వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సిల్వియా లైకెన్స్ హత్య
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: ఈ వ్యాసాన్ని విస్తరించాను. అందువలన తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 14:21, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసం, విషయ ప్రాముఖ్యత లేదు.--కె.వెంకటరమణ⇒చర్చ 09:40, 21 ఏప్రిల్ 2020 (UTC) ______[ప్రత్యుత్తరం]
______
- విషయ ప్రాముఖ్యత తో మీకు వచ్చిన ఇబ్బంది ఏమి ?. శుద్ధి చేయకపోతే వికీపీడియా ఎందుకు అనుమతించింది ?_దేవుడు
______
- దేవుడు గారూ, కోపగించకండి. గూగుల్ చేసే యాంత్రిక అనువాదం దోషభూయిష్టంగా ఉంటది. మీరు గమనించే ఉంటారు.. చాలా సందర్భాల్లో వాక్యనిర్మాణం గందరగోళంగా ఉంటది. (ఒక్కోసారి అనువాదం సరిగ్గా వ్యతిరేక అర్థాన్ని తెస్తుంది.) మనం దాన్ని ప్రచురించే ముందు శుద్ధి చేసి ప్రచురించాలి. పైన కె.వెంకటరమణ గారి ఉద్దేశం అదే.
- వికీపీడియా అనుమతించడానికి, (లేదా అనుమతించకపోవడానికీ) ఒక పరిమితి ఉంటుంది. అనువాద పరికరం నుండే ప్రచురిస్తే వికీపీడియా "మరియు" లను అనుమతించదు. కానీ ఆ పరికరం నుండి కాపీ చేసి, పేజీలో పేస్టు చేస్తే "మరియు" లను అడ్డుకోలేదు. అది వికీపీడియాలో ఉన్న లోటు. దాన్ని మీరూ గమనించారు. అందుకే నాలుగైదు సార్లు వికీపీడియా అడ్డుకున్న తరువాత, మీరు దాన్ని బైపాస్ చేసారు. అది తేలికైనది, శ్రమ లేని పని కదా మరి. 50 పైచిలుకు "మరియు"లు వచ్చినా, భాష కృతకంగా ఉన్నా, పట్టించుకోకుండా అలాగే ప్రచురించేసారు. సరే, ప్రచురిస్తే ప్రచురించారు.., ఆ తరువాతైనా సరిదిద్దలేదు. కె.వెంకటరమణ గారు శుద్ధి అనడంలో దాన్ని కూడా ఉద్దేశించి ఉంటారు.
- "రిగర్ మార్టిస్" అనేది ఒక మెడికల్ సాంకేతిక పదం. దాన్ని అనువాద పరికరం "కఠినమైన మార్టిస్" అని అనువదించినా మీరు దాన్ని పట్టించుకోలేదు, ప్రచురించేసారు. ఇలాంటివి, ఇంకా అర్థం పర్థం లేని వాక్య నిర్మాణాలూ ఆ పరికరానికి సహజం. దాని సత్తా అంతే. ప్రచురించే ముందు మనం దాన్ని సరిదిద్దాలి. (ప్రచురించే ముందు కనీసం ఒక్కసారైనా చదవాలి.) కానీ మీరు అలాగే, సరిదిద్దకుండానే, ప్రచురించేసారు.
- సరిగ్గా అనువదించే సత్తా అనువాద పరికరానికి లేదు, వాటిని ఆపే సత్తా వికీపీడియాకు లేదు. వాటిని మనమే పరిశీలించి పరిష్కరించాలి. ఆ పని మీరు చెయ్యలేదు. కె.వెంకటరమణ గారు పరిశీలించి, తెలియజెప్పి, మీకు, మనకు, వికీపీడియాకూ సాయం చేస్తున్నారు. దానికి ఆయన్ను అభినందించాలి, ఆయన చేసిన సూచనల ప్రకారం సరిచెయ్యాలి. కనీసం ఏమీ అనకుండా ఉండాలి. కానీ ఇలా కోపగించుకోవడం/విసుక్కోవడం అన్యాయం సార్. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 14:48, 22 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
_____
_____ నేను ఎంతో కస్టపడి అనువదించిన ఈ వ్యాసాన్ని తేలికగా ఒక్క మాటతో తీసిపడేసినందుకు ధన్యవాదములు. నేను ఓ పది శాతం అనువాద యంత్రం సహాయం తీసుకుని ఉండవచ్చును. నేను తెవికీ లో మీ అంత అనుభవశాలిని కాదు. మీకు ఉన్నంత విషయ పరిజ్ఞానం నాకు కాపీ బయట నుంచి ఇక్కడ వేస్తే అనుమతిస్తుందని కూడా నాకు తెలియదు. నేను ఎప్పటినుండో అంతర్జాలంలో తెలుగులో జరుగుతున్న కృషిని అనుసరిస్తున్నాను. తెలుగు అంటే పిచ్చి కూడాను. తెలుగు భాషాభిమనుల కృషిని తెలుగు గురించిన వ్యాసాల్ని గత పది సంవత్సరాలుగా చదువుతున్నాను. నేను చాలా వరకు మరియు లను ఏరి వేశాను . ఒకరి అనువాదాన్ని సులువుగా తీసివేసే తీర్పు చెప్పే బదులు ఈ ఇంగ్షీషు వ్యాసాన్ని ఒక్క సారి యాంత్రిక అనువాదం చేసి చూడండి, చేసిన అనువాదం ఎంతో అర్థం అవుతుంది. అంతా యాంత్రిక అనువాదాన్నే ప్రచురించి ఉంటే ఆంగ్ల వ్యాసంలో ఉన్న అంతా ఎందుకు నేను అనువదించలేదు ? వికీ చదువరిగా ఇది కనిపిస్తే నాకున్న పరిజ్ఞానం స్థాయిలో అనువదించడానికి ప్రయత్నం చేశాను. మీరు నాకు తెలియజెప్పి సరిదిద్ది ఉంటే నేను అన్యధా భావించే వాడిని కాదు. ఇది సరిదిద్దక పోవడానికి ప్రచురించి వారం కూడా గడవలేదు. కానీ తొలగింపు హెచ్చరిక పెట్టేశారు. కనీసం దీనిని అనువదించడం వల్ల నాకేమీ ధనము రాదు. నాకు చెందిన విషయము కాదు. కాని వీలైనన్ని చేద్దామని, తెవికీ లో వ్యాసాలు పెంచుదామని భావించాను. నాకు సభ్యత తెలుసు, మనస్సుద్ధి ఉంది, కపటము లేదు. నేను ఏదైనా మీకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించండి. మీరు తొలగించదలచితే నాకు ఎటువంటి అభ్యంతరము లేదని సవినయముగా తెలియచేయుచున్నాను. . వీలైతే నా తెవికీ ఖాతా కూడా తొలగించేయండి. ఇదే తొలి తెవికీ అనువాదము, చివరిది కూడాను. తెవికీకి ఇక సెలవు. ధన్యవాదాలు. వాడుకరి:దేవుడు మలిపొద్దు ౧౧:౦౫, ౨౪ ఏప్రిల్ ౨౦౨౦ (జిఎంటి+౫:౩౦) _____
_____
- దేవుడు గారూ, ఒక్క విషయమండి.. కొత్తవారికి వికీ పద్ధతులు, నియమాలు, నిబంధనలూ వగైరాలు తెలియకపోవడం అనేది చాలా మామూలు సంగతి. నిదానంగా నేర్చుకుంటారు, పెద్ద ఇబ్బందేమీ లేదు. కానీ భాష బాగుండాలని, వ్యాకరణయుక్తంగా ఉండాలనీ చెప్పాల్సిన పనిలేదు -కొత్తవాళ్లకైనా, పాతవాళ్లకైనా. ఈ చర్చలో మీరు రాసిన పేరా లోని భాష చూడండి. సిల్వియా లైకెన్స్ హత్య వ్యాసంలోని ఏ పేరానైనా సరే.. తీసుకుని ఈ పేరా లోని భాషతో పోల్చి చూడండి. భాష ఇక్కడున్నంత తేటగా అక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఒక్క మరియు కూడా లేదే.. అక్కడ 51 మరియు లతో ఎందుకు ప్రచురించేసారు? ఈ ఒక్ఖ ప్రశ్నకు సమాధానం, మీకు మీరు చెప్పుకోండి. నాకు చెప్పనక్కర్లా.
- అనువాదంలో ఉన్న లోపాలను అంగీకరించేందుకు మీకు ఇంకా మనస్కరిస్తున్నట్టు లేదు. మీరు ఎంత కష్టపడ్డారో, మీకు భాషాభిమానం ఎంత ఉందో, ఎన్నాళ్ళుగా వికీ చూస్తున్నారో, తెవికీలో వ్యాసాలు పెంచుదామని ఎంత ఉందో,.. ఇలాంటి వాటికే మొత్తం పేరానంతా ఖర్చు పెట్టేసారు. మీ అనువాదంలో ఉన్న లోపాల గురించి మాట్టాడేందుకు ఒక అక్షరం కూడా వాడలేదు. మీ మనశ్శుద్ది గురించి తపన పడ్డారే తప్ప, వ్యాసంలో ఉన్న భాష శుద్ధి గురించి ఒక్ఖ ముక్క మాటాళ్ళా.
- "నాకు కాపీ బయట నుంచి ఇక్కడ వేస్తే అనుమతిస్తుందని కూడా నాకు తెలియదు." అని అన్నారు. ఒక్కసారి ఇది చూడండి.. పేజీలో 51 మరియు లున్నాయి. తొలుత అనువాద పరికరం ప్రచురణను నిరాకరించినపుడు (ప్రచురించేందుకు 3 సార్లు ప్రయత్నించారు మీరు. మూడు సార్లూ నిరాకరించింది) అప్పుడు మరియులను సరిదిద్దే ప్రచురించారు. అయితే, అప్పుడు కొంత భాగమే ప్రచురించారు. మిగతా భాగాన్ని ఆ తరువాత, మరియులను తీసెయ్యకుండానే, కాపీ పేస్టు ద్వారా, ప్రచురించారు. అందుకే 51 మరియులు వచ్చాయి. మీరు కృషి చెయ్యలేదనీ, కష్టపడలేదనీ నేను అనలేదు. వ్యాసంలో భాష కృతకంగా ఉందని అన్నాను. "శుద్ధి చేయకపోతే వికీపీడియా ఎందుకు అనుమటించింది ?" అని మీరు తెలివిగా ప్రశ్నించారు. వికీపీడియాకు అనుమతించడానికీ/అనుమతించకపోవడానికీ కొన్ని పరిమితులున్నై. దాన్ని బైపాసు చేస్తే అదేమీ చెయ్యలేదు అని చెప్పాను.
- "నేను ఓ పది శాతం అనువాద యంత్రం సహాయం తీసుకుని ఉండవచ్చును." అని మీరు అన్నారు. అది కూడా సరి కాదు. మీరు చివరిసారి అనువాద పరికరం ద్వారా ప్రచురించినప్పటి గణాంకాలు (పరికరానికి చెందిన గణాంకాలు) చూస్తే, అందులో 66.91% యంత్రం ద్వారా చేసిన అనువాదమే ఉంది. అయితే అది తప్పు అని నేను అనడం లేదు. (అంతా మనిషే చేసే పనైతే, అసలు యాంత్రిక అనువాదం ఎందుకు!) కాకపోతే, యాంత్రిక అనువాదంలో మరియు లుంటై, లోపాలుంటై -వాటిని సరిదిద్దాలి అంటున్నా. అంతేనండి.
- మళ్ళీ చెబుతున్నాను.. మీరు కష్టపడలేదని నేను అనలేదు. అనువాద పరికరంలో కనీసం 30% మానవికంగా చేస్తే తప్ప అది ప్రచురించనివ్వదు. కాబట్టి మీరు కష్టపడలేదని ఒక వేళ నేను అంటే అది తప్పౌతుంది. నేనిక్కడ రాసిన దానిలో మీకు అలా అనిపిస్తే, అలా ధ్వనించినా సరే.., నేను క్షమాపణ చెబుతాను. మీరు వెళ్ళిపోవడం నాకు కష్టంగా ఉంది. కలిసి పనిచేద్దాం, ఉండండి. __చదువరి (చర్చ • రచనలు) 01:16, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
_____
_____
"చదువరి గారూ, నేను అనుసరించిన కొన్ని విషయాలు మీకు స్పష్టముగా తెలియజేయదలచుకుంటున్నాను.
- ౧. నేను అనువాదాన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ ౨౦౧౯ కి ఎత్తుకెళ్ళి అక్కడ నా మార్పులు చేసి మరలా ఇక్కడ అతికించడానికి కారణం సమస్యను దాట వేయుటకు కాదు. యంత్ర అనువాదము చేసిన పిదప వికీపీడియాలో తక్షణం రాయడానికి వికీపీడియా అనువాద ఎడిటర్ అనుమతించలేదు లేదా రాయడానికి ఏదో సమస్య వల్ల అనుమతించబడలేదు.
- ౨. నాకు ఇక్కడ నుండి ఎత్తుకెళ్ళి వర్డ్ లో అతికించి అక్కడ మార్పులు చేయడానికి కారణం టైపు చేయడానికి మైక్రోసాఫ్ట్ వారి ఫోనెటిక్ ఇన్పుట్ పద్దతి అనువుగా ఉండటము. పైన చెప్పిన విధముగా ఒక్కసారి ఇక్కడ అతికించిన తరువాత మాత్రమే వికీపీడియాలో అనువాద మార్పులు చేయుటకు అనుమతించేది.
- ౩. "మరియు"లు చాలా వరకు పై నుండి కింది వరకు చూసి ఏరివేశాను, తర్వాతే తెవికీలో ప్రచురించాను. "మరియు"లు మంటనక్క విహారిణిలోని పదాలు వెతికే విధానాన్ని అనుసరించి వెతికి ఏరి వేశాను కూడా. మరొక్క సారి ఏరివేతకు నాకు అభ్యంతరము లేదు.
- ౪. నేను మొత్తం ఆంగ్ల వ్యాసాన్ని ఒక్కో వాఖ్యాన్ని ఒక్కోసారి అనువదించాను. ఒకేసారి ఒక్క పేరాలోనే మొత్తం విషయాన్ని చెప్పేయవచ్చు. అలా చేసి చేతులు దులుపుకోవచ్చు. కానీ అలా చేయలేదు.
- ౫. యంత్ర అనువాదానికి మనము చేసే అనువాదానికి పద పోలికలు ఉండవచ్చు. వాఖ్య నిర్మాణము ఎలా ఉంది అని గమనించాలి.
- ౬. యంత్ర అనువాద సహాయము చేసుకున్నప్పటికి ఆ వాఖ్యలకు అర్థం వచ్చేలా చదివి అర్థము చేసుకునేలా ఉండాలని మార్పులు, వాఖ్య నిర్మాణం చేశాను.
- ౭. నేను ఇది అంతా చేయడానికి ఒకటిన్నర రోజు నా ఒక వారాంతం మొత్తం తీసుకుంది, అయినప్పటికీ మొత్తం అనువదించడానికి సమయం సరిపోలేదు. కాబట్టి క్రింద ఆంగ్లం లో ఉన్న తీర్పు న్యాయ విచారణ అంతా అనువదించలేదు. కేవలం యంత్ర అనువాదం మాత్రమే వాడి ఉంటే నాకు అంతా సమయం తీసుకోదని మీకు తెలుసు, నాకు తెలుసు.
- ౮. నేను నా రాతలో తెలుగు సంఖ్యామానాన్ని విరివిగా కావాలనే వాడాను.
- ౯. కొన్ని చోట్ల యంత్ర అనువాదం నాకు తెలుగులో సరి భావం తెలియని చోట్ల యధావిధిగా వాడి ఉండవచ్చు. కానీ అంత కృతకంగా ఏమి చేయలేదని లేదని నా భావన.
- ౧౦. మీకు వీలైతే ఓసారి ఆంగ్లములోని విషయన్ని యంత్రనువాదము మీకుగా చేసి చూడండి. తరువాత నేను చేసిన దాన్ని సరిపోల్చండి. మీకు నేను చేసిన కృషి అర్థం అవుతుంది.
- ౧౧. నేను మైక్రోసాఫ్ట్ వారి ఫోనెటిక్ విధానమును అనుసరించి అనువాదము చేయడము వలన పదములు రాయడానికి, సరి పదములు ఎంచుకోవడానికి జరిగిన సమయాభావము వలన నాకు ఇది పూర్తి చేయడంలో ఎంతో ఒత్తిడి కలిగిన మాట వాస్తవము.
- ౧౨. నాకు తెలుగు భాష మీద బాగా పట్టు ఉంది. కాబట్టి నా తెలుగు కొంచెము మీకు అలా తోచి ఉండవచ్చని భావిస్తున్నాను. వీలైనంత వరకు పరిపూర్ణముగా ఉండడానికి ప్రయత్నించాను. ఉదా: "పరిపూర్ణంగా - పరిపూర్ణముగా".
- ౧౩. దీనిని ఇంకా మెరుగు పరచడానికి నేను ఏమి వ్యతిరేఖము కాదు. నేను చేసిందే సరి అని మూర్ఖ వాదన చేయు మనస్తత్వము నాది కాదు.
- ౧౪. నేను ఇంతకన్నా ౧౦౦ రేట్లు ఘోర యంత్రయనువాదము ఉన్న వ్యాసాలు వికీపీడియాలో కొన్ని చాలా ఏండ్ల కిందట చాలా చూసా. నాకు ఆ వ్యాసాలు ఏవో ఇప్పుడు గుర్తు లేవు. కాని అవి కొన్ని దేశాల గురించి. ఇది నేను నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పడం లేదు.
- ౧౬. తెవికీలో విభిన్న శైలి రచనలను ఆహ్వానించండి. అన్నీ మీకు వచ్చిన, నచ్చిన విధములోనే ఉండాలంటే, తెలుగుకు ఏదో చేయాలన్న తపన ఉన్న వారిని బాధ పెట్టిన వారవుతారు.
- ౧౫. తెవికీ నిర్వహకులుగా మీకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, వాటిని సాధించుటకు చాలా తెవికీ వ్యాసాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని భావిస్తాను.
ఇక మీ విజ్ఞతకి విడిచిపెడుతున్నా. ఏదైనా కటువుగా భాషించి ఉన్న యెడల క్షమించగలరు." _దేవుడు, మలిపొద్దు ౧౨:౧౪, శనివారము, ౨౫ ఏప్రిల్ ౨౦౨౦ (భారత కాలమానం ప్రకారం)
_____
_____
దేవుడు గారూ,
- వ్యాసంలో మీరు సవరణలు చెయ్యడం గమనించాను. ధన్యవాదాలు.
- మీకు ఈ పరికరం ఉపయోగపడవచ్చు, పరిశీలించండి. వికీలో ఈ సరికే ఉన్న వ్యాసాలను విస్తరించాలంటే నేను ఈ పరికరాన్ని వాడతాను. ముందు అనువాద పరికరంలో అనువాదం చేస్తాను. ఆ తరువాత పై లింకుకు వెళ్ళి, అక్కడ wikitext ను కాపీ చేసి, దాన్ని వర్డులో పెట్టి, అక్కడ
<section> </section>, <span> </span>
ట్యాగులను తీసేసి (రెగెక్సులతో ఫైండ్, రీప్లేస్), తిరిగి కాపీ చేసి, నోట్ప్యాడులో పేస్టు చేసి, దాన్ని తిరిగి కాపీ చేసి (ఈ పద్ధతిలో వర్డులో వచ్చే రిచ్టెక్స్టు ఫీచర్లను ఏరేస్తాను), వికీ వ్యాసంలో పేస్టు చేస్తాను. పాత వ్యాసాలను విస్తరించేటపుడు ఈసరికే పేజీలో ఉన్న పాఠ్యం పోకూడదు కాబట్టి ఈ పని చేస్తాను. కొత్త వ్యాసాలను సృష్టించేటపుడు మాత్రం ఈ శ్రమ అక్కర్లేదు, నేరుగా ప్రచురించెయ్యడమే. - "ఇంతకన్నా ౧౦౦ రేట్లు ఘోర యంత్రయనువాదము ఉన్న వ్యాసాలు వికీపీడియాలో కొన్ని చాలా ఏండ్ల కిందట చాలా చూసా." - అవునండి. ఉండేవి. మూణ్ణెల్ల కిందట, అలాంటివి పద్దెనిమిదొందల వ్యాసాలను తొలగించాం. దానికి సంబంధించిన చర్చను ఇక్కడ చూడవచ్చు. ఈ యాంత్రికానువాదాల గురించి, వాటి లోని భాష గురించీ గతంలో జరిగిన చర్చల లింకులు కూడా పై లింకులో ఉంటాయి, చూడవచ్చు. ఎందుకు చెబుతున్నానంటే, తెవికీ సముదాయం ఈ విషయం మీద చాలా సమయాన్ని ఖర్చు పెట్టింది అని చెప్పేందుకే. ఇక పోతే.., మీరు చెప్పినట్లుగా ఘోరమైన భాష ఉన్న వ్యాసాలు ఇంకా అనేకం ఉండే ఉంటాయి కూడా. మనందరం దానికి బాధ్యులమే. ఆ దోషాలనైనా ఏరెయ్యాలి లేదా ఆ పేజీలనైనా ఏరెయ్యాలి.
- "తెవికీలో విభిన్న శైలి రచనలను ఆహ్వానించండి. అన్నీ మీకు వచ్చిన, నచ్చిన విధములోనే ఉండాలంటే, తెలుగుకు ఏదో చేయాలన్న తపన ఉన్న వారిని బాధ పెట్టిన వారవుతారు.": ఒక్కో వ్యాసం ఒక్కో శైలిలో ఉంటే బాగుంటుందా!!? శైలికి సంబంధించి వికీ కొన్ని నియమాలను పెట్టుకుంది. మీరు వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష పేజీలను, సంబంధిత పేజీలనూ చూడండి. అవేమీ శిలాక్షరాలు కాదు, శిలాశాసనాలూ కాదు. మార్చుకోవచ్చు, అందరం చర్చించుకుని. ఇకపోతే, వ్యక్తిగతంగా నాకు నచ్చినవి, నచ్చనివి ఇక్కడ రుద్దుతున్నానని భావించకండి (మీరు అలా భావిస్తున్నారని అనడం లేదు గానీ, నాకు చెప్పాలనిపించి చెబుతున్నాను) ఉదాహరణకు ఒకటి చెబుతాను. కిలోమీటరు, మీటరు వంటి వాటిని సంక్షిప్తంగా రాయాలంటే కిమీ మీ అని (చుక్కల్లేకుండా) రాయాలనేది నా నిశ్చితాభిప్రాయం. అలాగే రాసేవాణ్ణి కూడా. కానీ సముదాయం కి.మీ. అని, మీ. అనీ రాయాలని నిర్ణయించింది. అప్పటి నుండీ నేను ఏనాడూ చుక్కల్లేకుండా రాయలేదు, నాకు ఇష్టం లేకున్నా. వికీలో రాయాలంటే వికీ పద్ధతులను పాటించి తీరాల్సిందే అని దృఢంగా నమ్ముతాన్నేను. వికీ ముందు మన శిరసు వినమ్రతతో అవనతమవ్వాలని భావిస్తాన్నేను.
- పోతే, ఈ విధానాల పేజీలో తెలుగు అంకెల గురించి రసవత్తరమైన చర్చ జరిగింది చూడండి. (ఈ పేజీలోనే విషయప్రాముఖ్యత గురించి కూడా చర్చ జరిగింది.)
- అన్నట్టు, చర్చపేజీల్లో వ్యాఖ్య రాసాక చివర సంతకం చెయ్యాలంటే
~~~~
ఇలా నలుగు టిల్డె లను చేర్చితే అదే మన సంతకం అవుతుంది.
__చదువరి (చర్చ • రచనలు) 10:27, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ, తెలుగు అంకెల చర్చ పేజీ లింకు తప్పు ఇచ్చాను సరైన లింకు ఇది: వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/పాత చర్చ 3#తెలుగు అంకెలు
______
______
మీకు వీలైతే దీనిని కూడా ఓ చూపు చూడండి! నేనే రాశా, నేను ఓ సారి వెళ్ళి వచ్చిన అనుభవంతో కొన్ని ఫోటోలు కూడా జత చేశా! https://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF దేవుడు (చర్చ) 13:05, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
______
______
ఇంకోటి https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D దేవుడు (చర్చ) 13:25, 25 ఏప్రిల్ 2020 (UTC) ______[ప్రత్యుత్తరం]
______
https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%AF%E0%B1%81%E0%B0%B0%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82_%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3 ఇది కూడా చూడండి "చదువరి గారూ. దేవుడు (చర్చ) 10:39, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
______ ______
దేవుడు గారూ, ఇక్కడి చర్చను "సిల్వియా లైకెన్స్ హత్య" వరకే పరిమితం చేద్దాం. ఇతర పేజీల గురించిన విషయాలను ఆయా పేజీల చర్చ పేజీల్లో గానీ నా చర్చ పేజీలోగానీ రాయండి. __చదువరి (చర్చ • రచనలు) 10:54, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
______
______
సరేనండి చదువరి గారు, అవికూడా చూసి సూచనలిస్తారేమోనని ప్రస్తుతించాను. క్షమించండి. దేవుడు (చర్చ) 11:18, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- user:దేవుడు గారూ, ఈ వ్యాసంలో ఇంకా అనేక దోషాలున్నాయి. దోషభూయిష్టమైన అనువాదం జరిగినట్లు ఆ వ్యాస చర్చా పేజీలో సభ్యులు తెలియజేసారు. కానీ ఈ వ్యాసం పూర్తి శుద్ధి జరుగలేదు. ఈ వ్యాసం తొలగించాలి. ఈ విషయమై మీ అభిప్రాయాన్ని ఇక్కడ సంగ్రహంగా తెలియజేయండి. కె.వెంకటరమణ (చర్చ) 04:41, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ:సిల్వియా లైకెన్స్ హత్య వద్ద కూడా స్పస్టంగా వివరించాను. మీ అందరికీ ఏది చేయాలనిపిస్తే అది చేయండి. చదువరి గారు, మీరు ఏమి నిర్దేశించినా నాకు సమ్మతమే. మీరు నాకు పైన వివరించిన తీరు బాగున్నది. అందుకు నా ధన్యవాదాలు. కానీ నేను సమస్యగా భావించిన అంశాలు
- విషయ ప్రాముఖ్యత లేదు అన్నారు. ఇదేవరు చూస్తారు, తొలగించాలి అన్నారు, నేను వివరించిన తరువాత మా ఉద్దేశం అది కాదు అన్నారు.
- నేను ఎంతో కృషి చేసిన తరువాత ఈ మాత్రం వ్యాసం అయ్యిందన్న విషయం కనీసం మాట వరసకు కూడా చదువరి గారు తప్ప ఎవరూ ఒప్పుకోలేదు.
- రవిచంద్ర గారికి, మెరుగుపరచడానికి లేదా సవరణలు సూచించడానికి లేని శ్రద్ద తొలగించడానికి మాత్రం బాగా ఉంది.
- కె.వెంకటరమణ గారికి నాకు ఆస్తి తగాదాలు లేవన్నది నాకు తెలుసు. నాకు ఆ పరిణతి ఉంది. మెరుగుపరచడానికి హెచ్చరికలు జత చేయవచ్చు. కానీ తొలగింపు హెచ్చరిక అసంబద్దం, అత్యుత్సాహం అని నా భావన.
- నేను వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లో రవిచంద్ర గారు చెప్పిన సొంత వ్యాసాల సంఖ్య, దిద్దుబాట్లును పెంచుకోవడం దాని గురించి గొప్పలు చెప్పుకోవడం, చర్చలో అవసరం లేకపోయినా వాటిని తీసుకురావడం. నా గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. నా అనుభవాన్ని వివరించడం కోసమే. నాకన్నా 1000 టైమ్స్ బాగా చేసిన వారు కూడా ఉన్నారు తెవికీ లో. అది నాకు తెలుసు. కొత్తవారిని అభినందించడం మీకు తెలియదనుకుంటా. అందరూ కూడా "గారు" అని మర్యాదపూర్వకం జత చేశారు ఒక్క మీరు తప్ప.
- నేను ఎవ్వరికీ ముసుగు వీరుడిని కాదు, కానీ తెలుగు భాషాభిమానిని. నా గురించి కె.వెంకటరమణ గారు చెప్పిన పరిణతి ఇలా వచ్చిందే. గత 10 సంవత్సరాలుగా అంతర్జాలములో జరిగే తెలుగు కృషిని అనుసరిస్తున్నాను. నేను వీరెవ్వరికి తెలియదు. తెవికీలోకి వాడుకరిగా గత నెలనుండే వచ్చాను. ఎప్పటినుంచో చదువుతున్నాను.
- నేను ఇక్కడికి దారితప్పి వచ్చాను తప్పా ఎవరికి ముసుగు వీరుడిని కాదు. మీ దర్యాప్తుతో నాకు వచ్చిన సమస్య లేదు.
- నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పా ఆధార సహిత సవరణలు నాకు సమ్మతమే.
- child abuse కి తెలుగు అనువాదం తెలిపితే మారుస్తాను.
- మగ స్నేహితుడు కి స్నేహితుడుగా రవిచంద్ర గారు సూచించిన పిదప సవరించాను.
- సమయం,ఆసక్తి లేనప్పుడు ఒకరి పనిని వేలెత్తి చూపకండి. ఇది మీ గురించిన వ్యాసం కాదు కదా.
- నేను ఎవరికో ముసుగు వీరుడిని అని నిందించడం మీ దృక్కోణం మాత్రమే. దేవుడు (చర్చ) 10:06, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ, మీకు నిర్వాహకులు తగినన్ని సూచనలిచ్చారు. మీరు ఎంత కృషిచేసిన యంత్రిక అనువాద దోషాలు అలానే ఉండిపోయాయి. ఈ వ్యాసం విస్తరణ కంటే చర్చలకోసమే అధిక సమయం వెచ్చించడం బాధాకరం. మీరు తొలగించమన్నారు. ఇంత చర్చ జరిగాక మీ మీదున్న గౌరవం కొద్దీ ఆ వ్యాసాన్ని తగు రీతిలో శుద్ధి చేసాను. శుద్ధి చేసినందున ఆ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 14:21, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. సమస్య పరిష్కారమైనందున తెలుగు వికీపీడియాలో మీ కృషిని కొనసాగించండి. కె.వెంకటరమణ (చర్చ) 04:20, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దేవుడు గారూ, మీకు నిర్వాహకులు తగినన్ని సూచనలిచ్చారు. మీరు ఎంత కృషిచేసిన యంత్రిక అనువాద దోషాలు అలానే ఉండిపోయాయి. ఈ వ్యాసం విస్తరణ కంటే చర్చలకోసమే అధిక సమయం వెచ్చించడం బాధాకరం. మీరు తొలగించమన్నారు. ఇంత చర్చ జరిగాక మీ మీదున్న గౌరవం కొద్దీ ఆ వ్యాసాన్ని తగు రీతిలో శుద్ధి చేసాను. శుద్ధి చేసినందున ఆ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 14:21, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
ఈ పైన జరిగిన చర్చల ద్వారా నేను గమనించినది మీరు చాలా సీనియర్ వికీపీడియన్ అని అర్థం చేసుకున్నాను. మీరు వాడిన భాషను బట్టి, కొన్ని పదాలను బట్టి చేతివేళ్ళతో లెక్కించ గలిగే సీనియర్ వాడుకరులలో అతికొద్దిమందిలో మీరు ఒకరు అని తెలుస్తున్నది. కానీ మీ పాతకాలం సేవలు మాత్రం కొత్తవాళ్ళకు అర్థం కావు,కొంచెం ఇబ్బంది మాత్రం ఉంటుంది. నాకు మీరెవరో అర్థం అయ్యింది, గతం అనవసరమే, కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ నేను పొరపాటున చర్చ దేని మీదనైనా చేస్తే నా పదాలు జాగ్రత్తగానే చూసి వ్రాస్త్రాను అని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతం. మీకు శుభాభినందనలు.JVRKPRASAD (చర్చ) 06:42, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]