చర్చ:తాపీ ధర్మారావు
పేరులో నాయుడు ఉండాలా?
మార్చుతాపీ ధర్మారావు అనే రచయిత తెలుగు సాహిత్యరంగంలో తాపీ ధర్మారావు అన్న పేరుతోనే సుప్రసిద్ధుడు. పౌరుషనామమని సామాజిక శాస్త్రవేత్తలు పిలిచే నాయుడు ఆయన పేరులో భాగమే అయివుండొచ్చు కానీ దానికి తెలుగు సాహిత్యరంగంలో వ్యాప్తి చాలాతక్కువ. ఆయన గురించి రాసిన జీవిత చరిత్రకు కూడా పేరులోనూ తాపీ ధర్మారావు అనేవుంది తప్పితే ధర్మారావు నాయుడు అన్న మాట లేదు. అవసరమైతే నాయుడు అన్న పేరు కూడా ఉంచి ఓ దారిమార్పు ఉండొచ్చు తప్ప పేరులోనే నాయుడు అన్నది పెట్టి రాయడం సమంజసం కాదని నా అభిప్రాయం.
టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకే కులం, ఒకే కుల శాఖకు సంబంధించిన వారే. కానీ వారందరి పేర్ల వెనుకా పంతులు అన్నది లేదని గమనించగలరు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు పేరు వెనుక ఉన్న రెడ్డి అన్నది తొలగించుకున్నారు కూడా కదా.--పవన్ సంతోష్ (చర్చ) 16:17, 1 ఫిబ్రవరి 2015 (UTC)