చర్చ:సిల్వియా లైకెన్స్ హత్య

తాజా వ్యాఖ్య: అభ్యంతరం లేదు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

విషయ ప్రాముఖ్యత

మార్చు

మీకు వీలైతే మీకు నచ్చిన విధముగా మార్చండి. ఎవరికి తోచిన వ్యాసం వారు అనువాదించవచ్చు. విషయ ప్రాముఖ్యత ఉందా లేదా మీరు తీర్పు ఎలా చేయగలరు ? దాని వల్ల మీకు కలిగిన అసంతృప్తి ఏమి ? వికీపీడియా లో నేను ఓ చేయి వేద్దామని అనువదించా! కొత్తగా వచ్చే వారిని ప్రోత్సహించండి కాని విసుగు పుట్టేలా చేయవద్ధు. - దేవుడు 2020-04-22T18:52:02(UTC)

పైన వ్యాఖ్య రాసింది ఈ ఎవరో తెలియదు. ఎందుకంటే సంతకం చేయలేదు కాబట్టి. ఎందుకు చేయలేదు? వికీ కనీస పరిజ్ఞానం లేదు, లేదా తెలిసున్నా కావాలనే సంతకం పెట్టలేదు. చర్చా పేజీలో సంతకం పెట్టాలన్నది కనీస పరిజ్ఞానం. ఒక కమ్యూనిటీలో పాల్గొనేటపుడు అందులో ఏయే నియమాలు అనుసరిస్తున్నారో తెలుసుకోవడం కనీన విధి. అలా కానిపక్షంలో ఎవరైనా తెలిసినవారు చెప్పినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో అర్థం అయినా చేసుకో గలగాలి.

ఎవరు ఏది రాసినా ఎంత ఎక్కువ మంది చదివితే అంత బాగుండాలనేది సాధారణంగా ఆకాంక్షిస్తారు. మీరు రాసిన సిల్వియా లైకెన్స్ హత్య అనే వ్యాసం అసలు ఎలా చదువుతారో చూద్దాం. తెలుగులో ఈ వ్యాసానికి రావడానికి కింద ఉన్న మార్గాలు కొన్ని.

  1. నేరుగా తెలుగు వికీపీడియాలోకి వచ్చి వెతుకు పెట్టెలో సిల్వియా లైకెన్స్ హత్య అని వెతకడం
  2. గూగుల్ లో తెలుగులో టైపింగ్ చేసి వెతకడం.
  3. తెలుగు వికీలోగానీ, వేరే వెబ్ సైటులోగానీ ఈ వ్యాసానికి లింకు ఉంటే, అక్కడ నొక్కి ఇక్కడికి రావడం (తెలుగు వికీలో ఇతర వ్యాసాల నుంచి ఇక్కడికి లింకు లేనే లేదు)

ఇవన్నీ ఎంతమేరకు సాధ్యమో, ఎంతమందికి ఆసక్తి ఉంటుందో మీరే ఆలోచించండి. ఎంతమంది తెలుగు వారికి దీనిమీద ఆసక్తి ఉంటదో మీరే చెప్పండి. ఈ వ్యాసం పూర్తయిన తర్వాత ఈ వ్యాసానికి ఎన్ని వీక్షణలు (వ్యూస్) వచ్చాయో కావాలంటే మేం లెక్కలు తీసి చెబుతాం. దాన్ని బట్టి విషయ ప్రాముఖ్యత అంటే ఏమిటో మీకే అర్థం అవుతుంది. ఇంగ్లీషులో విషయ ప్రాముఖ్యత ఉన్న వ్యాసానికి తెలుగులో ఉండాలని నియమమేమీ లేదు. ఎవరు చెప్పినా మీ మంచి కోసమే నని గుర్తు పెట్టుకోండి. కాస్త ఓపిగ్గా ఆలోచించండి. అందరూ ఇందులో స్వచ్ఛందంగా సహకారం ఇస్తున్నవారే అని మరువకండి. --రవిచంద్ర (చర్చ) 10:13, 25 ఏప్రిల్ 2020 (UTC)Reply

నియమాలు తెలుసుకో

మార్చు

దేవుడు వికీని నియమాలు తెలుసుకో ...విషయ ప్రాముఖ్యత గురుంచి మీకు ఏమి తెలుసు కె.వెంకటరమణ వికీపీడియా నిర్వాహకులు గారు. అతని గురించి వికీలో అల రాయకూడదు అంటున్నాను. ఎలా వ్రాసుకున్నారా అని చూడండి. మామూలుగా ఇతర వ్యక్తుల గురించి వ్యాసాలు రాసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఎక్కడైనా తప్పవుగా. కొత్తగా ఇవన్నీ తెలిసేంతవరకూ కాస్త ఓపిగ్గా ఉండండి. మీ మంచి కోసమే ...ప్రభాకర్ గౌడ్ నోముల 12:04, 25 ఏప్రిల్ 2020 (UTC)Reply

తొలగించేయండి

మార్చు

ఇక ఆలస్యమెందులకు, రెప్పపాటు ఆలస్యం చేయకుండా "తొలగింపు" కొట్టేయండి.

వాడుకరి:రవిచంద్ర గారూ, ధన్యవాదాలు. నేను కొత్తే ఒప్పుకుంటా. నాకు పద్ధతులు తెలియవు నేర్చుకుంటున్నాను, ఒప్పుకుంటా.

"కొత్తగా వచ్చే వారిని ప్రోత్సహించండి" అని పైన ముందే చెప్పినప్పుడు తెలియదు, పరిజ్ఞానం లేదు అని మీరు వివరించాల్సిన అవసరం లేదు. తెవికీ లో వ్యాసాలు రాసే వారు మాత్రమే తెలుగు భాషాభిమానులు కాదు. తెవికీ బయటా ఉంటారు.

తెలుగు వారే ఆంగ్లంలో వ్యాసం చదువుతుంటారు. అలా చదివేప్పుడు కొన్నిసార్లు తెలుగులో వ్యాసం ఉంటే బాగుండు అనుకుంటారు. తెలుగులో ఉంటే తెలుగులోనే చదువుతారు. ఎందుకంటే తెలుగు మాతృభాష కాబట్టి, చదవడం కంటికి బుర్రకు సులువుగా ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు ఉపయోగం కాదా ?. అందరూ తెవికీలో వెతికే చదవరు. వేరే భాషలో చదివేప్పుడు తెలుగులో ఉందేమో చూస్తారు. ఉంటే బాగుండు అని భావించే వారు ఉంటారు. అలా కూడా తెవికీకి సందర్శకులు ఉంటారు. సరే దీనికి వీక్షకులు లేరనుకుందాం, తెలుగు లో అత్యధిక వీక్షణాలు పొందిన వ్యాసాన్ని మాత్రం ఉంచి మిగతావి తొలగిస్తారా ?

ఒకరి ఆసక్తులు మీరు ఎలా నిర్ణయిస్తారు ?

తెలుగులో అనువాద చిత్రాలు ఎవరూ చూడటం లేదా ? అవి ఎందుకు చూస్తున్నారు ? నిర్మాతలు సినిమా అనువాదం చేస్తే ఎవరూ చూడరు అని ముందే నిర్ణయించుకుని ఉండవచ్చు కదా ? అంతెందుకు రోజు మీ కొనుక్కునే వార్తా పత్రికలోనే అన్నీ మీరు కోరుకున్న వార్తలే లేదా చదవాలనుకునే వార్తలే ఉంటాయా ?

మీరు నిర్దేశకులు కాబట్టి ఇప్పటి వరకు నేను చేసినవి కూడా ఓ జాబితా చేసి తొలగించేయండి. ఎవరికి ఇబ్బంది ఉండదు. నేను ఎవరిని అగౌరవ పరచలేదు, నా ఉద్దేశం అది కాదు. నా శ్రమను తక్కువ చేస్తే చెప్పా అంతే! తెవికీ కి ఇక సెలవు!ప్రభాకర్ గౌడ్ నోముల గారూ! - దేవుడు (చర్చ) 13:23, 12 మే 2020 (UTC)Reply

User:దేవుడు గారూ, ఇందులో తెలుగు సంఖ్యలని మార్చండి. కె.వెంకటరమణ (చర్చ) 08:52, 18 మే 2020 (UTC)Reply
User:దేవుడు వ్యాసాలు తొలగించడం మా ఉద్దేశ్యం కాదు. కొత్తవారికి నియమాలు తెలియబరచడమే మా ఉద్దేశ్యం. దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకుని బాధపడుతూ ఆవేశంగా సమాధానాలు రాస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. తెవికీలో వ్యాసాలు రాసేవారే భాషాభిమానులు అని ఇక్కడ ఎవ్వరూ చెప్పలేదు. ఇది మీరు పూర్తిగా కల్పించుకున్న ఊహ. అత్యధిక వీక్షణలు పొందిన వ్యాసాలు మాత్రమే ఇక్కడ ఉండాలని కూడా నేను అనలేదు. విషయ ప్రాముఖ్యత అంటే ఏమిటో వివరించే ప్రయత్నం చేశాను. అంతే. వ్యాసం ఖచ్చితంగా ఉండకూడదు అని నేను ఎక్కడా అనలేదు. విషయ ప్రాముఖ్యం ఉన్న వ్యాసాలు రాయడం ద్వారా మన సమయాన్ని ముఖ్యమైన విషయాల మీద గడపవచ్చు అని చెప్పే ప్రయత్నం నాది. ఎవరైనా అనుభవజ్ఞులు సలహాలు ఇస్తున్నపుడు చర్చలు సామరస్యపూర్వకంగా జరిగితే గౌరవప్రదంగా ఉంటుంది. నేను కొత్తవారికి సలహాలు ఎప్పటి నుంచో ఇస్తున్నాను. వికీకి నిజంగా సేవ చేయదలుచుకున్న వారు ఓపిగ్గా చెప్పింది అర్థం చేసుకుని సరిదిద్దుకున్నారు. అంతేకానీ మామీద విసుగు చెందలేదు. ఎవరి శ్రమనూ తక్కువ చేయాలనే ఉద్దేశ్యం మాకు లేదు. దాన్ని సరైనా మార్గంలో పెట్టడమే మా కర్తవ్యం. అర్థం చేసుకోండి.-రవిచంద్ర (చర్చ) 11:59, 18 మే 2020 (UTC)Reply

వెంకటరమణ గారూ, తెలుగు సంఖ్యా మానాన్ని కావాలనే వాడాను. కన్నడ, ఇతర భాషల వికీపీడియాల లోనూ నేను వారు వారి సంఖ్యమానాన్ని వాడటం గమనించాను.అందువల్ల తెలుగు సంఖ్యామానం వాడే కొద్ది మనం కూడా అలవాటు పడతాం అనే చిన్న ఆశ.

రవిచంద్ర , మీ ఉద్దేశాలు ఏదేమైనా నాకు మీ వాఖ్యలలో తట్టిన అర్థం ప్రకారం సమాధానం ఇచ్చాను. ఇందుకు నేను చింతించనవసరం లేదు. నేను ఇప్పటి వరకు ఆరు వ్యాసాలు నవీకరించాను. 19 ఏప్రిల్ 2020న ప్రారంభించి 14 అనువాదాలు(ఒక అనువాదం వెంకటరమణగారు విస్తరించారు)తో పాటు 4 కొత్తవి సృస్టిoచాను. ఈ ఒక నెలలో మొత్తం నా కృషి అన్నీ వ్యాసాలు కలిపి 24. నేను చేసిన తొలి అనువాదం ఇదే, తొలి అనువాదమే చాలా పెద్ద వ్యాసం, అయిననూ అనువదించే ప్రయత్నం చేశాను. ఈ విషయం మీద మీకన్నా ముందుగానే వెంకటరమణ గారితో చర్చ జరిగినది. ఒక్కోసారి ఒక్కో చోట వివరించడం నాకు శ్రమతో కూడుకున్న పని. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సిల్వియా లైకెన్స్ హత్య వద్ద చర్చ చూడవచ్చును. వ్యాసాల్ని మెరుగుపరచడం, ఆధారసహితంగా సవరించడం నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకేసారి తొలగింపు జాబితాలో పెట్టడం అన్నది అత్యుత్సాహమేమో అనిపించింది. దేవుడు (చర్చ) 18:35, 19 మే 2020 (UTC)Reply

ఈ వ్యాసంలో సమస్యలు

మార్చు

ఈ వ్యాసం అనువాద ఉపకరణాలను ఉపయోగించి రాసినట్లు భావిస్తూ ఇందులో గమనించిన కొన్ని అనువాద సమస్యలు మచ్చుక్కి కొన్ని ప్రస్తావిస్తున్నాను. అడుగడుగునా ఇలాంటి వాక్యాలు బోలెడు.

  1. 16 ఏళ్ళ వయసున్న లైకెన్స్ బందీగా ఉండి, పిల్లల దుర్వినియోగం హింసకు గురైంది - ఈ అనువాదం చాలా కృతకంగా ఉంది. 16 ఏళ్ళ వయసున్న లైకెన్స్ హింసకు గురైంది అంటే సరిపోతుంది.
  2. దాదాపు మూడు నెలల వ్యవధిలో ఆమె సంరక్షకురాలు గెర్ట్రూడ్ బనిస్జ్వెస్కీ, బనిస్జ్వెస్కీ పిల్లలు అనేక ఇతర పొరుగు పిల్లలు వారి అకృత్యాలు పెరుగుతూ వచ్చిన తరువాత ఘోర శారీరక, మానసిక హింస వలన అక్టోబర్,౨౬ న ఎంతో వేదన అనుభవించి చనిపోయారు. - ఈ వాక్యం పూర్తిగా ఎవరికైనా అర్థం అయ్యుంటే నాకు చెప్పండి.
  3. ఈ యధార్థ ఘటన ఆధారంగా అమెరికాలో చాలా కథానికలు, "ది గర్ల్ నెక్స్ట్ డోర్'(౨౦౦౭)" అనే చిత్రాన్ని తీశారు. - కథానికలు తీయడం ఏంటి? ఈ సంఘటన ఆధారంగా అమెరికాలో చాలా కథానికలు, "ది గర్ల్ నెక్స్ట్ డోర్'(2002)" అనే సినిమా కూడా వచ్చింది అని ఉండాలి.
  4. చిన్నప్పుడు ఆటలాడే సమయంలో తన సోదరులలో ఒకరితో తగులుకోవడం వల్ల ముందు పంటిని కోల్పోవడం వల్ల లికెన్స్ ఎప్పుడూ నోరు మూసుకునే నవ్వేది. - తగులుకోవడం వల్ల ఏమిటి?
  5. అనేక సందర్భాల్లో, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు స్థానిక స్కేటింగ్ రింక్‌ను వెళ్తూ ఉండేవారు - రింక్ ను వెళ్తూ ఉండేవారు అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు.
  6. కొంతకాలం తర్వాత, లెస్టెర్ లైకెన్స్ తన కుమార్తెలను గెర్ట్రూడ్ బనిస్జ్వెస్ ఇంటికి అర్సెనల్ సాంకేతిక హై స్కూల్ లో చదివే పౌలా, స్టెఫానీ లతో అక్కాచెల్లెళ్లతో ఏర్పడిన పరిచయాలతో ఏర్పాట్లు చేసి పంపించాడు. - వాక్య నిర్మాణం గజిబిజిగా ఉంది.
  7. తనకో మగ స్నేహితుడు కాలిఫోర్నియాలో నివసిస్తుండగా సముద్ర తీరంలో కలిశాడాని చెప్పడంతో - మగ స్నేహితుడు ఏంటి. గుడ్డి అనువాదంతో వచ్చిన సమస్య ఇది. తెలుగులో స్నేహితుడు అంటేనే మగవాడు.

అంతేకాక అక్షర దోషాలకు కొదవే లేదు. అనువాద వ్యాసాల నాణ్యత గురించి బోలెడంత చర్చించుకున్నాం మనం. అనువాద ఉపకరణం చేతిలో ఉంది కదా అని ఇచ్చిన అవుట్ పుట్ ని కనీసం చదివి అర్థం చేసుకోకుండా అలాగే డంప్ చేసిన వ్యాసం ఉంది. ఈ స్థితిలో వికీలో ఉండతగని వ్యాసం. ఇదీ నా అభిప్రాయం. -రవిచంద్ర (చర్చ) 13:29, 18 మే 2020 (UTC) ______________________________________________________________________________________________________________________________Reply

రవిచంద్ర గారు, నా వెర్షన్ వినండి.

  1. child abuse దీనికి నాకు సరైన పదం దొరకలేదు. మీకు నచ్చిన చోట మీకు తెలిసింది ఆధార సహితంగా మార్చండి. వికీపీడియా సిద్దాంతం అదే.
  2. మీకు తెలుగు అర్థం అవుతుందనే భావిస్తాను. దాదాపు మూడు నెలల వ్యవధిలో ఆమె సంరక్షకురాలు గెర్ట్రూడ్ బనిస్జ్వెస్కీ, బనిస్జ్వెస్కీ పిల్లలు అనేక ఇతర పొరుగు పిల్లలు వారి అకృత్యాలు పెరుగుతూ వచ్చిన తరువాత ఘోర శారీరక, మానసిక హింస వలన అక్టోబర్,౨౬ న ఎంతో వేదన అనుభవించి చనిపోయారు దీంట్లో చాలా మరియు లు చేర్చాల్సి ఉంది. దాదాపు మూడు నెలల వ్యవధిలో ఆమె సంరక్షకురాలు గెర్ట్రూడ్ బనిస్జ్వెస్కీ, బనిస్జ్వెస్కీ పిల్లలు మరియు అనేక ఇతర పొరుగు పిల్లలు మరియు వారి అకృత్యాలు పెరుగుతూ వచ్చిన తరువాత ఘోర శారీరక, మానసిక హింస వలన అక్టోబర్,౨౬ న ఎంతో వేదన అనుభవించి చనిపోయారు ఇలా ఉండాలి మీరనే గుడ్డి అనువాదం ప్రకారం.
  3. సరే, మీకు కనిపించింది గా మార్చండి. నేను ఒక్కో వాక్యం ఒక్కోసారి అనువదించాను. అంత పెద్ద వ్యాసం అనువదించేటప్పుడు ఇలాంటివి సహజమే. నాకు తెలియచేసినా ఇబ్బంది లేదు. మార్చడానికి నాకు అభ్యంతరం లేదు.
  4. ఆటలాడెప్పుడు చిన్న పిల్లలు ఒకరినొకరు చూసుకోకుండా డ్యాశ్ ఇచ్చుకోవడం వల్ల అని అర్థం.
  5. మీరు సరైన వాఖ్య నిర్మాణం సూచించండి. సరి దిద్దుకోవడానికి నాకు ఇంతకు ముందు ఇప్పుడు కూడా అభ్యంతరం లేదు.
  6. మీరు సరైన వాఖ్య నిర్మాణం సూచించండి. సరి దిద్దుకోవడానికి నాకు ఇంతకు ముందు ఇప్పుడు కూడా అభ్యంతరం లేదు.
  7. బాయ్ ఫ్రెండ్ కి తెలుగు అర్థం మీరు సెలవిచ్చారు కాబట్టి, సరిదిద్దుకుని నేను భవిష్యత్తులో వాడుతాను. ఇది మీరనుకునే గుడ్డి అనువాదం కాదు. ఇది పెద్ద వ్యాసం కావున సమయం సరిపోక పొరపాటున చేసినది. ఇది సరి దిద్దుతాను.

ఒక్కసారి ఆంగ్ల వ్యాసాన్ని యంత్రను వాదం చేసి నా అనువాదంతో పోలిక చేయండి. అప్పుడు మీకు ఎంత మాన్యూవల్గా అనువాదం చేశాను అనేది అర్థం అవుతుంది. ఊరక తెలియక అసంబద్ద ప్రకటనలు చేయకండి. మీ ప్రకటన పూర్తి హాస్యాస్పదం. దేవుడు (చర్చ) 18:16, 19 మే 2020 (UTC)Reply

"స్నేహితుడు అంటేనే మగవాడు" సూచించినందుకు ధన్యవాదాలు. కేవలం 3 చోట్ల ఉన్నది, ఇది సవరించబడినది. కానీ గుడ్డి అనువాదం అని ఒకరు చేసిన పనికి అసంబద్ద నామకరణాలు చేయకండి. తప్పులు ఎవరైనా చేస్తారు, ఇది నా మొదటి వికీ అనువాదం. నా ఛాలెంజ్ మీకు ఇంగ్షీషు లో ఉన్న దాన్ని అదే మొత్తంగా అనువదించి నా అనువాదానికి యంత్ర అనువాదానికి, యంత్ర అనువాద వాఖ్య నిర్మాణానికి, నా వాఖ్య నిర్మాణానికి ఎంత తేడా ఉందో చెప్పండి, తర్వాత అనండి! దేవుడు (చర్చ) 19:03, 19 మే 2020 (UTC)Reply

నాణ్యత లేని వ్యాసాలు రాయాలని నేనైతే కోరుకొను, సూచించిన మంచి సవరణలకు నాకెప్పుడూ అభ్యంతరం లేదు. ఇంత చెప్పినప్పటికీ మీకు తొలగించాలనేదే మీ అభీస్టం అయితే నాకు అభ్యంతరం లేదు. నేనే చెబుతున్నాను తొలగించేయండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, కొత్తవారు ఇటువంటి మర్యాదలతో వికీలో ఉండరు, ఒకవేళ దారితప్పి వచ్చిన తిరిగి వెళ్లిపోతారు. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రోత్సాహం, మద్దతు కంటే, నిందారోపనలే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అందరూ వెళ్లిపోతే 10 మందే ఉన్నాము అని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు. దేవుడు (చర్చ) 19:55, 19 మే 2020 (UTC)Reply

నేను ఈ పుటల్ని పిడిఎఫ్ రూపంలో దింపుకున్నాను. కావున మీరు నిరభ్యంతరంగా తొలగించుకోవచ్చు. ఎవరైనా నా తెవికీ అనువాదాల వల్ల తీవ్ర అసంతృప్తికి లోనైతే క్షమించగలరు. మీ దేవుడు (చర్చ) 20:04, 19 మే 2020 (UTC)Reply

ఈ వ్యాసం అర్థవంతంగా రాయడానికి నాకు సమయం, ఆసక్తి రెండూ లేవు. కారణాలు నేను ముందుగానే ఉదహరించి ఉన్నాను. ఇంతకు ముందు తెవికీలో మీలాంటి వారే ఇంకొకరితో వాదించి ఉన్నాను. చర్చా పేజీల్లో రాయడానికి ఉపయోగించిన సమయం వ్యాసం మీద దృష్టిపెడితే ఈ వ్యాసం ఎప్పుడో బాగుపడేది. నాకు సమయం ఆదా అయ్యేది. సెలవు. మీరో వాదించను. -రవిచంద్ర (చర్చ) 05:47, 20 మే 2020 (UTC)Reply
మీకు తెలుగు ఏ మాత్రం అర్థమవుతుందో నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు బాగానే చేశాను. నాకు సూచించిన సవరణలు మార్పులు చేయడానికి అభ్యంతరం లేదని పైన తెలిపాను. మీకు ఈ వ్యాసం పై ఏ మాత్రం ఆసక్తి లేదని తెలుసు. కానీ తొలగింపు సమర్ధనకు ఆసక్తి మెండుగా ఉన్నది అని బాగా గమనించాను. దేవుడు (చర్చ) 09:42, 20 మే 2020 (UTC)Reply

పై చర్చంతా చదివిన తరువాత నేను గమనించినవివి:

  1. రవిచంద్ర గారు వ్యాసంలోని భాషాదోషాలను ఎత్తి చూపారు. ఆయన చెప్పిన దోషాలను సవరించాలి.
  2. ప్రస్తుత రూపంలో ఈ వ్యాసం వికీలో ఉండదగినది కాదు అని ఆయన అన్నారు. అసలు ఉండే వీల్లేదని అనలేదు.
  3. ఆయన చెప్పిన భాషా దోషాలను దేవుడు గారు కూడా కాదనలేదు. సవరిస్తాననే అంటున్నారు.
  4. "నాణ్యత లేని వ్యాసాలు రాయాలని నేనైతే కోరుకొను, సూచించిన మంచి సవరణలకు నాకెప్పుడూ అభ్యంతరం లేదు." బాగుంది. వికీకీ కావలసింది ఇదే. ఇలాంటి సదుద్దేశమేగా వికీకి కావాల్సింది.
  5. "ఇంత చెప్పినప్పటికీ మీకు తొలగించాలనేదే మీ అభీస్టం అయితే నాకు అభ్యంతరం లేదు." అని దేవుడు గారు అన్నారు. రవిచంద్ర గారికి ఆ ఉద్దేశం ఉండదని నేను భావిస్తాను. వ్యాసాన్ని మెరుగు పరిచాక కూడా తొలగించాలని ఆయన ఎందుకంటారు.. అనరు. చర్చ కోసం పెట్టిన "సమయం వ్యాసం మీద దృష్టిపెడితే ఈ వ్యాసం ఎప్పుడో బాగుపడేది" అని కూడా ఆయన అన్నారు కదా. అంచేత..

దేవుడు గారు రవిచంద్ర గారు -మీ ఇద్దరి ఉద్దేశాలూ భాషాదోషాలను సవరించాలనే. కాబట్టి వెంకటరమణ గారూ.. ఈ వ్యాసపు తొలగింపు ప్రతిపాదనను పక్కనపెట్టి ఆ సవరణలు చేపట్టాలని నా ఉద్దేశం- మీ ముగ్గురూ దీన్ని పరిశీలించండి. దేవుడు గారూ, మీరు ఆ సవరణల పని మొదలుపెట్టమని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 09:54, 20 మే 2020 (UTC)Reply

ముందుగా ఈ వ్యాసంలో తెలుగు అంకెలను, మామూలు అంకెలుగా మార్చాలి. అక్షర దోషాలు తొలగించాలి (90% వరకు), పైనా పేర్కొన్న అనువాద సమస్యలు, వాటిలాగే వ్యాసమంతా ఉన్నాయి వాటిని మార్చాలి. నేను అలాగే రాస్తాను నాకు అర్థం అయితే చాలు, మీకు తెలుగు తెలియదు అంటే కుదరదు. మీరు ఈ వ్యాసంలో రాసిన చెత్త వాక్యాలు తప్ప ఇంక ఏ తెలుగైనా నాకు బాగానే అర్థం అవుతుంది. ఇది ఏదో నిర్దేశిత సమయం లోపల జరగాలి. దేవుడు, మీరు ఎంత సమయం లోపల ఇవి పూర్తి చేయగలరో చెప్పండి. అప్పుడు వచ్చి పరిశీలిస్తాను. ఆ లోపున జరగకపోతే వ్యాసాన్ని ఏం చేయాలనే విషయంపై చర్చించవచ్చు. -రవిచంద్ర (చర్చ) 10:20, 20 మే 2020 (UTC)Reply
రవిచంద్ర నాకు తెలిసిన వికీపీడియా మూల సిద్దాంతాల ప్రకారం వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు. ఎవరైనా సవరణలు చేయవచ్చు. చర్చలు, మూలాల ద్వారా సమర్ధన చేసుకోవచ్చు, నిర్వాహకులకు తెలియచేయవచ్చు. మీరూ చేయండి, పాలు పంచుకోండి. నేను మాత్రమే ఎందుకు చేయాలి. నన్ను మీరు ఎలా శాసిస్తారు? ఈ వ్యాసంలోని విషయం నా సొంత వ్యాపారమా లేక నా గురించి స్వీయ చరిత్ర రాసుకున్నానా లేక నా సొంత రాజకీయ, ప్రాంతీయ, ఉన్మాద ఉద్దేశాలు ఉన్నాయా ?. అందుకే సహేతుకమైతే తొలగించమని చెప్పా. నేను చేసిన కృషిని వివరించా అంతే. మంచి ఉద్దేశలతో చెప్పినవి మరో ప్రశ్న లేకుండా స్వీకరించా. మీరు ఆధార సహితంగా మారిస్తేనో, సవరిస్తేనో నేను కాదన్నానా ?. తప్పులు పట్టి ఇంత వాదనలు చేసేందుకు, నిందించేoదుకు ఉన్న సమయం మెరుగు పరిచేందుకు ఉండదా ? సరే సూచనలు చేయండి, కాదన్నానా ? నేను తెలుగులోనే కాదు ఆంగ్ల వ్యాసాలు కూడా విస్తరించా, ఎవరో ఇంగ్లండ్ వాసులు, నాతో వాదించక సవరణలు చేశారు అనవసర ఖాళీలు తొలగించడం, పునరావృతం అయిన పదాలు తొలగించడం వంటివి . అవి నాక్కూడా ఆమోదమే. నాకు ఆ సవరణలు అభ్యంతరమైతే నేను టాక్ లో రాస్తా. ప్రతి లాగ్ వికీలో భద్ర పరచబడుతుంది. నేను మీకు ఎటువంటి హామీ ఇవ్వను. నాకు అవసరం లేదు. తొలగించాలనుకుంటే తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యాసం నిజంగా తెవికీ నిబందనలకు విరుద్దంగా ఉంటే తొలగించుకోండి. దేవుడు (చర్చ) 10:59, 20 మే 2020 (UTC)Reply
దేవుడు ఈ వ్యాసం మీరు ప్రారంభించింది కాబట్టి ప్రధానంగా మిమ్మల్ని అడిగాను. మీరేమో మార్పులు చేయనంటున్నారు. ఇంకెవరైనా నేను ఎత్తి చూపిన దోషాలు సరిచేసిందుకు ముందుకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. లేకపోతే అందరూ ఏమి సూచిస్తే అదే జరుగుతుంది. నాకు ఆసక్తి లేదు కాబట్టి ఈ వ్యాసం మీద నేను చేయనని చెప్పాను. ఎవరికి ఇష్టం వచ్చినట్లు చెత్త రాసిపడేస్తే మిగతా వాళ్ళు సవరించరు. వాళ్ళకి వ్యాసం విలువ తెలిసి, అది ఉండదగినది అనిపిస్తే సవరించడానికి ముందుకు వస్తారు. ఇది మీ ఒక్క విషయంలో జరుగుతున్నది కాదు. అర్థం కాకుండా ఎవరు వ్రాసినా వారికి ముందుగా దాన్ని తెలియబరిచి దాన్ని మెరుగుపరిచేందుకు అవకాశం ఇచ్చి, తర్వాత దాని మీద చర్య తీసుకుంటాం. దాన్ని శాసించడం అనరు. -రవిచంద్ర (చర్చ) 11:12, 20 మే 2020 (UTC)Reply
రవిచంద్ర మీరు ఈ వ్యాసంలో రాసిన చెత్త వాక్యాలు తప్ప ఇంక ఏ తెలుగైనా నాకు బాగానే అర్థం అవుతుంది. ఇది ఏదో నిర్దేశిత సమయం లోపల జరగాలి. దేవుడు, మీరు ఎంత సమయం లోపల ఇవి పూర్తి చేయగలరో చెప్పండి. అప్పుడు వచ్చి పరిశీలిస్తాను. ఆ లోపున జరగకపోతే వ్యాసాన్ని ఏం చేయాలనే విషయంపై చర్చించవచ్చు. దీనిని ఏమంటారు ?. మీరు చేసిన పనులు, మీ వాదనలు కూడా నేను పరమ చెత్త అనగలను. మీ దురుద్దేశాలు అందరికీ ఆపాదించకండి. మీ ఇంకో దురుద్దేశ ఆపాదన చెప్పనా "ఈ వ్యాసం మీరు ప్రారంభించింది కాబట్టి ప్రధానంగా మిమ్మల్ని అడిగాను. మీరేమో మార్పులు చేయనంటున్నారు.". ఇది కూడా. నేను మార్పులు చేయనని మీకెక్కడా చెప్పలేదు. మీకు వ్యక్తిగత పనులు ఉన్నట్టే అందరికీ ఉంటాయి, మీకు ఆసక్తి వీలు కుదిరినప్పుడు చేస్తారు!. అలా అన్నమాట ! - దేవుడు (చర్చ) 11:22, 20 మే 2020 (UTC)Reply
ముందుగా నన్ను ఎగతాళి చేసింది మీరు. మీకు తెలుగు ఏ మాత్రం అర్థమవుతుందో నాకు తెలియదు అని. కాబట్టి సమాధానం కూడా అలానే ఉంటుంది. ఎవరు వ్యర్థవాదనలు చేస్తున్నారో ఇక్కడ అందరికి తెలుసు. మీరు పరమ చెత్త అని అన్నంత మాత్రాను నేనేదో ఫీల్ అయిపోతాను అనుకోకండి. ఇలా రెచ్చగొట్టే వాళ్ళను చాలా మందిని చూశాను. ఇక ఇక్కడికి ఆపుతాను. -రవిచంద్ర (చర్చ) 11:39, 20 మే 2020 (UTC)Reply
దానికి ముందు మీరేమన్నారో తెలియదా ? దానిని బట్టే ఆ సమాధానం కూడా. మీరు ఫీల్ అయితే నాకేంటి, కాకపోతే నాకేంటి ? కనీస వికీపీడియా విలువలు కూడా తెలియవు. మీలాంటి పెత్తనాలు మాత్రమే చేయాలనుకునే వాళ్లనుకూడా నా జీవితం లో చాలా మందిని చూశాను.చదువరి గారు మీరు ఓ నిర్ణయానికి వచ్చేసి, మీరనుకుంటే నా తెవికీ ఖాతాను తొలగించేయండి. అభ్యంతరం లేదు. కనీస పరిణతి లేని కేవలం పెత్తనం మాత్రం చేయాలనుకునే ఈయనతో సంభాషణ నాకు అనవసరం. ఏవేవో ఊహించి రాస్తారు. దేవుడు (చర్చ) 11:50, 20 మే 2020 (UTC)Reply

తొలగింపు ఎప్పుడు

మార్చు

పైన జరిగిన చర్చల ఆధారంగా ఈ వ్యాసాన్ని సృష్టించిన గౌరవనీయులైన సభ్యులు ఇప్పట్లో సవరించే బాధ్యతలు తీసుకునేటట్లు కనిపించడం లేదు. వెంకటరమణ గారూ, తొలగింపు ప్రతిపాదన మీరే మొదలు పెట్టారు కాబట్టి ఎప్పుడు తొలగించాలో మీరే నిర్ణయం తీసుకోండి. నా దృష్టిలో ఈ వ్యాసం ప్రస్తుత స్థితిలో ఉండదగినది కాదు. తిరగరాయడానికి ఎవరూ ముందుకురాకపోతే వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఇలాంటి భాషవల్లే ఎన్నో గూగుల్ అనువాద వ్యాసాలను మనం ఇదివరకే తొలగించాము - రవిచంద్ర (చర్చ) 11:45, 20 మే 2020 (UTC)Reply

ఇది గూగుల్ అనువాద వ్యాసం కాదు, యంత్ర అనువాదలకి, నా అనువాదానికి చాలా తేడా ఉంది ఇది నిర్వాహకుడుగా ఉన్న ఓ పాఠకుడి దురుద్దేశ ఆపాదన మాత్రమే దేవుడు (చర్చ) 12:08, 20 మే 2020 (UTC)Reply

అభ్యంతరం లేదు

మార్చు

వెంకటరమణ గారు, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీరు నా వ్యాసాలు కొన్నింటికి ధన్యవాదాలు కూడా తెలిపారు. చాలా వ్యాసాలు కూడా మీరు చెప్పిన విధంగా సవరణలు చేశాను. అది మీకు తెలుసు. ఇదంతా ఓ రోజులో నో నిర్ధిస్తా గడువు లోనో జరగలేదు. కనీస మర్యాద లేని మనుషులు ఉండే ఇక్కడ నాకు మాత్రం ఎందుకు. నేనెవర్ని ఓ మామూలు వాడుకరిని. దేవుడు (చర్చ) 11:56, 20 మే 2020 (UTC)Reply

దేవుడు గారూ, వికీలో నాకు తెలిసి అతి పెద్ద చర్చ చర్చ:బోయ. తరువాత ఈ చర్చ సుదీర్ఘంగా జరిగింది. ఇంత వాదనలు చేసే బదులు వ్యాస విస్తరణపై దృష్టి పెడితే ఈ వ్యాసం ఎప్పుడో నాణ్యమైన వ్యాసమయ్యేది. ఈ వ్యాసం అంత సుదీర్ఘంగా ఉండాలనే నియమమేమీ లేదు కదా. అలాగని మొలక స్థాయిలో ఉండకూడదు. అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టమైన భాషలో విస్తరిస్తే సరిపోతుంది కదా. ఆంగ్లంలో ఎంత వ్యాసం ఉందో అంతా అనువాదం చేయాలనే నియమం లేదు కదా. ఈ వ్యాసం చదువరులకు అర్థమవడం లేదు. ఈ వ్యాసాన్ని ఎవరూ విస్తరించడానికి ముందుకు రారు. కనుక మీకు వీలున్నప్పుడే అర్థమయ్యే రీతిలో మెరుగు పరచగలరు. నాకు ఇటు వంటి వ్యాసాల విస్తరణపై ఆసక్తి లేదు. లేకపోతే నేనే విస్తరించేవాడిని. మీరు సమయం లేదని తెలిపారని అమరరాజ గ్రూప్ వ్యాసాన్ని విస్తరించాను కదా. కనుక కొంత కాలం పాటు దీనిని తొలగించను. మీరు వీలున్నప్పుడు మెరుగు పరచండి. లేకపోతే కొంత కాలం తరువాత తొలగించబడుతుంది. మీరు వికీ నియమాలను తెలిసినవారు. మరికొన్ని వ్యాసాలను సృష్టించారు కదా. అలాగే మీ కృషిని వికీపీడియాలో కొనసాగించగలరు. వికీలో ఏ నిర్వాహకుడైనా, వాడుకరైనా వ్యాసాల నాణ్యతను దృష్టిలో ఉంచుకొని చర్చలు చేస్తారు తప్ప వ్యక్తిగత విభేదాలు ఉండవు కదా. ఇక్కడ అందరూ పరస్పరం గౌరవించుకోవాలి. రవిచంద్ర గారు కూడా వ్యాస నాణ్యత గురించే చర్చిస్తున్నారు తప్ప మీతో వ్యక్తిగతంగా అతనికి విభేదాలు లేవు కదా. కనుక అందరమూ కలసి వికీ అభివృద్ధికి పాటుపడదాం. కె.వెంకటరమణ (చర్చ) 12:16, 20 మే 2020 (UTC)Reply

వెంకటరమణ గారు, చదువరి గారు, మీ విలువైన సలహాలకి, సహాయసహకారాలకి ధన్యవాదాలు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. నేను నా జీవితం మీద కూడా చూపవలసిన శ్రద్ద చాలా ఉంది. చదువరి గారి నుండి నేర్చుకున్నవి ఎంతో విలువైనవి. నేను సంతకం చేయడం కూడా చదువరి గారి నుండే నేర్చుకున్నాను. నేను ముందు అనుకున్న, నాకు తెలిసిన వికీపీడియా వేరు. చిల్లర అనువాదాలు, చిల్లర ప్రవర్తన నాకు తెలియదు. ఒకరితో మాట పడటం నాకు తెలియదు.ఆ అలవాటు లేదు. నేను ప్రతి వాఖ్యమును నాకు వచ్చిన విధముగా వాఖ్య నిర్మాణం చేశాను. కేవలం కొంత రాసీ మొలక స్థాయి దాటించి ఉంటే నాకు ఇంత వాదము ఉండేది కాదు. ఆంగ్ల వ్యాసములో ఉన్న తీవ్రతని యదా విధిగా లైన్ బై లైన్ అనువదించడం వల్ల మీకు అలా అనిపిస్తోంది. నేను ఎవరిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయలేదు, నా ప్రవర్తన అది కాదు. వెంకటరమణ గారు, చదువరి గారు, మీదగ్గర చాలా నేర్చుకున్నాను. ఈ ఒక నెల తెవికీ కాలం నేను మర్చిపోను. ఎవరినైనా బాదించి ఉంటే క్షమించండి. ఈ వ్యాసాన్ని తొలగించండి. నాకు ఎటువంటి గడువు వద్దు. ధన్యవాదాలు. ఇక సెలవు. దేవుడు (చర్చ) 12:57, 20 మే 2020 (UTC)Reply

దేవుడు గారూ, మీకు నిర్వాహకులు తగినన్ని సూచనలిచ్చారు. మీరు ఎంత కృషిచేసిన యంత్రిక అనువాద దోషాలు అలానే ఉండిపోయాయి. ఈ వ్యాసం విస్తరణ కంటే చర్చలతోనూ, వాదనలతోనూ అధిక సమయం వెచ్చించడం బాధాకరం. మీరు తొలగించమన్నారు. ఇంత చర్చ జరిగాక మీ మీదున్న గౌరవం కొద్దీ ఆ వ్యాసాన్ని తగు రీతిలో శుద్ధి చేసాను. శుద్ధి చేసినందున ఆ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 14:20, 20 మే 2020 (UTC)Reply
వెంకటరమణ గారూ చాలా ఓపిగ్గా వ్యాసాన్ని సరిదిద్దినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం సంస్కరించబడింది కాబట్టి నాకు కంప్లైంట్స్ లేవు. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. -రవిచంద్ర (చర్చ) 17:04, 20 మే 2020 (UTC)Reply
దేవుడు గారూ ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. సమస్య పరిష్కారమైనందున తెలుగు వికీపీడియాలో మీ కృషిని కొనసాగించండి. కె.వెంకటరమణ (చర్చ) 04:19, 21 మే 2020 (UTC)Reply

వెంకట రమణ గారు, చర్చలో చివరికి మీ ఆత్మీయ, సగౌరవ అభ్యర్థనకు ధన్యవాదాలు. నేను ఇవాళ చాలా వాడుకరి పుటలను చూశాను/గమనించాను. అందులో ప్రముఖంగా నేను గమనించినది. ""క్రొత్త సభ్యులకు సహాయం చాలా అవసరం తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.

కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి."

ఈ నాటి చిట్కా...
 
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

Return to "సిల్వియా లైకెన్స్ హత్య" page.