చర్చ:పందలపాడు సైదులు
తాజా వ్యాఖ్య: దారిమార్పు రద్దు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
విస్తరణ
మార్చుసైదులు గారి గూర్చి విస్తరించండి. రెండు వాక్యాలు రాస్తే ఎలా అర్థమవుతుంది..2012-12-04T06:00:54 Rojarani
దారిమార్పు రద్దు
మార్చుUser:K.Venkataramana గారు, మీరు వ్యక్తి పేజీనుండి గ్రామపేజీకి చేసిన దారిమార్పు రద్దు చేశాను. విస్తరించని మొలకగా తొలగించాలంటే తొలగించవచ్చు. --అర్జున (చర్చ) 00:55, 13 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ పేజీని దారిమార్పుగా చెయ్యొద్దు, తొలగించండి అని ఎందుకు అన్నారో స్పష్టత లేదు. గ్రామ పేజీలోని వ్యక్తికి సంబంధించిన విభాగానికి దారిమార్పు చేసారు. అందులో తప్పేం లేదు. మొలకను విస్తరించడమనేది అత్యుత్తమం. వేరే పేజీలో విలీనం చేసి, దారిమార్పుగా చెయ్యడమనేది రెండో ఉత్తమ పద్ధతి. ఇవేవీ కుదరనపుడు తొలగించక తప్పదెలాగూ. సముచితమైన విలీనం చేసాక కూడా, దాన్ని తిరగ్గొట్టేసి, కావాలంటే తొలగించండి అనడం చిత్రంగా ఉంది. ఆటోవికీబ్రౌజరు అనుమతి అడిగినవాళ్లకు అనుభవం లేదు కాబట్టి అనుమతి ఇవ్వొద్దు, వాళ్లకు నిర్వాహకత్వం ఇచ్చెయ్యండి కావాలంటే అని సలహా ఇచ్చినట్టుంది ఈ అభిప్రాయం. వెంకటరమణ గారు తొలుత చేసిన పనే సరైనదని నా అభిప్రాయం. అయితే పేజీని ఈసరికే తొలగించేసారు కాబట్టి మళ్ళీ తిరగదోడాలని నేనిప్పుడు చెప్పడం లేదు. కాకపోతే ఒక సూచన: మరొక వాడుకరి చేసిన మార్పులను, వెనక్కి తొరగ్గొట్టేటపుడు కాస్త ఆలోచించి, ముందుగా చర్చించి తీసెయ్యడం పద్ధతి, తొలగించాక చర్చించడం కాదు. మరీ ముఖ్యంగా -
- ఆ మార్పు చేసినది అజ్ఞాత కాదు, నమోదైన వాడుకరి. మరీ ముఖ్యంగా అనుభవజ్ఞుడైన వాడుకరి అయినపుడు
- మనం చేసే తిరగవేత ఎందుకు చేస్తున్నామో మనకే సరిగ్గా తెలీనపుడు
- __చదువరి (చర్చ • రచనలు) 07:11, 14 సెప్టెంబరు 2020 (UTC)
- వందల సంఖ్యలో వ్యక్తుల వ్యాసాలను విస్తరిస్తున్నా ఈ వ్యాసం విస్తరణకు ఎటువంటి సమాచారం దొరకనందున ఈ వ్యాసాన్ని గ్రామానికి కాకుండా గ్రామంలోని ప్రముఖుల విభాగానికి దారిమార్పు చేసితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 07:19, 14 సెప్టెంబరు 2020 (UTC)