చర్చ:రాజమండ్రి పుష్కరాలు 2015

తాజా వ్యాఖ్య: విలీనము మూస పెట్టడం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD

గోదావరి పుష్కరాలు, 2015 అని వ్యాసము పేరు ఉండాలనుకుంటాను. JVRKPRASAD (చర్చ) 07:32, 28 జూన్ 2015 (UTC)Reply

JVRKPRASAD గారూ ఇప్పటికే 2015 గోదావరి పుష్కరాలు వ్యాసం ఉన్నది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 11:46, 28 జూన్ 2015 (UTC)Reply

ఫోను నంబర్లు, బస్సు రూటు నంబర్లు వికీపీడీయాకు తగినవి కావు మార్చు

ఈ వ్యాసంలోని ఫోను నంబర్లు, బస్సు రూటు నంబర్లు వికీపీడియా:ఏది_వికీపీడియా_కాదు#వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు అనే నియమాన్ని వుల్లంఘిస్తున్నాయి . పరిశీలించి సరిచేయండి. --అర్జున (చర్చ) 04:30, 29 జూన్ 2015 (UTC)Reply

అర్జున గారు, మీరు వ్రాసినది వివరముగా వ్రాయండి. ప్రభుత్వం వారి ఫోను నంబర్లు, బస్సు రూటు నంబర్లు, రైల్వే వారి రైలుబండ్లు నంబర్లు, ఏరోజు, ఏ సమయము, లాంటివి [1] వికీపీడియా నియమాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నాయి ? సరి చేయాలంటే ఏమి చేయాలో చర్చించండి. చర్చ ఒక కొలిక్కి వచ్చేవరకు నాతో చర్చించండి. ఈ రాజమండ్రి పుష్కరాలు 2015 అనే విషయము వ్యాసము కొరకా లేదా కరపత్రమా లేదా మరొక దాని వాడుతారో అది కూడా వెనువెంటనే తెలియజేయండి. వ్రాయవలసినది చాలా ఉంది, సమయము చాలా తక్కువగా ఉంది. గ్రహించగలరు. అసలు మీ మనసులో ఈ వ్యాసము గురించి ఎలా ఉండాలని అనుకుంటున్నారు. సరి అయిన సమయము కేటాయించండి. JVRKPRASAD (చర్చ) 07:38, 29 జూన్ 2015 (UTC)Reply
JVRKPRASAD గారికి, ప్రయాణ మార్గదర్శిని కాదు, టెలిఫోను డైరెక్టరీ కాదు,వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు అనే నియమాలను ఉల్లంఘిస్తున్నాయండి. మీరు ఇప్పటికే సంబంధిత సమాచారం తొలగించినందులకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:33, 30 జూన్ 2015 (UTC)Reply
అర్జున గారు, మరి అటువంటి విషయాలు ఎక్కడ పెట్టుకోవాలంటారు ? ఆ విధమైన వ్యాసభాగాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. మరి వాటిని కూడా తొలగించాలి కదా ! ఎకాఎకీన వాటిని తొలగించేయమంటారా ? JVRKPRASAD (చర్చ) 05:30, 30 జూన్ 2015 (UTC)Reply

JVRKPRASAD గారికి, వికీపీడియాకి సరిపడని విషయాల కొరకు బ్లాగులు, వికియా లాంటివి సరియైనవని రచ్చబండలో మీ వ్యాఖ్యకు నిన్ననే స్పందించాను. ఇక అభ్యంతరకరమైన మిగతా వ్యాసభాగాలేమిటో మీరు వివరంగా తెలియచేస్తే చర్చించవచ్చు. --అర్జున (చర్చ) 00:41, 1 జూలై 2015 (UTC)Reply

విలీనము మూస పెట్టడం మార్చు

అర్జున గారు, ఈ వ్యాసం విలీనం చేయాలని ఒక మూస పెట్టారు. కానీ తీసివేశాను. ఏ ప్రాతిపదికన మీకు అనిపించింది. సరికారణం చెప్పి మూస పెట్టండి. ఈ మధ్యన చాలా మంది ఎవరి బుర్రకి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. మీరు అనుభవం ఉన్నవారు కాబట్టి, కారణం వ్రాయండి. ఇంక ముందు ముందు అందరూ ఆచరించటానికి అవకాశము ఉంటుంది. JVRKPRASAD (చర్చ) 09:21, 29 జూన్ 2015 (UTC)Reply

JVRKPRASAD గారికి, తొలగింపు మూసలకి కారణం చూపాలి కాని విలీనం మూసలకి మూస పెట్టడంలోనే అర్ధం వుంది. మూసలో చేర్చిన వ్యాసంతో ప్రస్తుత వ్యాసం పోలి వున్నది కాబట్టి మూస పెట్టడం జరిగింది. దీనిని సమర్ధించే అభిప్రాయం User:Kvr.lohith గారు అప్పటికే చర్చాపేజీలో వ్రాశారు. ఒక వేళ మీరు మరియు ఇతరులకు దానిని వ్యతిరేకించ దలిస్తే సంబంధిత చర్చా పేజీలో అభిప్రాయాలు చేర్చవచ్చు. ఏకాభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యలు మూస తొలగించడమో, లేక విలీనం చేయడమో చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 04:29, 30 జూన్ 2015 (UTC)Reply
ఈ వ్యాసం మొదలెట్టింది నేను. ఇది గోదావరి పుష్కరాలకు సంభందించినదైనా రాజమండ్రిలో జరిగే కార్యక్రమాలు వేరు. గోదావ్రి పుష్కరాలు దాదాపు మూడు రాష్ట్రాలలో జరుగుతాయి. రాజమండ్రిలో పుష్కరాలు ప్రత్యేకం దీనికి చాలా సమాచారం. ఫొటోలు ఉన్నాయి. ఇవన్నీ 2015 గోదావరి పుష్కరాలు వ్యాసంలో కలపలేం. ముందే రాజమండ్రి పుష్కరాలు 2015 వ్యాస పేజీలో తెలిపినట్టుగా జరుగుతున్న విషయాలపై పూర్తిగా రాయలేం, పూర్తి కాకుండా ఫొటోలు కూడా పెట్టలెం. కాని జరిగే విషయాలను ఇవ్వవచ్చు. ఇవన్నీ వివిదపేపర్లలో వస్తున్న వివరాలు. డేట్తో సహా మూలాల్లో రాస్తాను సమయం కావాలి. కాదు తప్పక విలీనం చేయాలని అంటే అర్జున, User:Kvr.lohith, పవన్ సంతోష్ మీరంతా వెంటనే స్పందించండి - తొలగించే వ్యాసం వ్రాయడంలో కాలం వృదా చేయడం అనవసరం కనుక - ఇక ప్రసాద్ గారు వ్రాసేది తరువాత ఏడిట్ చేసుకోవచ్చు, నేను ఆయనను రాయనిచ్చి తరువాత అందులో వద్దనుకున్నవి ఎడిట్ చేస్తున్నాను, ఆయనకు ఇబ్బంది ఏం అనిపించలేదు. రాస్తున్నపుడే ఇది రాయాలి, ఇది రాయకూడదు అనేది చెప్పడం గురించి నేను పూర్తి వ్యతిరేకం. పూర్వం వ్రాయబడిన అనేక వ్యాసాలు ఇటీవల తొలగించాం. కనుక వ్రాస్తున్నపుడే ఏల తొందర. ఏంరాస్తున్నారో చూద్దాం, రాయనిద్దాం..--విశ్వనాధ్ (చర్చ) 06:41, 30 జూన్ 2015 (UTC)Reply
2015 గోదావరి పుష్కరాలు వ్యాసంలో ఈ వ్యాసానికి లింకు ఇస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:53, 30 జూన్ 2015 (UTC)Reply
విశ్వనాధ్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 08:28, 30 జూన్ 2015 (UTC)Reply
ప్రత్యేకంగా ఓ వ్యాసం ఉండడంలో నాకేమీ తప్పుగా కనిపించడంలేదు. విశిష్టత ఉందన్న విషయాన్ని చూపగలిగితే, ఎలానూ మూలాలు తగినన్ని ఉన్నాయి కనుక అదేమీ సమస్య కాదు కానీ రాజమండ్రి గోదావరి పుష్కరాలు 2015 అని పేరు ఔచిత్యంగా ఉంటుందనుకుంటాను.--పవన్ సంతోష్ (చర్చ) 09:13, 30 జూన్ 2015 (UTC)Reply
పవన్ సంతోష్ , మీరు ఏదో వ్రాయాలని విరమించుకున్నారు. వ్రాసి ఉంటే మీ మర్యాద మూలాల్ని ఈ సమాజంలో కదిలించుకోవాల్సి వచ్చేది. ఇది వరకు ఒకడు బెంగుళూరు నుండి ఏదో నేనుప్రాణాలు తీస్తారు అని కూస్తూ వాగాడు. నేను అన్నది, మనిషి ప్రాణాలు ఒకసారే పోతాయి, అవి ఎలా పోతాయో తెలియదు, దాని కోసం రోజూ భయపడుతూ చస్తూ బ్రతకను అని వ్రాసాను. అతనికి మరో రకంగా అర్థమయింది. మీ బుర్రలోని ప్రతిదానికి విమర్శలు చేద్దామనే ఆలోచన చెత్త కాస్త తగ్గించుకోండి. మీరు ఏదో పెద్ద మేధావులనుకోవద్దు. ఎవడి కోసమో భజన చేయనక్కర లేదు. పుస్కరాలు అనేవాటి గురించిన అవగాహన, అనుభవం ఎంత ఉంది మీకు ? అసలు వ్యాసం ఏ రూపానికి వస్తుందో తెలిసీ తెలియకుండా ఏదో వాగాము అనే ధోరణి తగ్గించుకోండి. ఏదయినా కాదు అంటే అవును అనేది చూపించాలి, చేయాలి. ఇది వ్యాసము, కరపత్రము, చేతి పుస్తకము, మరేదో అనేది ఎవరికి తెలుసు ? ఒక్కోసారి నియమాలను పక్కన పెట్టి మనిషికి మానవత్వంతో సహాయము చేయాలి. పుష్కరాలు అయ్యాక ఎలాగూ కావల్సినంత తొలగించుకోవచ్చు. పుష్కరాలు సమయములో మనిషికి కాగిత రూపంలో సమాచారం అందిస్తే తప్పు ఏమిటి ? నలుగురు కలసి ఒక సమాచారము ప్రోగుచేసినది, ఎవరో ఒకరు అచ్చుతీసుకుంటారు. తరువాత తొలగించుకుంటారు. ఆ మాత్రము సహాయపడకూడదా ? మీరు చేయరు, ఒకరిని చేయనివ్వరు. ఈ భజన బృందాలు ఉన్నంతకాలం వికీ బాగు పడదు. JVRKPRASAD (చర్చ) 10:09, 30 జూన్ 2015 (UTC)Reply
పవన్ సంతోష్ మీరు సూచించిన పేరు బావుంది. మిగతా వారి అభిప్రాయాలు స్ఫష్టం అయిన తదనంతరం వ్యాసం విలీనం అవసరం లేదనుకొంటే అపుడు మీరే మార్చండి..--విశ్వనాధ్ (చర్చ) 10:58, 30 జూన్ 2015 (UTC)Reply
ప్రసాద్ గారూ నేనే విరమించుకున్నదానిపై వ్యాఖ్యానించడం ఎందుకు? అప్పటికే వ్యాసం రిఫైన్ అయిపోయివుండడంతో నేను ఆ వ్యాఖ్యలు తొలగించేశాను. అయినా విశ్వనాథ్ గారు పనిగట్టుకుని అడిగారు కనుకనే నేను రాశాను. విమర్శలే చేసే ఉద్దేశం నాకేమీ లేనట్టు మీకు తెలియదా? ప్రాణాలు తీయడాలూ అవీ ఏవిటి? నేను పూర్తి సబ్జెక్టివ్ గా మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా మీతో నాకున్న సాన్నిహిత్యం, అనుబంధం మీకు నేను గుర్తుచేయాల్సిన అవసరం లేదు. పెద్దవారు.. మీరేదో అన్నా ఫర్వాలేదు కానీ నేను కూడా అలానే సమాధానమివ్వడం అనవసరం. మరోసారి చెప్పేదేంటంటే నేనెవరికీ భజన చేయను, నాకెవరూ భజన చేస్తున్న దాఖలాలూ లేవు. ఉంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:29, 30 జూన్ 2015 (UTC)Reply
విశ్వనాధ్ గారూ, విలీనం మూసను ఉంచారంటే రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవని అర్థం. దానికి వేరుగా కారణాలు వ్రాయక్కరలేదని నా అభిప్రాయం. ఎందుకు విలీనం చేయరాదో చర్చాపేజీలో సభ్యులు చర్చించవలసి ఉంటుంది. ఎటువంటి చర్చలు లేకుండా విలీనం మూసను ఏకపక్షంగా తొలగించరాదు. ఈ వ్యాసంనకు సంబంధించి రాజమండ్రి పుష్కరాలు అనే వ్యాసాన్ని పవన్ సంతోష్ సూచించినట్లు "రాజమండ్రి గోదావరి పుష్కరాలు 2015" అని పేరు మారిస్తే బాగుంటుంది. ఈ వ్యాసాన్ని విస్తరించాలి. విలీనం అవసరంలేదు. 2015 గోదావరి పుష్కరాలు వ్యాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గోదావరి పుష్కరాల గూర్చి వివరంగా రాయవలసి యున్నది. అందులో ఈ వ్యాసాన్ని ఒక విభాగంగా చేర్చి {{main|రాజమండ్రి పుష్కరాలు 2015}} అని మూసను ఆ విభాగంలో ఉంచి రాజమండ్రి పుష్కరాల గురించి సంగ్రహంగా తెలియజేయాలి. రాజమండ్రి పుష్కరాల గురించి కావలసినవారు ఆ లింకు చూసుకుంటారు.-- కె.వెంకటరమణ 14:20, 30 జూన్ 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారు, విలీనం మూసను వ్యాసములో చేర్చారంటే అది సహేతుకంగా, సమంజసంగా ఉండాలి. వాడుకరి మూసను చేర్చేబదులు సంబంధించిన వ్యాస చర్చాపేజీలోనే తన అభిప్రాయము వ్రాయవచ్చు. మూసను పెట్టడము ఏకపక్షమయినప్పుడు, తీయడము ఏకపక్షం ఎలా అవుతుంది. వికీలో ఎవరి అభిప్రాయం వారిది. అయినా (వరిష్ట) వికీపీడియనులు వ్రాస్తున్నవ్యాసభాగాలలో మూసలు పెట్టే బదులు చర్చాపేజీలో వ్రాస్తే మంచిది. వ్యాసాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు మొలక మూస, విలీనం మూస, ఇలా పెట్టి వెళ్ళిపోతే అది ఏమి మర్యాద ? ఎవరిదాకా వస్తే కాని తెలియదు. పాత వ్యాసాలలో మూసను పెట్టినా, దాని చర్చాపేజీలో వ్రాసినా పెద్దగా సమస్య రాదు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించడము నేర్చుకోవాలి మనము. JVRKPRASAD (చర్చ) 23:21, 30 జూన్ 2015 (UTC)Reply
సూచనకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ-- కె.వెంకటరమణ 00:26, 1 జూలై 2015 (UTC)Reply
విశ్వనాధ్ గారికి, మీ వ్యాఖ్య చదివితే విలీనము తొలగింపు ఒకటే అనిభావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవి రెండు వేరైనవి. విలీనం మూస ద్వారా బహుశా ఒకరికి తెలియకుండా ఇంకొకరు అదే అంశం పై వేరు వేరు వ్యాసాలు రాస్తున్న సభ్యులకి సమాచారం తెలిసి సమిష్టి కృషి మెరుగవడానికి వీలవుతుంది. అవి వేరు వేరుగా వుండాలని నిర్ధారించి అభివృద్ధి చేసినా సమన్వయం మెరుగై వికీ అభివృద్ధి సులభం అవుతుంది. --అర్జున (చర్చ) 00:49, 1 జూలై 2015 (UTC)Reply

JVRKPRASAD గారికి, మూసలు పెట్టడం ద్వారా వ్యాసంలో లోటుపాట్లు తెలిపి వ్యాస అభివృద్ధికి తోడ్పడడం నా దృష్టిలో అమర్యాద కాదండి, సద్విమర్శ మాత్రమే. వికీలో సభ్యులు చేసే వాటిని వారి స్వంతం అనుకుంటేనే అమర్యాదగా అనిపించే అవకాశం వుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు వికీలో వ్యాసాలు మాత్రమే రాయాలి చర్చాపేజీలలో దీర్ఘ వ్యాఖ్యలు చేయాలని ఏమీ లేదు. చిన్న ముద్రారాక్షసం దిద్దినా అది వికీ అభివృద్ధికి తోడ్పడడమే. ఒక్కోసారి మీ వ్యాఖ్యలు పరుష పదజాలంతో కూడి వుండడం. ఇతర సభ్యులను అకారణంగా నిందించే వ్యాఖ్యలతో కూడివుండడం నాకు భాధనిపిస్తున్నది. అపార అనుభవం గల మీరు దయచేసి చర్చలను సృహృద్భావ వాతావరణంలో కొనసాగించడానికి తోడ్పడవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 01:02, 1 జూలై 2015 (UTC)Reply

అర్జున గారు, వికీలో సభ్యులు చేసే వాటిని వారి స్వంతం అనుకునే అమాయకులు ఎవరూ లేరు. చేస్తున్న పనిలో మధ్యలో ఒక రాయి వేసినట్లుగా మూసను తగిలించటము మర్యాదంటారా ? మూస పెట్టేవారికి వ్రాసేవారు ఎవరో తెలియదంటారా ? మనసులోని మాటను తెలియజేసే పద్ధతి అదేనంటారా ? హంసపాదు పెట్టినా అది ఒక మార్పు కింద లెక్కకు తీసుకొనే వారికి మనము వేరే చెప్పనవసరము లేదండి. వ్యాఖ్యలు పరుష పదజాలంతో కూడి వుండడం అనేది అది వ్యక్తిగతంగా తీసుకుంటే అది వారి సమస్య. కేవలం పనిగురించి మాత్రమే అటువంటి పదాలు పడతాయి. JVRKPRASAD (చర్చ) 02:57, 1 జూలై 2015 (UTC)Reply
JVRKPRASAD గారికి, ఏది మర్యాద ఏది మర్యాద కాదు అనే దానిపై ఏకాభిప్రాయం కూర్చడం చాల కష్టం కాబట్టి, అలాగే ఇతరుల అభిప్రాయాలు మార్చడం చాలా కష్టమైన పని కాబట్టి, మనకు వీలైనంతలో మనం మారటం సులభం కాబట్టి, ఇతరుల వ్యాఖ్యానాలు, మార్పులు వద్దు అనుకున్న వారు వ్యాసాలను అభివృద్ధి దశలో వున్నప్పుడు వారి వాడుకరి ఉపపేజీలుగా ప్రారంభించి అభివృద్ధి చేయటం ఒక పరిష్కార మార్గం. ఆలోచించండి. ఇక మీ వ్యాఖ్యలలో పరుషపదజాలం వాడిన కొన్ని సార్లు వ్యక్తిగతంగా నింద అనిపించే మరియు బెదిరింపు అనిపించే వ్యాఖ్యలుకూడా వుంటున్నాయి. అటువంటివి మొత్తం వికీసభ్యులపై ప్రతికూల ప్రభావం కలిగించే అవకాశముంది. అటువంటి ఉద్దేశం మీకు లేదని నాకనిపించినా అటువంటివాటికి అవకాశం కలిగించకుండా వుంటేనే మంచిది. వాటి గురించి కాస్త శ్రద్ధ వహించండి. ఈ వ్యాఖ్యను మీ మీద మరియు మీ కృషి పై పూర్తి గౌరవంతో మరియు వికీఅభివృద్ధి దృష్టిలో వుంచుకొని చేసినదని స్పష్టంగా తెలియచేస్తున్నాను. ఒకవేళ మీకు బాధ కలిగిస్తే ముందస్తు క్షమాపణలు. --అర్జున (చర్చ) 03:49, 2 జూలై 2015 (UTC)Reply
అర్జున గారికి, ఇతరులను మార్చటం మనవల్లకాదంటున్నారు. ఎవరూ ఎవరికోసం మారవలసిన అవసరము లేదు. ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్న గొడ్డులాంటి బిడ్డకైనా ఒక దెబ్బ పడకుండా ఉంటుందంటారా ? మీరు పాతకాలంలో వంట విధానం లాగా ఒకే మూస పద్దతిలో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అసలు విషయము ఎప్పుడూ పక్కదారి పడుతుంది. నింద లేదా బెదిరింపు అయినా అది వారికి బుద్ధి సరిచేసుకుంటారనే దాని అర్థం. ఇలాంటి నిందలవల్ల మొత్తం వికీసభ్యులపై ప్రతికూల ప్రభావం కలిగించే అవకాశముంది అంటే అందరూ అలాంటివారు అని మీరు అనుకున్నా నేను అనుకోవడము లేదు. గుడి (లేదా విశ్వవిద్యాలయం) కి లోపల (ఎవరికీ మర్యాద ఇవ్వనవసరము లేదు), బయట, చుట్టుపక్కల, సమీపములో ఏవిధముగా ప్రవర్తించాలో అదేవిధానము వికీలో అనుసరిస్తాను. మన ప్రజాసేవ చేసే నాయకులు పిల్లలకు ఏ రకమయినా భాష నేర్పుతున్నారు. వెధవలు, చండాలపు పనులు చేసేవారు మాత్రమే భయపడినట్లు నటిస్తారేమో ? మంచి వారు అయినా చెడు ఆలోచనలకి అవకాశం కలిగిస్తే వారికి జాగ్రత్తగా ఉండమని, జాగ్రత్తలు చెప్పడము తప్పు ఏముందంటారు ? నేను ముందు నుంచి చెబుతునే ఉన్నాను. ఇంక ముందు ముందు చాలా దరిద్రపు తెలుగు భాష వాడేవారు వస్తారని. అప్పుడు మనము ఈ లోకంలోనే ఉండము. ఎక్కడయినా భయమున్నచోట బాధ్యత ఉంటుంది. స్వేచ్చ ఉండాలి కానీ అది దుర్వినియోగం కాకూడదు. మనసులోని మాటలు ఎదుటివారి మనసుని కించపరచేవిగా ఉంటేనే సమస్య. మీరు వ్యాసాలు, ఇతర పనులు చేయడము తగ్గించుకొని పూర్తిగా ఒడ్డున కూర్చొని ఉన్నారు. ఇది వరకు మీకు ఉత్సాహం ఉన్నప్పుడు మార్పులు చేయడానికి మీరు భయపడితే ప్రోత్సాహానిచ్చాను. మాకు ఇంకా చేతి దురద తగ్గక వ్రాస్తున్నాము. ఇప్పుడు మనుష్యులు (సభ్యులు) ఆనాటి రాజకీయ నాయకులు, పిడక పొయ్యితో వంటలు లేదా ఆఫీసులలో చేతివ్రాత వ్రాసుకునే పనులు కాలంలో లేరు. మీ ఇంటికి వచ్చిన వ్యక్తుల ద్వారా మీ వస్తువులకు, మనుష్యులకు, పిల్లలకు, .........ఉపద్రవం కలిగినప్పుడు చేతులెత్తి వచ్చిన వారికి దొంగతనము చేయరాదు, అబద్ధము ఆడరాదు, ఇలాంటి నీతి సూత్రాలు ఆ సమయములో వల్లెవేస్తారా ? ఇప్పుడు కాలపు మనిషి మనసులో అహం (ఇగో) బాగా పెరిగి పోయింది. ఎవడూ ఎవడికీ భయపడడు. ఎవడైతే నాకేంటి ? ఇదే ధోరణి. ఇల్లా అనేకమైన దుర్వ్యసన ఆలోచనలు ఉన్నవారు బాగా ఎక్కువయ్యారు. మంచి మరియు చెడు మనసులను వేరుచేయాలంటే ఎంతో శ్రమతో కూడిన విషయము. మంచి మనసున్న మనుష్యులను దగ్గర చేసుకోవాలి. మందలింపు అనేది ఆ ప్రయత్నములొనే భాగమనుకోండి. JVRKPRASAD (చర్చ) 04:37, 2 జూలై 2015 (UTC)Reply
Return to "రాజమండ్రి పుష్కరాలు 2015" page.