చింతా అప్పలనాయుడు

చింతా అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన రచయిత, కవి. విజయనగరం జిల్లాకు చెందినవారు. ఆయన మంచి నటుడు కూడా. ఆయన రాసిన "దుక్కి" కవిత్వానికి 2008 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఆయన రాసిన "శృతితప్పిన వానపాట" కవితకు 2010 లో రంజని కుందుర్తి అవార్డు వచ్చింది.

చింతా అప్పలనాయుడు
చింతా అప్పలనాయుడు
జననంచింతా అప్పలనాయుడు
1960 జూన్ 01
నివాస ప్రాంతంపార్వతీపురం భారత దేశముIndia
ఇతర పేర్లుచింతాశ్రీ
తండ్రిశ్రీ పాపినాయుడు
తల్లిశ్రీమతి సూరమ్మ

జీవిత విశేషాలు మార్చు

ఆయన ఉత్తరాంధ్ర బతుకు దుఃఖాన్ని తన కవితా వస్తువుగా చేసుకొని తన మాతృ యాసలో కవిత్వాన్ని రాస్తున్న రచయిత. తను కథలు, కవిత్వంతో ఈ ప్రాంత వాసుల జీవన వెతలను తెలియజెస్తుంటారు. వర్తమాన తెలుగు కవితా దీపస్తంభం కె.శివారెడ్డి గారు ఈ సంకలనానికి రాసిన ముందుమాటలోని వాక్యాలు : "చింతా అప్పలనాయుడు మనముందు కూర్చొని శ్రీకాకుళం యాసలో కబుర్లు చెబుతున్నట్లు హాయిగా ఉంటుంది. చాలా సూటిగా, హాయిగా సాగిపోయే శైలి, పల్లెటూళ్ళ జీవనంలో అతలాకుతులమయిన పల్లెల జీవన దృశ్యాల్ని కతచెపుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నాడు, అతని కథా కథన పద్ధతి జానపదకథకుడు చెప్పే పధ్ధతి. అనుభవసారం గుండెనిండుగా వున్నవాడు, గొప్ప ఊహాశీలి, సంక్షోభాల్ని వర్ణించేటప్పుడు, కుతూహలం తగ్గకుండా, కన్నీళ్ళు తెప్పిస్తూ కథనడుపుతాడు. బహుశా అప్పల్నాయుడు శిల్పంకూడా యిదేనేమో" అన్నారు.

తన ప్రతి కవితలోను కరుణ రసాన్ని మేళవించి ఈ నేల ఆనుపానుల్ని ఎరిగిన ఈ తరం కవి ఆయన. ప్రతి కవితలోనూ శ్రమజీవుల కష్టాలనీకన్నీళ్లనీ సహజాతి సహజంగా చిత్రిస్తాడు. ఈయన రాసిన కవితల్లో కథల నిండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జీవన సంఘర్షణలు, దోపిడీ, అడవి బిడ్డల బతుకుల్లోని చీకటి, మైదాన ప్రాంతాల వారు గిరిజన జాతులను ఎలా దోచుకుంటున్నదీ కనబడుతుంది.[1]

రచనలు మార్చు

  • దుక్కి (కవితా సంపుటి, 2009)[2]
  • బడి పాటలు (బాల సాహిత్యం, 2010)
  • నకజనకరి... నాం... నాం... (కథల సంపుటి, 2011)[3][4]
  • రారండి... మనవూరి బడికి (దీర్ఘ గేయం, 2019)
  • ఇల మీద దేవత (దీర్ఘ గేయం, 2020)[5]

పురస్కారాలు మార్చు

  • ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం - 2008
  • రంజని కుందుర్తి పురస్కారం - 2010
  • ఎక్స్ - రే ఉత్తమ కవితా పురస్కారం - 2011

ఈనాడు పత్రిక వారు నిర్వహించిన కరోనా పై కదనం లో ప్రథమ బహుమతి సాధించారు.[6]


మూలాలు మార్చు

  1. కథా..పరిణామక్రమం
  2. "జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ". virasam.org. Archived from the original on 2021-01-17. Retrieved 2021-03-09.
  3. "Andhra Pradesh Page: 5 - visalaandhra". epaper.visalaandhra.com. Retrieved 2021-03-09.[permanent dead link]
  4. "manam Andhra Pradesh epaper dated Mon, 8 Mar 21". epaper.manamnews.com. Archived from the original on 2021-03-09. Retrieved 2021-03-09.
  5. "విశాలాంధ్ర ఈపేపెర్". విశాలాంధ్ర.
  6. "కరోనాపై కదనం - ఏప్రిల్‌, 4 ఫలితాలు". www.teluguvelugu.in. Archived from the original on 2021-02-28. Retrieved 2021-03-09.

ఇతర లింకులు మార్చు