చర్చ:చిత్రలేఖనం

తాజా వ్యాఖ్య: సలహాలు/సూచనలకు స్వాగతం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

సలహాలు/సూచనలకు స్వాగతం

మార్చు

ఫోటోగ్రఫీ వలె, ఈ చిత్రలేఖనం వ్యాసాన్ని కూడా విస్తరించే ప్రయత్నాలు మొదలు పెట్టాను. నా శైలి లో నే మొదట వీలైనంత ఆంగ్ల వ్యాసాన్ని మ్యానువల్ తర్జుమా చేస్తాను. ఒక్కొక్క శాఖ, ఉపశాఖను విస్తరిస్తాను. ఇతర భాషలలో చిత్రకళ వ్యాసం లో ఉపయోగకరం ఏదయినా ఉంటే దానిని కూడా చేరుస్తాను. పాశ్చాత్య చిత్రకళ లో కళా ఉద్యమాల పై మూస చేసి, వ్యాసం అంతంలో ఉంచాను. వీటిని మెల్లగా విస్తరించాలని. భారత దేశంలో వివిధ చిత్రలేఖన శైలుల గురించి క్లుప్తంగా ఆంగ్ల వ్యాసం లో ఉండనే ఉంది. కానీ తెలుగు వ్యాసం లో వాటి గురించి కొంత విపులంగా తెలియజేసి, ప్రధాన వ్యాసం లింకు లను పెడతాను.

ఇదంతా చూస్తుంటే, ఇదొక మహాయాగం లా తోస్తోంది. ఫోటోగ్రఫీ వ్యాసం కంటే ఎక్కువ శ్రమ గా అనిపిస్తోంది. అయినా సరే, పుష్ప సినిమా లో అల్లు అర్జున్ లా, తగ్గేదే ల్యా!

ఇవి కాకుండా ఇంకా ఏవయినా చేర్చవలసిన అవసరం ఉందా? చర్చించగలరు. సలహాలు/సూచనలకు ఇదే నా ఆహ్వానం!! - శశి (చర్చ) 17:00, 6 జూన్ 2021 (UTC)Reply

@Veera.sj మీ మానవీయ అనువాదంలో మూలల వివరాలు వుండుటలేదు. మీ ఫొటోగ్రఫీ వ్యాసంలో మూలాలు లేవు. వికీపీడియాకు మూలాలు ప్రాణం కావున, వ్యాసం ఎంత విస్తారంగా వుందని కాకుండా, ఉన్న కొద్దిదైనా మూలాలతో వుండటం మేలని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 13:21, 16 జూన్ 2021 (UTC)Reply
తప్పకుండా అర్జున గారు! వీలైనన్ని మూలాలు ఫోటోగ్రఫీ వ్యాసాలకు చేర్చాను. ఇంకా ఏమైనా చేర్చగలనేమో కూడా చూస్తాను. చిత్రలేఖనం వ్యాసం లో కూడా మూలాలు చేరుస్తాను.
ఇక పోతే, మూలాలు లేని భాగాలు తొలగించినా నాకేమీ సమస్య లేదు. మూలాలు దొరికినపుడు, వాటిని చేరుస్తూ మరల విస్తరిస్తాను. - శశి (చర్చ) 07:08, 17 జూన్ 2021 (UTC)Reply
Return to "చిత్రలేఖనం" page.