడు
పేరు
మార్చుచంద్ర గుప్త మౌర్య అనాలి కదా. మౌర్యుడు అంటారా? చర్చసాయీరచనలు 08:56, 25 ఏప్రిల్ 2008 (UTC)
- డు, ము, వు, లు - ప్రధమా విభక్తి. కనుక తెలుగులో మౌర్యడు ఓకే. ("అశోకుడు", "గుప్తుడు" లాగా) - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:12, 25 ఏప్రిల్ 2008 (UTC)
- అశోకుడు ఒప్పుకోవచ్చు ఎందుకంటే అశోక అనేది పేరు కాబట్టి. కాని మౌర్య అనేది వంశం పేరు. కాబట్టి మార్చకూడదనుకుంటాను. చర్చసాయీరచనలు 09:15, 25 ఏప్రిల్ 2008 (UTC)
- ఉదాహరణకు, నా ఇంటి పేరు "సుంకు". "సుంకుడు" అంటే నేను ఒప్పుకోను. చర్చసాయీరచనలు 09:20, 25 ఏప్రిల్ 2008 (UTC)
- కొంతవరకు నువ్వు చెప్పిన సమస్య ఉంది. కాని నిషిద్ధం కాదు. (సముద్ర గుప్తుడు, రాజేంద్రచోళుడు, కరికాళ చోళుడు - వంటి పదాలు వాడుతారు.) ఇంటి పేరు, వంశం పేరు వేరు. తెలుగు ఇంటిపేరు తెలుగు పదమే గనుక దానికి మరో విభక్తి చేర్చే ప్రశ్న రాదు. ఒక తెలుగు మాటే తీసుకొందాము. "పల్లవ" రాజులకు "పల్లవులు" ఓకే. "పల్లవుడు" సాధారణంగా వాడం. పల్లవ భూపాలుడు అనవచ్చును. కనుక మౌర్య చంద్రగుప్తుడు తెలుగులో సరైన పేరు అవుతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:25, 25 ఏప్రిల్ 2008 (UTC)
- ఇతరులు ఏలా వాడితే ఏంటి. మనము సరైనది వాడదాము. చర్చసాయీరచనలు 09:30, 25 ఏప్రిల్ 2008 (UTC)
- తెవికీలోకి సమాచారం కోసం వచ్చేవాళ్ళు చంద్రగుప్త మౌర్య అని వెతకరు. చంద్రగుప్త మౌర్యుడు అని వెతుకుతారు. అంతే కాకుండా చరిత్రకు సంభందించిన తెలుగు పుస్తకాలలో ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం మౌర్యుడు అని వాడడం సబబే. ఇక సాయి చెప్పిన విషయానికొస్తే పేర్లు పిలవడానికి ప్రత్యేక నియమాలేమీ లేవు. కాబట్టి జనంలో ప్రాచుర్యం పొందిన పదం వాడడంలో తప్పు లేదని నా అభిప్రాయం. రవిచంద్ర(చర్చ) 13:31, 25 ఏప్రిల్ 2008 (UTC)
- తప్పు లేదు. అందుకే తరలించాను. రెండు పేర్లతోనూ వ్యాసం దొరుకుతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:03, 25 ఏప్రిల్ 2008 (UTC)
ఇది తప్పు. ఇలా ఐతే స్టీవ్ జాబ్స్ వ్యాసాన్ని జాబ్స్ స్టీవ్ అని, బిల్ గేట్స్ వ్యాసాన్ని గేట్స్ బిల్ అని తరలించాలి. చర్చసాయీరచనలు 02:38, 26 ఏప్రిల్ 2008 (UTC)
ఇంకొకటి "గుప్త" కూడా పేరు (given name) కాదు. కాబట్టి నా దృష్టిలో "గుప్తుడు" కూడా తప్పే. చర్చసాయీరచనలు 02:40, 26 ఏప్రిల్ 2008 (UTC)
- response లేనందువలన వ్యాసాన్ని తరలించాను. చర్చసాయీరచనలు 07:36, 27 ఏప్రిల్ 2008 (UTC)
- చంద్రగుప్త మౌర్యుడు అనడమే తెలుగులో సరైనది. తెలుగు వికీలో తెలుగులో వాడుకలో ఉన్న పదాలనే వాడాలి.--117.198.194.235 09:59, 27 ఏప్రిల్ 2008 (UTC)
- ఊర్కినే సరైనదంటే సరిపోదు. ఎందుకో చెప్పండి. చర్చసాయీరచనలు 10:01, 27 ఏప్రిల్ 2008 (UTC)
- మౌర్య లేదా మౌర్యుడు అనడంలో తప్పేమీ లేదు. చారిత్రక నామాల్లో అలా వాడితే తప్పేమీ ఉండకపోవచ్చు. ఆ పేర్లు ఎలా ప్రాచుర్యం చెందాయో అలా ఉండనిద్దాం. మౌర్య చంద్రగుప్త అని చరిత్రలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఉత్తర భారతదేశంలో ముందుపేరు , తరవాత ఇంటిపేరు వాడతారు. వారి ఇంటిపేర్లు సాధారణంగా కులాన్ని ప్రతిస్పందిస్తాయి. కానీ మన తెలుగు పేర్లలో ఒకే ఇంటిపేరు ఒకటికంటే ఎక్కువ కులాల్లో ఉంటుంది మరియు అది పేరుకు ముందు వాడబడతుంది. ఈ మధ్య చాలా మంది ఇంటిపేరు తర్వాత వ్రాసుకుంటున్నారనుకోండి. తెలుగు పేర్లను ఇంగ్లీషు పేర్లతో పోల్చితే అయోమయంగా ఉండవచ్చు.పేర్లు ఎలా పాపులర్ అయితే అలా ఉంచవచ్చు. ఇలా ఆలోచిస్తే ఎన్నో పేర్లలో సందిగ్దం రావచ్చు. ఉదాహరణకు రావు అని తెలుగులో వ్రాస్తాం, Rao (రావ్) అని ఆంగ్లంలో వ్రాస్తాం. ఏది సరైనది. δευ దేవా 10:14, 27 ఏప్రిల్ 2008 (UTC)
- "రావు" సరైనది. ఎందుకంటే అది తెలుగు కాబట్టి. అలాగే "మౌర్య" సరైనది. చర్చసాయీరచనలు 10:18, 27 ఏప్రిల్ 2008 (UTC)
- తెలుగు పుస్తకాలలొ,అన్ని రకాలైన పత్రికలలొ, సాహిత్యంలొ, చరిత్రలొ, రేడియోలలొ, టివిలలొ, ఎక్కడైనా చంద్రగుప్తుడనె విన్నాను. అది చారిత్రాత్మక తప్పిద0 అనుకున్నా, ఇలా తానుబట్టిన కుందెటికి ముడే కాళ్ళు అని వ్యవహరించడం తగదు.
- సరైన పదానికి, అందరూ ఆమోదించే పదానికి కారణం అక్కరలేదు. చెప్పినా లాభం లేదనుకుంటా.--117.198.194.235 11:02, 27 ఏప్రిల్ 2008 (UTC)
- పట్టిన కుందేలు కుంటిదై ఉండొచ్చు. --117.198.194.235 11:04, 27 ఏప్రిల్ 2008 (UTC)
- సరైన పదానికి, అందరూ ఆమోదించే పదానికి కారణం అక్కరలేదు. చెప్పినా లాభం లేదనుకుంటా.--117.198.194.235 11:02, 27 ఏప్రిల్ 2008 (UTC)
ఇక్కడ కుందేళ్ళ గురించి చర్చ జరగటంలేదు. చర్చసాయీరచనలు 01:55, 28 ఏప్రిల్ 2008 (UTC)
మౌర్యుడు = మౌర్యులలో ఒకడు. ఈ పేజీని "చంద్రగుప్త మౌర్య" అనే పేరుకు తరలించే ముందు, ఆ పేరునే ఎందుకువాడాలో రుజువులతో సహా నిరూపించాలని మనవి. నేను చూసిన కొన్ని తెలుగు పాట్య పుస్తకాలలో "మౌర్యుడు" అనే వాడుతున్నట్లుగా చూసాను. ఎక్కడా "చంద్రగుప్త మౌర్య" అనే పేరును చూడలేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:31, 28 ఏప్రిల్ 2008 (UTC)