చిట్టగాంగ్ విప్లవ వనితలు

చిట్టగాంగ్ విప్లవ వనితలు ప్రముఖ రచయిత్రి పింగళి చైతన్య వ్రాసిన పుస్తకం. మహిళలు రహస్య సాయుధ దళాల్లో చేరి పోరాటం సాగించిన అపురూపమైన ఘట్టం ఆ సంస్థతోనే మొదలు. అందులో తుపాకీ పట్టి సాయుధ పోరుసల్పిన వీర వనితల సాహస గాథలు ఇవి.

చిట్టగాంగ్ విప్లవ వనితలు
"చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తక ముఖచిత్రం"
కృతికర్త: పింగళి చైతన్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: తుపాకీ పట్టి సాయుధ పోరుసల్పిన వీర వనితల సాహస గాథలు
ప్రచురణ: జనహర్ష పబ్లిషర్స్ ప్రై.లి.
విడుదల:
ప్రతులకు: విశాలాంధ్ర‌, ప్ర‌జాశ‌క్తి, ఇత‌ర అన్ని ప్ర‌ధాన పుస్త‌క‌కేంద్రాలు

నేపథ్యం

మార్చు

భారత స్వాతంత్ర్యోద్యమంలో చిట్ట్టగాంగ్ మహిళలు చేసిన పోరాటాలు, త్యాగాలు, వారు చూపిన తెగువ కళ్లకు కట్టినట్టుగా ఈ పుస్తకంలో చూపింది చైతన్య పింగళి. చిట్టగాంగ్ వీర వనితలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నో పోరాటాలకు ఆదర్శం. వారి జీవితచరిత్రల్ని పుస్తకంగా రాసింది చైతన్య. ఆ పోరాట వారసత్వాన్ని అందించినందుకు ఆమెకు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైంది.[1]

విశేషాలు

మార్చు

ఈ పుస్తకం 1928 దేశం స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న రోజులలో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ (ఐఆర్‌ఏ) నిర్మాత, దళపతి సూర్యసేన్. ఈ ఐఆర్‌ఏ రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ బ్రిటీష్ స్థావరాలు, బలగాల మీద దాడి చేసే భారతీయుల సాయుధ సైన్యం. ఈ దళం ఏడు రోజుల్లో చిట్టగాంగ్ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్ల చెర నుంచి విడిపించాలని లక్ష్యంగా పెట్టుకుని పోరాటం మొదలుపెట్టింది. నాలుగు రోజులు ఐఆర్‌ఏ సైన్యానిదే పైచేయిగా ఆ పోరాటం సాగింది. చిట్ట్టగాంగ్ ఇక స్వతంత్య్ర ప్రాంతం అని కూడా ప్రకటించారు ఐఆర్‌ఏ ప్రతినిధులు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం అదనపు బలగాలను తెప్పించి ఐఆర్‌ఏ మీద ధాటిగా దాడి చేసింది. ఐఆర్‌ఏ సైనికులు కనిపిస్తే కాల్చివేసేవారు. గాయాలతో దొరికిన వారిని అండమాన్ జైలుకు తరలించి చిత్రహింసలు పెట్టేవారు.

దీంతో ఐఆర్‌ఏ సభ్యులు రహస్య జీవితం గడపవలసి వచ్చింది. మహిళలు సాయుధ పోరాటంలో ఇమడలేరు. ఆ ఇబ్బందులు, కష్టాలు తట్టుకోలేరన్న ఉద్దేశంతో సూర్యసేన్ మహిళలకు ఐఆర్‌ఏలో చేర్చుకోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చిట్టగాంగ్ మహిళల సాయం కోరారు. వారిని కోవర్టులుగా నియమించుకున్నారు. రహస్యంగా ఆయుధాలు అందించడం, వార్తలు, బ్రిటీష్ ఎత్తుగడలకు సంబంధించిన సమాచారం సేకరించడం వంటి పనులు చేయించేవారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు ఐఆర్‌ఏ కోసం పనిచేశారు. అదనపు బలగాలున్నప్పటికీ ఐఆర్‌ఏ ఆగడాలు ఆగడం లేదన్న కోపంతో బ్రిటీష్ సర్కార్ వారి మీద ఇంకా ఒత్తిడి పెంచింది. ఐఆర్‌ఏ సభ్యులు అస్సలు బయటకు రాలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐఆర్‌ఏ కనుమరుగవడం ఖాయం. అప్పుడు రంగంలోకి దిగారు చిట్టగాంగ్ మహిళలు. ఆయుధాలు చేపట్టి బ్రిటీష్ వారితో ప్రత్యక్ష యుద్ధం చేశారు.

పుస్తకం రాసిన పరిస్థితులు

మార్చు

చైతన్య గర్భవతిగా ఉన్నప్పుడు చదివిన పుస్తకాలే చిట్ట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకానికి ఊపిరి పోశాయి. ఆ సమయంలో ఆమె చదివిన చిట్ట్టగాంగ్ అప్రైసింగ్ అనే పుస్తకంలో చిట్టగాంగ్ మహిళల గురించి చదివింది. వారు త్యాగాలు, పోరాట పటిమ చైతన్యను ఆకట్టుకున్నాయి. పుస్తకాలు, ప్రముఖులు, రచయితలు ఎంతోమందిని కలిసి చిట్టగాంగ్ సాయుధ పోరాటం గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకుంది. అదే సమయంలో నిర్భయ ఘటన జరగడంతో చిట్టగాంగ్ మహిళల స్ఫూర్తిని ఈతరానికి అందించాల్సిన అవసరం ఉంది. అందుకే పుస్తకం రాయాలని నిర్ణయించుకుంది.[2]

మూలాలు

మార్చు
  1. పింగళి చైతన్యకు యువ పురస్కారం 17-06-2016[permanent dead link]
  2. "చిట్టగాంగ్ వీరవనితల చైతన్య వారసత్వం". Archived from the original on 2016-06-22. Retrieved 2016-06-18.

ఇతర లింకులు

మార్చు