చాణక్య (2019 సినిమా)
చాణక్య 2019, అక్టోబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించాడు. తొట్టెంపూడి గోపీచంద్, మెహ్రీన్ పిర్జాదా, జరీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించగా, జయప్రకాష్, నాజర్, సునీల్, ఆలీ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.[2][3] ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.[4][5]
చాణక్య | |
---|---|
దర్శకత్వం | తిరు |
రచన | అబ్బూరి రవి |
స్క్రీన్ ప్లే | తిరు |
కథ | తిరు |
నిర్మాత | రామబ్రహ్మం సుంకర |
తారాగణం | తొట్టెంపూడి గోపీచంద్ మెహ్రీన్ పిర్జాదా జరీన్ ఖాన్ |
ఛాయాగ్రహణం | వెట్రి పలనిసామి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | ఎకె ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 5 అక్టోబరు 2019[1] |
సినిమా నిడివి | 147 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ సారాంశం
మార్చుపాక్ ఉగ్రవాద దాడుల నుంచి దేశాన్ని రక్షించడానికి అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్ నడుపుతుంటాడు. బయటకు మాత్రం బ్యాంక్ ఉద్యోగి రామకృష్ణగా చలామణీ అవుతుంటాడు. తన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కారకుడు.. పాక్ చెందిన ఇబ్రహీం ఖురేషీ అని అర్జున్ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఖురేషీకి చెందిన అబ్దుల్ సలీమ్‌ను అర్జున్ హతమారుస్తాడు. ఇందుకు ప్రతీకారంగా అర్జున్ టీమ్‌లో సభ్యులైన అతని నలుగురు స్నేహితులు (రా ఏజెంట్స్)ను ఖురేషీ కిడ్నాప్ చేసి కరాచీకి పట్టుకుపోతాడు. గోపీచంద్ కరాచీ వెళ్లి తన నలుగురు ఫ్రెండ్స్‌ను ఎలా కాపాడాడు, దేశాన్ని ఉగ్రముప్పు నుంచి ఎలా బయటపడేశాడన్నది సినిమా కథ.[6]
నటవర్గం
మార్చు- గోపిచంద్ (అర్జున్/రామకృష్ణ-అండర్ కవర్ రా ఏజెంట్)
- మెహ్రీన్ పిర్జాదా (ఐశ్వర్య)
- జరీన్ ఖాన్ (జుబేదా-కరాచీలో రా ఏజెంట్)
- నాజర్ (కులకర్ణి-రా ముఖ్యాధికారి)
- రాజేష్ ఖత్తర్ (ఇబ్రహిం ఖురేషి-ఉగ్రవాది)
- ఉపేన్ పటేల్ (సొహాలీ-ఖురేషి కొడుకు)
- రాజా చెంబోలు (రవీందర్)
- ఆదర్శ్ బాలకృష్ణ (ఆది)
- సునీల్ (శీను)
- ఆలీ (డా. ఆలీ)
- జయప్రకాష్ (హోం మంత్రి)
- మిర్ సర్వార్ (అబ్దుల్ సలీం-ఖురేషి సహాయకుడు)
- వినీత్ కుమార్ (కరాచీ ట్రాన్స్ పోర్టు కీమషనర్ మహ్మద్ ఆలీ ఖాన్)
- రఘుబాబు (బ్యాంక్ మేనేజరు)
- భరత్ రెడ్డి (హోం మంత్ర పిఏ)
- స్వప్నిక (ఐశ్వర్య స్నేహితురాలు)
- రేవతి (రేవతి-రా రవీందర్ భార్య)
- కరుణ భూషన్ (ఆది భార్య)
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరు
- నిర్మాత: రామబ్రహ్మం సుంకర
- రచన: అబ్బూరి రవి
- సంగీతం: విశాల్ చంద్రశేఖర్
- ఛాయాగ్రహణం: వెట్రి పలనిసామి
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్
నిర్మాణం
మార్చు2019, ఫిబ్రవరిలో గోపీచంద్, తమిళ దర్శకుడు తిరుతో కలిసి తన 26వ సినిమాగా చాణక్య సినిమాను ప్రారంభించాడు. దర్శకుడు తిరుకు తెలుగులో ఇది తొలిచిత్రం కాగా, మెహ్రీన్ ను హీరోయిన్ గా ఎంపికచేశారు. ఫిబ్రవరిలో జైపూర్ వద్ద చిత్రీకరణ ప్రారంభమైంది.[7][8] తెలుగులో ఆమె తొలిసారిగా ఈ చిత్రంలో జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించింది.[4][5]
పాటలు
మార్చుచాణక్య | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 25 సెప్టెంబరు 2019 | |||
Genre | సినిమా పాటలు | |||
Language | తెలుగు | |||
Label | లహరి మ్యూజిక్ | |||
విశాల్ చంద్రశేఖర్ chronology | ||||
|
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించగా, రామజోగయ్య శాస్త్రి, శ్రీ చరణ్ పాకాల పాటలు రచించారు.
సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఓ మై లవ్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" (అడిషనల్ ఓకల్స్: శ్రీచరణ్ పాకాల, పి. జోత్స్న, అంబికా సాహిత్తల్) | రామజోగయ్య శాస్త్రి | శ్రీ చరణ్ పాకాల | పూజన్ కొహ్లీ, చిన్మయి | 3:08 |
2. | "డార్లింగ్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | విశాల్ చంద్రశేఖర్ | హరిణి ఇవటూరి | 3:45 |
3. | "గులాబి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | విశాల్ చంద్రశేఖర్ | అనురాగ్ కులకర్ణి | 3:28 |
4. | "హుకాహ్ బార్ యూ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | విశాల్ చంద్రశేఖర్ | ఎం.ఎం. మనస్వి | 3:08 |
విడుదల
మార్చు2019, జూన్ 12న గోపిచంద్ ఫస్ట్ లుక్ తో సినిమా పోస్టర్ విడుదలయింది.[9][10] 2019, సెప్టెంబరు 9న ఎకె ఎంటర్టైన్మెంట్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేసింది.[11] 2019, సెప్టెంబరు 26న అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించబడింది.[12] 2019, అక్టోబరు 5న చాణక్య సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో విడుదలైంది.[13]
స్పందన - రేటింగ్
మార్చు- హన్స్ ఇండియా - 2.5/5[14]
- టైమ్స్ ఆఫ్ ఇండియా - 2/5[15]
- ఫస్ట్‌పోస్ట్ - 2/5[16]
- సాక్షి - 2.25/5[6]
మూలాలు
మార్చు- ↑ "Gopichand's Chanakya Movie October 5th Release Date HD Poster And Stills". 21 September 2019. Archived from the original on 22 సెప్టెంబరు 2019. Retrieved 23 డిసెంబరు 2019.
- ↑ "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 6 January 2020.
- ↑ "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 6 January 2020.
- ↑ 4.0 4.1 "Tollywood hates wasting time: Zareen Khan on Telugu debut in Chanakya". The New Indian Express. Archived from the original on 2 ఆగస్టు 2019. Retrieved 6 January 2020.
- ↑ 5.0 5.1 "Zareen Khan says Allu Arjun is her favourite dancer in Tollywood - Movies News". indiatoday.in. Archived from the original on 4 డిసెంబరు 2019. Retrieved 6 January 2020.
- ↑ 6.0 6.1 సాక్షి, సినిమా (5 October 2019). "'చాణక్య' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 7 January 2020. Retrieved 7 January 2020.
- ↑ "Gopichand: పవర్ ఫుల్ టైటిల్‌తో గోపీచంద్ కొత్త సినిమా". Samayam Telugu. Archived from the original on 6 October 2019. Retrieved 6 January 2020.
- ↑ Mulugu, Neelotpal. "#Gopichand 26 Movie Launched : Titled Chanakya". Telugu Film Nagar. Archived from the original on 2 జూలై 2019. Retrieved 6 January 2020.
- ↑ "Chanakya poster: Gopichand stands out from the crowd in first look of Thiru's spy thriller- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 5 జూలై 2019. Retrieved 7 January 2020.
- ↑ "Gopichand's first-look from 'Chanakya' released | Telugu Movie News". Times of India. Archived from the original on 16 July 2019. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya Teaser - Gopichand, Mehreen, Zareen Khan - Thiru - AK Entertainments". YouTube. AK Entertainments. 9 September 2019. Archived from the original on 2 జనవరి 2020. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya Theatrical Trailer - Gopichand, Mehreen, Zareen Khan - Thiru - AK Entertainments". YouTube. 26 September 2019. Archived from the original on 11 అక్టోబరు 2019. Retrieved 7 January 2020.
- ↑ "Gopichand's Chanakya Movie October 5th Release Date HD Poster And Stills". 21 September 2019. Archived from the original on 22 సెప్టెంబరు 2019. Retrieved 7 January 2020.
- ↑ "Gopichand's Chanakya Movie Review & Rating {2.5/5}". TheHansIndia. Retrieved 7 January 2020.
- ↑ "CHANAKYA MOVIE REVIEW". TimesofIndia. Archived from the original on 26 నవంబరు 2019. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya movie review: Gopichand's inconsequential spy thriller wages war against human intelligence". Firstpost. Archived from the original on 8 డిసెంబరు 2019. Retrieved 7 January 2020.