చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు
వ్యాస అభివృద్ధికి సలహాలు
మార్చుUser:అరుణ గారికి, తెలుగువికీలో వ్యాసరచన ప్రారంభించినందుకు అభినందనలు. లింకులు తెవికీలోని సినిమా పేజీలకు ఇవ్వాలి. మూలాలు 50రోజులు అడినదన్నదానికి చాలు. IMDB మూలాలు సినిమా పేజీలో ఇవ్వండి. నేను చేసిన మహానటి సవరణ, మహానటి సినిమా పేజీ సవరణ చూసి మిగతా అంశాలకు ఆ విధంగా సవరించండి. --అర్జున (చర్చ) 04:03, 10 మే 2019 (UTC)
ప్రత్యేకంగా పేజీ అవసరమా?
మార్చుఅరుణ గారు, అర్జున గారు.. 50 రోజులు ఆడిన సినిమాలు అనే పేజీ ప్రత్యేకంగా అవసరం లేదేమో నని నాకు అనిపిస్తోంది. మహా అయితే ఒక జాబితా పేజీ అవుతుంది. జాబితా చేసేందుక్కూడా సినిమాల సంఖ్య ఎక్కువ లేదు. విషయం గురించి రాసేందుకు కూడా పెద్దగా పాఠ్యం లేదు. అయా సినిమాల పేజీలను "2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు" అనే వర్గం లోకి చేరిస్తే సరిపోతుందని నా ఉద్దేశం. విషయం గురించి ఏమైనా రాయాలంటే, ఆ వర్గంలో రాయవచ్చు. రవిచంద్ర గారు కూడా పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 08:05, 13 మే 2019 (UTC)
- @చదువరి గారికి, సినిమా పేజీలు సమగ్రత గురించి నాకు అంతగా తెలియదు. సమగ్రతగా లేకపోతే జాబితా వివరాలను బట్టి అవసరమైన పేజీలను సృష్టించటానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 16:45, 13 మే 2019 (UTC)
- @చదువరి గారికి నమస్తే , సాధారణముగా హిట్ సినిమా లు చూడాలని అందరు అనుకుంటారు . హిట్ సినిమా ల లిస్ట్ ఉంటే ఇయర్ ప్రకారము సెర్చ్ చెయ్యడానికి వీలు అవుంతుంది . సెర్చ్ చేసాక కావలసిన సినిమా వీడియో చూసుకోవచ్చు . హిట్ సినిమా జాబితా 2019,2018,2017,2016...ఇలా పెడితే బెటర్ అని నా ఉదేశ్యము .(అరుణ (చర్చ) 05:19, 16 మే 2019 (UTC)).నాకు సినిమా ల మీద చాలా అవగాహన వుంది . ఈ విషయము లో నేను తెలుగు వికీపీడియా లో పూర్తిగా పార్టిసిపేట్ చెయ్య గలను .కావలి అంటే "తెలుగు 50 రోజులు ఆడిన సినిమా ల లిస్ట్" కూడా మీకు అందివ్వగలను (అరుణ (చర్చ) 05:23, 16 మే 2019 (UTC))
- అరుణ గారూ, మీలాగా ఉత్సాహంగా రాయదలచిన వారు వికీపీడియాలో చేరడం సంతోషంగా ఉంది. అయితే ఈ లింకులు కూడా చూడండి.. మీకు ఉపయోగపడవచ్చు - వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు, వేదిక:తెలుగు సినిమా. అలాగే సినిమాల పేజీలపై ఎప్పటినుండో పనిచేస్తున్నవారు ఉన్నారు. వారిలో కొందరు - స్వరలాసిక, రవిచంద్ర, పవన్ సంతోష్. వారితో కూడా సంప్రదిస్తూ పనిచేస్తే మన కృషి ఏకోన్ముఖంగా ఉంటుందని నా ఉద్దేశం. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 05:38, 16 మే 2019 (UTC)
- అరుణ గారూ, మీ కృషి పరిశీలిస్తున్నానండీ. మీ ఆలోచన, ప్రయత్నం అమోఘం. కొత్తగా వచ్చి ఇంత చక్కని ప్రయత్నం ప్రారంభించారంటే నాకెంతో సంతోషం కలిగింది. ఈ రెండురోజులుగా కాస్త నేను తెవికీలో రాసేందుకు వీలు చిక్కకపోవడంతో మిమ్మల్ని అభినందించి నేను చెబుదామనుకున్న సూచనలు చెప్పలేకపోయాను. ఇప్పుడు అభినందిస్తున్నాను. ఇకపోతే, చదువరి గారు సూచించినట్టు ఈ వ్యాసం ఉండాలా అన్నది పరిశీలిస్తున్నాను. అసలు మొదట 2018లో విడుదలైన తెలుగు చలన చిత్రాల జాబితా అన్న వ్యాసమే లేదు. దాన్ని తయారుచేయాలి. ఇక విజయవంతమైన సినిమాల జాబితా ముందు దానిలోనే ఒక విభాగంగా వేసి, మరీ పెద్ద జాబితా అయితే విడదీయవచ్చు. ఇదొక పద్ధతి. ఇలా నేరుగా విజయవంతమైన సినిమాల జాబితా తయారుచేయాలన్నా మనం రోజులు ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదు. ఎందుకూ అంటే - ఈరోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ విజయాన్ని వసూళ్ళ ప్రాతిపదికగా లెక్కిస్తోంది. 50 కోట్లు వసూలు చేసిన సినిమా, వంద కోట్ల వసూలు చేసిన సినిమాలు - ఇలా ఉంది లెక్క. 30 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో నిన్నమొన్నటిదాకా సినిమాలు వచ్చేస్తున్నాయి. గట్టిగా నిర్మాతల మండలి పట్టుబట్టి దాన్ని 60 రోజులకు పెంచింది. అంటే ఓ సినిమా ఎంత ఆడినా 30-40 రోజులేనన్నమాట. కాబట్టి మనం కూడా 2018లో విడుదలై అత్యధికంగా వసూళ్ళు చేసిన తెలుగు సినిమాల జాబితా వేసుకుంటే సరి. --పవన్ సంతోష్ (చర్చ) 06:52, 16 మే 2019 (UTC).
- అరుణ గారూ, మీలాగా ఉత్సాహంగా రాయదలచిన వారు వికీపీడియాలో చేరడం సంతోషంగా ఉంది. అయితే ఈ లింకులు కూడా చూడండి.. మీకు ఉపయోగపడవచ్చు - వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు, వేదిక:తెలుగు సినిమా. అలాగే సినిమాల పేజీలపై ఎప్పటినుండో పనిచేస్తున్నవారు ఉన్నారు. వారిలో కొందరు - స్వరలాసిక, రవిచంద్ర, పవన్ సంతోష్. వారితో కూడా సంప్రదిస్తూ పనిచేస్తే మన కృషి ఏకోన్ముఖంగా ఉంటుందని నా ఉద్దేశం. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 05:38, 16 మే 2019 (UTC)
- @Pavan santhosh.s గారూ,కృతజ్ఞతలు ,
మీరు చెప్పింది బానే వుంది . కానీ వో సమస్య వుంది . అత్యధిక వసూళ్లు అనే దానికి ఆధారం సరిగా ఉండదు అని నా అభిప్రాయం . నిర్మాతలు వసూళ్లు పెంచుకోవడానికి అలా గొప్పలు చెప్పడం నేను చాలానే చూసాను .తీరా ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్లు అందులో ఎందరు? . ఫాన్స్ మధ్య యుద్ధాలు అవుతాయి .నా ఆలోచన ఏమిటి అంటే , కలెక్షన్స్ పరిగణలోకి తీసుకుంటూ ,ఎన్ని వారాలు ఆడింది ,సినిమా రేటింగ్ కూడా పరిగణలోకి తీసుకుంటే సరి అయిన ఫలితం రావచ్చు . 2018లో విడుదలై విజయవంతమైన సినిమాల జాబితా అయితే బెటర్ .ఇది నా ఆలోచన మాత్రమే .ఫాన్స్ వాళ్ళ హీరో గురించి గొప్పలు చెప్పడానికి మన తెలుగు వికీపీడియా ని ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసి పాడు చేస్తారు అని నా అభిప్రాయం . ఫైనల్ గా మనం మంచి సినిమాల లిస్ట్ ప్రజలకి ఇవ్వాలి .(అరుణ (చర్చ) 09:26, 16 మే 2019 (UTC)) (అరుణ (చర్చ) 10:05, 16 మే 2019 (UTC))
- జాబితాల కంటే ముందుగా మనం ప్రజాదరణ పొందిన సినిమాల వ్యాసాల్లో కనీస సమాచారమైనా ఉండేలా చూడాలి. నా దృష్టిలో కనీస సమాచారమంటే రెండు పరిచయ వాక్యాలు, సమాచార పెట్టె, సంక్షిప్త కథ, నటీనటులు, విడుదల, స్పందనలు, పాటలు. ఈ వ్యాసాలు అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు హిట్ అని చెప్పుకోదగిన గీత గోవిందం (సినిమా) వ్యాసంలో ఉన్న సమాచారం గమనించండి. అదే సినిమాకు ఆంగ్ల వ్యాసం చూడండి. ముందుగా ఇలాంటి వ్యాసాలు అభివృద్ధి పరిచి తర్వాత జాబితాల జోలికి వెళితే బాగుంటుంది. రవిచంద్ర (చర్చ) 12:14, 16 మే 2019 (UTC)
రవిచంద్ర గారు , 2018 లో రిలీజ్ ఆయి 50 రోజులు ఆడిన సినిమా లు నేను అభివృద్ధి చేస్తాను. నేను సినిమా అభిమానిని .సినిమా ల మీద బాగా పట్టు వుంది నాకు . హిట్ అయిన ప్రతి తెలుగు సినిమా తప్పక చూస్తాను . కాబట్టి తప్పక మంచిగా అభివృద్ధి చేస్తాను . ఈ డిస్కషన్ లో పాల్గున్న అందరు ఎంతో సమర్థులు .నేను చేసే అభివృద్ధి లో మీ అందరి సలహా తీసుకుంటూ అభివృద్ధి చేస్తాను . ఇక పై తెలుగు సినిమా లు అభివుద్ది చెయ్యడం నా ముఖ్య బాధ్యత గా భావిస్తాను .(అరుణ (చర్చ) 15:24, 16 మే 2019 (UTC))
- రంగస్థలం (సినిమా) బానే వుంది .రెండు వాక్యాలు చేర్చాను. అభివృద్ధి చెయ్యడానికి ఏమి లేదు . "భరత్_అనే_నేను" కథ అభివృద్ధి చేసాను .ఇక అంతా బానే వుంది .మీరు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలి అని కోరుతూ (అరుణ (చర్చ) 16:42, 16 మే 2019 (UTC))
- (అరుణ గారూ, మా సలహాలు సహృదయంతో అర్థం చేసుకున్నందుకు, సినిమా వ్యాసాల అభివృద్ధికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. వ్యాసాలు అభివృద్ధి చేసేటపుడే వికీ నియమాలను కూడా గమనించండి. మీకు ఒక ఉత్తమ సినిమా వ్యాసం ఎలా ఉండాలో చూడాలంటే మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా వ్యాసం గమనించండి. దీనిని వికీపీడియన్ వాడుకరి:Veera Narayana గారు చాలా చక్కగా వికీ నియమాలకు లోబడి తయారు చేశారు. ఈ వ్యాసం ఆంగ్ల వికీలో విశేష వ్యాసంగా పరిగణించబడుతోంది.రవిచంద్ర (చర్చ) 16:44, 16 మే 2019 (UTC).
- సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు (అరుణ (చర్చ) 10:59, 17 మే 2019 (UTC))
- అరుణగారూ, మీరడిగినదానికి సమాధానం మీ చర్చ పేజీలోనే ఇస్తున్నానండీ. ఇక ఈ చర్చ వ్యాసానికి సంబంధం లేని చర్చ అవుతోంది, కానీ మొత్తంగా మీకు, వికీపీడియాకు కూడా ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి ఈ సంగతులు మీ చర్చ పేజీలోనే ఇక మాట్లాడుకుందాం. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 13:38, 17 మే 2019 (UTC)
- సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు (అరుణ (చర్చ) 10:59, 17 మే 2019 (UTC))