చర్చ:వరంగల్
తాజా వ్యాఖ్య: వరంగల్ నగరం కదా టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వరంగల్ నగరం కదా
మార్చు సహాయం అందించబడింది
వరంగల్ నగరం కదా పట్టణమని వ్యాసం పెట్టారేమిటి? బహుశా వరంగల్ పట్టణ జిల్లా వ్యాసం నుంచి విడదీసి చేశారో ఏమో. వరంగల్ నగరంగా దీని పేరు మార్చవచ్చా?--పవన్ సంతోష్ (చర్చ) 09:30, 27 డిసెంబరు 2018 (UTC)
- దేన్ని పట్టణం అంటారు, దేన్ని నగరం అంటారు అనే దానికి మన దగ్గర ఉన్న కొలమానం ఏమిటి? రవిచంద్ర (చర్చ) 10:02, 27 డిసెంబరు 2018 (UTC)
- నాకు తెలినంతవరకు నగరపాలక సంస్థ హోదా ఉన్నది నగరం అని,పురపాలక సంఘం,నగర పంచాయితీ హోదా కలిగి ఉన్న వాటిని పట్టణాలు అని అంటారు.--యర్రా రామారావు (చర్చ) 11:14, 27 డిసెంబరు 2018 (UTC)
- యర్రా రామారావు చెప్పినదే నా ఆలోచన కూడాను రవిచంద్ర గారూ. శివారు గ్రామాలు, తండాలు >> పంచాయితీ రెవెన్యూ గ్రామ హోదా ఉన్నవి గ్రామాలు >> మేజర్ పంచాయితీ హోదా ఉన్నవి పెద్ద గ్రామాలు >> నగర పంచాయితీ, పురపాలక సంఘ హోదా ఉన్నవి పట్టణాలు >> నగర పాలక సంస్థ కలిగినవి నగరాలు >> గ్రేటర్ హోదా కలిగినవి మహా నగరాలు --పవన్ సంతోష్ (చర్చ) 12:07, 28 డిసెంబరు 2018 (UTC)
- వరంగల్ అనగానే మనస్సులో మెదిలేది వరంగల్ జనావాసం గురించి కావున వ్యాసంలో పట్టణ, నగర పదాలు వుండకూడదు.పవన్ సంతోష్, యర్రా రామారావు, రవిచంద్ర గారలు, ఆసక్తి వున్న ఇతరులు స్పందించితే రెండు సంవత్సరాల క్రింద ప్రారంభమైన చర్చకు ఒక ముగింపుకు తేవచ్చు. --అర్జున (చర్చ) 00:02, 9 మార్చి 2021 (UTC)
- అర్జున గారూ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. బ్రాకెట్లులో ఇటువంటి వాటికి అవసరంలేదని నా అభిప్రాయం.వేటికి ఉండాలి అనేదానికి ఉదాహరణలు తులం (గ్రామం), జంగం (గ్రామం), ముసురు (గ్రామం), పనస (గ్రామం) ఇలాంటి సందర్బాలలో పట్టణాలు లేదా నగరాలు ఉన్నప్పుడు మాత్రమే క్వాలిపై చేయాల్సిన అవసరముందని నేను అభిప్రాయపడుతున్నాను.ఇంకొక విషయం వరంగల్ (పట్టణం) వ్యాసం చరిత్ర పరిశీలించగా , మధ్యలో ఏ వాడుకరి పట్టణం అని బ్రాకెట్లులో తగిలించలేదు.పేజీ సృష్టించినప్పుడే అలా సృష్టించబడింది.పేజీ సమాచారం చూడగా, ఆ పేజీ మీరే సృష్టించారు.మీకు ఈ ఆలోచన అప్పుడు స్పురించలేదనుకుంటాను. నేను పరిశీలించిన దానిని బట్టి చాలా పేజీలకు బ్రాకెట్టులలో (పట్టణం) అని చాలా వ్యాసాలకు దారిమార్పు చేసారు. వాస్తవంగా ఇవన్నీ గతంలో జరిగినవే కానీ ఈ మధ్యకాలంలో ఎవ్వరూ చేసినవికావు అని నేను భావిస్తున్నాను. గుంతకల్లు (పట్టణం) ఇలాంటివి ఇంకా కొన్ని ఉండవచ్చు. యర్రా రామారావు (చర్చ) 04:47, 12 మార్చి 2021 (UTC)
- వరంగల్ అనగానే మనస్సులో మెదిలేది వరంగల్ జనావాసం గురించి కావున వ్యాసంలో పట్టణ, నగర పదాలు వుండకూడదు.పవన్ సంతోష్, యర్రా రామారావు, రవిచంద్ర గారలు, ఆసక్తి వున్న ఇతరులు స్పందించితే రెండు సంవత్సరాల క్రింద ప్రారంభమైన చర్చకు ఒక ముగింపుకు తేవచ్చు. --అర్జున (చర్చ) 00:02, 9 మార్చి 2021 (UTC)
- యర్రా రామారావు చెప్పినదే నా ఆలోచన కూడాను రవిచంద్ర గారూ. శివారు గ్రామాలు, తండాలు >> పంచాయితీ రెవెన్యూ గ్రామ హోదా ఉన్నవి గ్రామాలు >> మేజర్ పంచాయితీ హోదా ఉన్నవి పెద్ద గ్రామాలు >> నగర పంచాయితీ, పురపాలక సంఘ హోదా ఉన్నవి పట్టణాలు >> నగర పాలక సంస్థ కలిగినవి నగరాలు >> గ్రేటర్ హోదా కలిగినవి మహా నగరాలు --పవన్ సంతోష్ (చర్చ) 12:07, 28 డిసెంబరు 2018 (UTC)
- నగరం, పట్టణం అనే హోదాల గురించి యర్రా రామారావు గారితో ఏకీభవిస్తాను.
- పేజీ పేరు వరంగల్ అనే ఉండాలి. ఓరుగల్లు, వరంగల్లు పేజీలు దీనికి దారిమార్పుగా ఉండాలి.
- నాకు తెలినంతవరకు నగరపాలక సంస్థ హోదా ఉన్నది నగరం అని,పురపాలక సంఘం,నగర పంచాయితీ హోదా కలిగి ఉన్న వాటిని పట్టణాలు అని అంటారు.--యర్రా రామారావు (చర్చ) 11:14, 27 డిసెంబరు 2018 (UTC)
- __చదువరి (చర్చ • రచనలు) 05:31, 12 మార్చి 2021 (UTC)
పేజీలో అభిప్రాయాలు వ్యక్తం చేసినవారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రకారం మార్పులు చేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:37, 12 మార్చి 2021 (UTC)