చిత్రలహరి

2019 చిత్రం

చిత్రలహరి 2019లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమించిలి, మోహన్ చురుకూరి నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించాడు.[1]

చిత్రలహరి
దర్శకత్వంకిషోర్ తిరుమల
రచనకిషోర్ తిరుమల
నిర్మాతనవీన్ యెర్నేని, రవిశంకర్ యలమించిలి, మోహన్ చురుకూరి
తారాగణంసాయి ధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
2019 ఏప్రిల్ 12 (2019-04-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

విజయ్ కృష్ణ చిన్నప్పటి నుంచి విజయం అంటే ఏమిటో తెలియని వ్యక్తి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. కానీ ఎక్కడా సరైన ఉద్యోగం దొరక్క ఒక టీవీ సర్వీసు సెంటర్ లో పనిచేస్తూ సమాజానికి ఉపయోగపడేది ఏదో ఒకటి కొత్తగా కనిపెట్టాలనే ఉత్సాహంతో తాను కనిపెట్టిన వాటిని ఆచరణలోకి తేవాలనే ఉద్దేశ్యంతో కంపెనీల చుట్టూ తిరుగుతుంటాడు. విజయ్ తండ్రి నారాయణరావు కూడా అతన్ని ప్రోత్సహిస్తుంటాడు.

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • పరుగు పరుగు , రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం.డేవిడ్ సిమోన్
  • క్లాస్మేట్స్, రచన: చంద్రబోస్, గానం. రాహుల్ సింప్లీ గంజ్ , పెంచల దాస్, దేవీశ్రీ ప్రసాద్
  • ప్రయత్నమే, రచన: చంద్రబోస్, గానం.కైలాశ్ ఖేర్, విష్ణు ప్రియా రవి
  • ప్రేమ వెన్నెలా, రచన: శ్రీమణి, గానం.సుదర్శన్ అశోక్ .

నిర్మాణం మార్చు

ఈ చిత్రానికి దర్శకుడు రచయిత కిషోర్ తిరుమల.[2] ఈ చిత్రానికి 1980–90 దశకాల్లో దూరదర్శన్ ఛానల్లో ప్రసారమైన పాటల కార్యక్రమం ఆధారంగా పేరు పెట్టారు.[3]

మూలాలు మార్చు

  1. ఈనాడు, సినిమా రివ్యూ (12 April 2019). "రివ్యూ: చిత్రలహరి". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 4 మే 2019. Retrieved 7 August 2019.
  2. "'చిత్రలహరి' మూవీ రివ్యూ.. ఓటమే గెలుపుకు తొలిమెట్టు." News18 తెలుగు. 12 April 2019. Archived from the original on 18 May 2019. Retrieved 18 May 2019.
  3. Sangeetha Devi, Dundoo (12 April 2019). "'Chitralahari' review: A few bright moments". The Hindu.